Anasuya Bharadwaj: ఒక్కరిలో మార్పు వచ్చిన చాలు.. యాంకర్ అనసూయ కామెంట్స్ వైరల్

Best Web Hosting Provider In India 2024

Anchor Anasuya About Air Pollution: యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న అనసూయ భరద్వాజ్ సినిమాల్లో నటిగా చాలా పాపులర్ అయింది. తన నటనతో విమర్శకుల నుంచి ప్రశంసలు సైతం అందుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే అనసూయ నటించిన లేటెస్ట్ మూవీ సింబా.

సూపర్ నాచురల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సింబా మూవీలో సీనియర్ హీరో జగపతి బాబు కూడా ప్రధాన పాత్ర పోషించారు. అలాగే ఇందులో బిగ్ బాస్ దివి వాద్యా, గృహలక్ష్మీ సీరియల్ కస్తూరి శంకర్ యాక్ట్ చేశారు. ఎయిర్ పొల్యూషన్ వల్ల కలిగే అనర్థాలు చెప్పేలా తెరకెక్కిన సింబా మూవీ ట్రైలర్‌ లాంచ్ ఇటీవల జరిగింది. ఈ ఈవెంట్‌లో అనసూయ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

“వృక్షో రక్షతి రక్షితః అనే కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం పర్యావరణాన్ని మనం ఎలా పాడు చేస్తున్నామో.. దానికి ఎలాంటి పర్యవసనాలను చూస్తున్నామో అందరికీ తెలిసిందే. సింబా చాలా మంచి కాన్సెప్ట్‌తో రాబోతోంది. సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్‌తో రాబోతోంది. అందరికీ నచ్చేలా ఈ చిత్రం ఉంటుంది” అని అనసూయ భరద్వాజ్ తెలిపింది.

“కబీర్, శ్రీనాథ్, వశిష్ట, దివి అద్భుతంగా నటించారు. జగపతి బాబు గారు ఈ చిత్రానికి ప్రధాన బలం. ఈ సినిమా ఒక్కరికి నచ్చినా కూడా ఒక్కరిలోనూ మార్పు తెచ్చినా ఎంతో మార్పు వస్తుంది. ఇంత మంచి చిత్రంలో నాకు ఛాన్స్ రావడం, ఇంత మంది టాలెంటెడ్ పర్సన్‌తో పని చేయడం ఆనందంగా ఉంది” అని ఒక్కరిలో అయినా మార్పు వస్తే చాలు అన్నవిధంగా అనసూయ చేసిన కామెంట్స్ ఇవైరల్ అవుతున్నాయి.

“నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన సంపత్ నంది, రాజేందర్ గారికి థాంక్స్. నేను సంపత్ నంది గారితో ఎన్నో ఏళ్ల నుంచి ఉంటున్నాను. నన్ను దర్శకుడిగా ఆయనే లాంచ్ చేస్తానన్నారు. ఈ మూవీకి కథ, స్క్రీన్ ప్లే ఆయనే అందించారు. నేను దర్శకత్వం వహించాను. ఈ చిత్రంలో నటించిన ప్రతీ ఒక్క ఆర్టిస్ట్‌కు థాంక్స్. అందరి సహకారంతోనే సినిమాను పూర్తి చేయగలిగాను” డైరెక్టర్ మురళీ మనోహర్ తెలిపారు.

“నాకు అద్భుతమైన టెక్నికల్ టీం దొరికింది. అందరూ అద్భుతమైన అవుట్‌పుట్ ఇచ్చారు. మా సినిమా ఆగస్ట్ 9న రాబోతోంది. ఇది సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్. ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద ఇలాంటి కాన్సెప్ట్ రాలేదు. అందరికీ ఈ సినిమా నచ్చుతుందని భావిస్తున్నాను” అని సింబా మూవీ డైరెక్టర్ మురళీ మనోహర్ అన్నారు.

“నాకు ఈ అవకాశం ఇచ్చిన సంపత్ నంది, మురళీ, రాజేందర్ గారికి థాంక్స్. నాకు సపోర్ట్ చేసిన టీంకు థాంక్స్. ఈ చిత్రం గురించి నేను చెప్పడం కంటే.. ఆడియెన్స్ చూసి తెలుసుకుంటే బాగుంటుంది” అని కెమెరామెన్ కృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు.

ప్రొడక్షన్ డిజైనర్ రాజీవ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. చాలా ఆనందంగా ఉంది. నాకు సపోర్ట్‌గా నిలిచిన టీంకు థాంక్స్” అని అన్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024