Best Web Hosting Provider In India 2024
26 Jul 2024 11:43 AM

కాకినాడ: సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వేధింపులు తాళలేక వైయస్ఆర్‌సీపీ నేత, వార్డు మెంబర్ బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణ ఆత్మహత్య చేసుకున్నారు. కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం వేట్లపాలెం 10వ వార్డు మెంబర్, వైయస్‌ఆర్‌సీపీ నేత బొబ్బిలి వీర వెంకట సత్యనారాయణను గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వేధిస్తున్న టీడీపీ నేతలు
వేధింపులు తారాస్థాయికి చేరడంతో బలవన్మరణం పొందాడు. ఇంకెంత మంది ప్రాణాలను బలి తీసుకుంటారు నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, హోం మంత్రి అనిత ? మీ రక్తదాహం ఇంకా తీరలేదా? అంటూ పార్టీ శ్రేణులు, బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.