Singareni Recruitment 2024 : సింగరేణిలో 272 ఉద్యోగాలు – రాత పరీక్షల ‘కీ’ విడుదల, ఇదిగో లింక్

Best Web Hosting Provider In India 2024

Singareni Recruitment 2024 Updates : సింగరేణిలో 272 ఉద్యోగాల భర్తీకి రెండు రోజుల పాటు నిర్వహించిన కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలు జులై 21వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పరీక్షలకు సంబంధించి… సింగరేణి అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు. ‘కీ’ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటన చేశారు.

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష‌ల “కీ” ని https://scclmines.com వెబ్ సైట్ లో పొందుప‌ర‌చ‌డం జ‌రిగిందని అధికారులు పేర్కొన్నారు. అభ్య‌ర్థుల‌కు ఏవైనా అభ్యంత‌రాలు ఉంటే జులై 27వ తేదీలోగా తెలిపే అవ‌కాశం ఉంటుందని ఓ ప్రకటనలో తెలిపారు.

సింగరేణి సంస్థలో 272 ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి రెండు రోజులపాటు పరీక్షలను నిర్వహించారు. 12 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షలకు 12,045 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఈ ఉద్యోగాల భర్తీకి సంబంధించి అభ్యర్థులు ఎప్పటికప్పుడు పూర్తి వివరాలను https://scclmines.com/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సింగరేణి సంస్థలో 272 ఉద్యోగాల భర్తీకి ఫిబ్రవరి నెలలో ఎగ్జిక్యూటివ్‌, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. వీటిలో ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (మైనింగ్‌) పోస్టులు 139, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఐఈ) – 10, జూనియర్‌ ఎస్టేట్‌ ఆఫీసర్‌ -10, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (హైడ్రో–జియాలజిస్ట్‌) – 02, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (సివిల్‌) -18, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (ఎఫ్‌ అండ్‌ ఏ) – 22, మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (పర్సనల్‌) – 22, జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌ – 3, జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్‌ – 30 ఉన్నాయన్నారు. నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ క్యాడర్‌లో సబ్‌ ఓవర్సీస్‌ ట్రైనీ (సివిల్‌) – 16 పోస్టులు ఉన్నాయి.

ఆగస్టు 6, 7 తేదీల్లో పరీక్షలు…

సింగ‌రేణిలో మార్చి నెల‌లో జారీ చేసిన 2/2024 ఉద్యోగ‌ నోటిఫికేష‌న్ కు సంబంధించి కూడా అధికారులు మరో ప్రకటన చేశారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 7 ర‌కాల కేట‌గిరీ పోస్టుల‌ను భర్తీ చేయనున్నారు. ఇందుకోసం పరీక్ష తేదీలను ఖరారు చేశారు. ఆగ‌స్టు 6, 7వ తేదీల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.

WhatsApp channel

టాపిక్

SingareniEducationJobsRecruitment
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024