Best Web Hosting Provider In India 2024

మీడియా సమావేశంలో వైయస్ఆర్‌సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి
వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం దుష్ప్రచారం
పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదు
గతంలో రాష్ట్ర అప్పు రూ.14 లక్షల కోట్లు అని విపరీతంగా దుష్ప్రచారం చేశారు
పచ్చి అబద్దాలు చెబుతున్న చంద్రబాబు, గవర్నర్ ప్రసంగంలో కూడా అవే చెప్పించాడు
2019లో మేము అధికారం చేపట్టేనాటికి ఖజానాలో ఉన్న మొత్తం కేవలం రూ.100 కోట్లు మాత్రమే.
బాబు అధికారం దిగిపోయే నాటికి ఉన్న అప్పు 2,71,798 కోట్లు
ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు చూస్తే.. రూ. 5,18,708 కోట్లు
రషీద్ దారుణ హత్య నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం కుట్ర అంటూ దుష్ప్రచారం
ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే.. చివరకు ఆమె బాడీ ఇంకా దొరక్కపోయినా, ప్రభుత్వం స్పందించలేదు.
రాష్ట్రమంతా రెడ్‌బుక్ హోర్డింగ్‌లు ప్రదర్శిస్తూ.. బెదిరింపులు
వైయస్ జగన్ కనుక ఉండి ఉంటే ఈపాటికే అమ్మ ఒడి, రైతు భరోసా, వసతి దీవెన అందేవి
సూపర్ సిక్స్‌లో తల్లికి వందనం లేదు?.. మూడు ఉచిత సిలిండర్లు లేవు
పోలవరం ప్రాజెక్టులో తప్పులన్నీ చంద్రబాబు చేసి, మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు
మా ప్రభుత్వంలో ఇసుక రేటు కంటే ఇప్పుడు ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు.
తాడేపల్లి: ఈ రోజు ఆంధ్రప్రదేశ్ నిర్వచనం మారిందని..అరాచకం..ఆటవికం..రెడ్‌బుక్ పాలనగా చంద్రబాబు మార్చారని వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయకుండా వైట్ పేపర్ల పేరుతో దుష్ప్రచారం మొదలుపెట్టిందని, ఈ వైట్ పేపర్లు అన్నీ కూడా అబద్ధాలే అన్నారు. రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా, హత్యా రాజకీయాలు చేస్తున్నాడు. అలా వారిని భయపెడుతున్నాడు. అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి. చంద్రబాబుకు ఒక మోడ్ ఆఫ్ ఆపరెండిస్ ఉంటుంది. అది ఒక వంచన. దగా, మోసం అని విమర్శించారు. ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయడం. ప్రచారం చేసుకోవడం చంద్రబాబుకు అలవాటు అని ధ్వజమెత్తారు. వైట్ పేపర్ల పేరుతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుష్రచారాలపై వైయస్ జగన్ దీటైన జవాబు ఇ చ్చారు. శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్ ఆఫీస్‌లో వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
వైయస్ జగన్ ప్రెస్‌మీట్ ముఖ్యాంశాలు ఇలా..
- పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం లేదు
- ఎన్నికల ఫలితాలు వచ్చి 52 రోజులు.
- ఇన్ని రోజులు రాష్గ్రం ఏ దిశలో పయనిస్తోంది. రాష్ట్రం పూర్తిగా రివర్స్‌లో వెళ్తోంది. ప్రశ్నించే హక్కు లేదు. ఎక్కడికక్కడ అణిచివేత.
- ఇది చాలా బాధాకరం.
- ఎక్కడైనా ప్రభుత్వం ఏర్పడితే, 12 నెలలకు బడ్జెట్ ప్రవేశపెడుతుంది.
- కానీ, ఈ ప్రభుత్వం, 7 నెలల కోసం కూడా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదు.
- రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టే ధైర్యం కూడా చంద్రబాబుకు లేదు. అందుకే ఓట్ ఆన్ ఎక్కైంట్.
- చంద్రబాబుకు ఆ ధైర్యం లేదు. ఎందుకంటే, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే, తాను ఎన్నికల ముందు ప్రకటించిన మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపాలి,
- కానీ, అలా చూపే పరిస్థితి చంద్రబాబుకు లేదు. ఎందుకంటే, ఆ పథకాలు చిత్తశుద్ధితో అమలు చేసే అలవాటు చంద్రబాబుకు లేదు.
- పథకాలకు నిధులు కేటాయింపు ప్రస్తావిస్తే, తాను అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది కాబట్టి, రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెట్టకుండా దాటవేస్తున్నాడు.
- ఎన్నికల ముందు ఏయే పథకాలపై హామీ ఇచ్చాడు. వాటికి నిధులు కేటాయించి, అమలు చేస్తాడా అని ప్రజలు చూస్తున్నారు.
- భయపెడుతున్నారు:
- రాష్ట్రంలో ప్రజలు బయటకు రాకుండా, ప్రశ్నించకుండా, హత్యా రాజకీయాలు చేస్తున్నాడు. అలా వారిని భయపెడుతున్నాడు.
- అలాంటి భయానక పరిస్థితులు రాష్ట్రంలో ఉన్నాయి.
- చంద్రబాబుకు ఒక మోడ్ ఆఫ్ ఆపరెండిస్ ఉంటుంది. అది ఒక వంచన. దగా, మోసం.
- ఒక మనిషిని అప్రతిష్ట పాల్జేయడం. ప్రచారం చేసుకోవడం ఆయనకు అలవాటు.
- తాను ఎంచుకున్న, టార్గెట్ చేసిన వ్యక్తిపై విమర్శలు. దానిపై అందరూ మాట్లాడతారు.
- ఆ తర్వాత అనుకూల ఛానళ్లలో చర్చలు. వాటిలో నిశిత విమర్శలు.
- అంతా చేసి, చివరకు ఏం కంక్యూజన్ ఇస్తారంటే.. రాష్ట్రం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. కాబట్టి చంద్రబాబు చేస్తోంది మంచి అనిపిస్తారు.
- ఆనాడు ఎన్టీఆర్‌ను గద్దె దింపడం మొదలు.. ఆ తర్వాత బీజేపీని తిట్టడం, మళ్లీ దగ్గరకు వెళ్లడం. మధ్యలో మరో పార్టీకి చేరువ కావడం. తాను ఏది చేసినా, అది మంచిదే అన్నది చెప్పుకుంటాడు.
- దాన్ని అందరితో ఔను అనిపించుకోవడం కోసం ట్రై చేస్తాడు.
- ఇప్పుడు చంద్రబాబు తాజాగా ఎంచుకున్న విషయం.
- రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయి. అంత అరాచకం ఉంది. దానికి కారణం మా ప్రభుత్వం అని నిందిస్తున్నారు.
అందులో మొదటి స్టోరీ.
- రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయాయని ప్రచారం.
- గత ఎన్నికల ముందు ఏమని ప్రచారం చేశారు? రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు అని విపరీతంగా దుష్ప్రచారం చేశారు.
- మరోవైపు.. లెక్కకు మించి హామీలు.. సూపర్ సిక్స్ అంటూ హామీలు.
- ఎన్నికల తరవాత, హామీల అమలు చేయాల్సి రావడంతో.. చంద్రబాబు మరో మోడస్ ఆపరెండికి దిగాడు.
- రాష్ట్ర అప్పు 14 లక్షల కోట్లు లేకున్నా.. అలా చూపాలని చాలా ప్రయత్నం చేశారు. అది సాధ్యం కావడంతో.. రూ.10 లక్షల కోట్లు అప్పు అన్నారు. దాన్నే గవర్నర్‌గారి ప్రసంగంలో చెప్పించారు.
- పచ్చి అబద్దాలు చెబుతున్న చంద్రబాబు, గవర్నర్‌గారి ప్రసంగంలో కూడా అవే చెప్పించాడు.
- రెగ్యులర్ బడ్జెట్ ప్రవేశపెడితే, అన్ని వివరాలు స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది కాబట్టి, ఆ పని చేయడం లేదు.
- నిజానికి ప్రభుత్వ అప్పులు ఎన్ని అని చూస్తే..
- ఈ ఏడాది జూన్ వరకు ప్రభుత్వ అప్పు చూస్తే.. అవి 5,18,708 కోట్లు.
- బాబు అధికారం దిగిపోయే నాటికి ఉన్న అప్పు 2,71,798 కోట్లు
- అదే రాష్ట్ర విభజన నాటికి ఉన్న అప్పు రూ.1,18,051 కోట్లు
గవర్నమెంట్ గ్యారెంటీల అప్పులు కూడా చూస్తే..
- చంద్రబాబు దిగే నాటికి చూస్తే.. రూ.50 వేల కోట్లు. అవి మా ప్రభుత్వం దిగి పోయే నాటికి ఆ అప్పు రూ.1,06,000 కోట్లు మాత్రమే.
- ఇంకా స్టేట్ లయబిలిటీ అప్పులన్నీ కూడా కలిపి చూస్తే..
- బాబు అధికారంలోకి వచ్చే నాటికి ఉన్న మొత్తం అప్పు రూ.1,53,347
- కోట్లు ఉండగా, ఆయన దిగిపోయే నాటికి అవి రూ.4,08,710 కోట్లకు చేరాయి. ఇది 21.63 శాతం పెరుగుదల.
- అదే మన ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ,7,48,000 కోట్లు అప్పు ఉంది. ఇది 12.90 శాతం మాత్రమే పెరుగుదల.
- మరి, ఆయన హయాంలో అప్పులు ఎక్కువయ్యాయా? లేక మా హయాంలోనా? దీన్ని అందరూ గుర్తించాలి.
కేంద్ర ఆర్థిక సర్వేలో.. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ప్రశంసించారు.
- రాష్ట్ర అప్పులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పిన కేంద్రం.. ఆ మొత్తం రూ.4,85,491 కోట్లు మాత్రమే.
- నిజానికి కోవిడ్ సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం చాలా తగ్గింది.
- అప్పుడు అవసరమైన అప్పు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించినా, ప్రభుత్వం శక్తికి మించి అప్పు చేయలేదు.
- 2019లో మేము అధికారం చేపట్టేనాటికి ఖజానాలో ఉన్న మొత్తం కేవలం రూ.100 కోట్లు మాత్రమే.
- అదే విషయాన్ని ఆనాడు ఎల్లో మీడియా (ఈనాడు) కూడా రాసింది.
- అయినా, అప్పుడు మేము, ఎన్నికల ముందు ఇచ్చిన హామీల అమలు గురించి ప్రకటించాము.
- పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టాం. కానీ, ఇలా చంద్రబాబు మాదిరిగా 7 నెలల కోసం ఓట్ ఆన్ ఎక్కౌంట్‌కు వెళ్లలేదు.
- అప్పటి నుంచి ప్రతి ఒక్క పథకాన్ని డేట్‌తో సహా ప్రకటించి, ప్రతిదీ పక్కాగా అమలు చేశాం.
- అలా ఈ అయిదేళ్లలో కులం, మతం, రాజకీయం చూడకుండా, వారు మా పార్టీకి ఓటు వేయకపోయినా సరే, అర్హతే ప్రామాణికంగా పథకాలు అమలు చేశాము.
- అలా ఈ 5 ఏళ్లలో ఏకంగా రూ.2.70 లక్షల కోట్లు, నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డీబీటీ (ప్రత్యక్ష నగదు బదిలీ) ద్వారా వేశాం.
- రూ.5,655 కోట్లు కేంద్రం నుంచి జూన్ 10న వచ్చాయి. దీంతో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే నాటికి రాష్ట్ర ఖజానాలో.. అంటే జూన్ 12 నాటికి రాష్ట్ర ఖజానాలో దాదాపు రూ.7 వేల కోట్లు ఉన్నాయి.
- అయినా చంద్రబాబు డ్రామాలు ఆడుతూ, ఓట్ ఆన్ ఎక్కౌంట్ ప్రవేశపెడుతున్నాడు.
- అలా పథకాల అమలు నుంచి తప్పుకుంటున్నారు.
- అందుకే చంద్రబాబు విడుదల చేస్తోంది ‘వైట్ పేపర్లు కాదు. తప్పుడు పేపర్లు’.
- వాటికి సంబంధించిన ఆధారాలు (కాపీలు) కూడా ఇస్తాము. మీరు వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లండి.
- మాపై నిందలు మోపడం, విమర్శించడం కోసం అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారు. కాబట్టి, వాస్తవాలు మీరూ విశ్లేషించండి. ప్రజలకు వివరించండి.
చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్:
- రషీద్ దారుణ హత్యను ఖండిస్తూ.. నేను వినుకొండ వెళ్తుంటే.. దాన్నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం, మదనపల్లె ఆర్డీఓ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగితే.. అది కుట్ర అంటూ దుష్ప్రచారం చేశారు.
- ఆ ఘటనపై రెండుసార్లు రివ్యూ. డీజీపీని హుటాహుటిన మదనపల్లెకు హెలికాప్టర్‌లో పంపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై నిందలు మోపుతూ.. నానా హంగామా చేశారు.
- దానిపై ఎల్లో మీడియాలో విపరీతంగా ప్రచారం.
- ఆర్డీఓ ఆఫీస్‌లో ఒకవేళ డాక్యుమెంటు కాలిపోతే, అవే రికార్డులు ఎమ్మార్వో ఆఫీస్‌లో ఉంటాయి. కలెక్టర్ ఆఫీస్‌లో ఉంటాయి. చివరకు ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటాయి.
- అయినా ఏదో జరిగిపోతున్నట్లు దారుణంగా హైడ్రామా.
- పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని అప్రతిష్టపాల్జేయడం కోసం నానా నిందలు. విమర్శలు. ఆయన 7సార్లు ఎమ్మెల్యే. ఆయన కొడుకు మూడుసార్లు ఎంపీ.
- అలాంటి వారిపై దాడి. ఆస్తుల విధ్వంసం.
- మళ్లీ వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణం.
- మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగితే, డీజీపీని హెలికాప్టర్‌లో పంపిన చంద్రబాబు.. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అదృశ్యమైతే.. చివరకు ఆమె బాడీ ఇంకా దొరక్కపోయినా, ప్రభుత్వం స్పందించలేదు.
- కేసు దర్యాప్తులో ఉండగానే, ఎస్పీ బదిలీ. ఒక అనుమానితుడి లాకప్ డెత్.
- రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 45 రోజుల్లో 12 మందిపై అత్యాచారం.
- మా ప్రభుత్వ హయాంలో దిశ పోలీస్ స్టేషన్లు. దిశ యాప్. మహిళలకు ఒక వరంలా ఉండేది.
- ఆపదలో ఉన్న మహిళలు.. యాప్‌ను వినియోగించినా, ఫోన్‌ను 5సార్లు ఊపినా.. వెంటనే పోలీసులు అక్కడికి చేరుకునే వారు.
- ఇప్పుడు అవేవీ పని చేయడం లేదు. ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది కాబట్టి.
ఎన్నికల్లో పల్నాడు జిల్లాలో దారుణం:
- మా సీనియర్ ఎమ్మెల్యేపై అక్రమంగా కేసు బనాయింపు.
- ఎస్పీని మార్చారు. తమకు అనుకూలంగా ఉండే బిందుమాధవ్‌ను తెచ్చుకుంటే, ఆయన ఇష్టానుసారం వ్యవహరించాడు.
- దీంతో ఎన్నికల సంఘమే స్పందించి, ఆయనను బదిలీ చేసింది.
- శ్రీనివాసులు అనే అధికారి ఎస్పీగా వచ్చిన వెంటనే వినుకొండలో రషీద్ హత్య జరిగింది.
లోకేష్ రెడ్ బుక్:
- సీఎం కొడుకు. మంత్రి అయిన నారా లోకేష్ ఏకంగా ఇలా రెడ్‌బుక్ ప్రదర్శిస్తూ.. బెదిరింపులు. రాష్ట్రమంతా హోర్డింగ్‌లు.
- ఎంత దారుణం. అలా ఏం సందేశం ఇవ్వదల్చారు?.
- ఈరోజు ఆంధ్రప్రదేశ్ అంటే అరాచకం. ఆటవికం. రెడ్‌బుక్ పాలన.
- రాష్ట్రంలో ఎవరూ రోడ్లపైకి రావొద్దు. హామీలు అమలు చేయకపోయినా, చంద్రబాబును ప్రశ్నించకూడదు.
- అలా ఎవరైనా చేస్తే, ఏం జరుగుతుంది అన్నది చెప్పడం కోసం ఇవన్నీ చేస్తున్నారు.
ప్రజల్లో ఆలోచన మొదలైంది:
- ఇప్పటికే ప్రజల్లో చర్చ మొదలైంది. వైయస్ జగన్ కనుక ఉండి ఉంటే అమ్మ ఒడి అమలు అయి ఉండేదని. జూన్‌లో 43 లక్షల మంది తల్లులకు పథకంలో నిధులు జమ అయి ఉండేవి.
- ఏమన్నా అంటే వివరాలు సక్రమంగా లేవంటారు. 50 రోజులైంది. ఇంకా డేటా ఏమిటి?.
- అమ్మ ఒడి (తల్లికి వందనం) కోసం 43 లక్షల తల్లులు, 82 లక్షల పిల్లలు ఎదురుచూస్తున్నారు.
- రైతులు పెట్టుబడి సాయం కోసం చూస్తున్నారు.
- వైయస్ జగనే ఉండి ఉంటే.. ఇప్పటికే రైతు భరోసాలో తొలి విడత సాయం అంది ఉండేదని.
- కానీ, మీరేం చేశారు? రూ.20 వేలు ఇస్తామని చెప్పి, మొత్తానికే ఇప్పటికి ఎగ్గొట్టారు.
- రైతులకు ఉచిత పంటల బీమా అమలు కావడం లేదు.
- మీరు బీమా సొమ్ము కడితే, వారికి పరిహారం అంది ఉండేది. కానీ మీరు పట్టించుకోవడం లేదు.
- మేము గతంలో ప్రతి ఎకరాకు ఇన్సూర్ చేశాం. జియో ట్యాగింగ్ చేశాం. ఆర్బీకేల ద్వారా అన్నీ అందాయి.
- విద్యాదీవెన. వసతి దీవెన:
- వైయస్ జగనే ఉండి ఉంటే.. ఇప్పటికే విద్యాదీవెన కింద ఒక త్రైమాసిక ఫీజు వచ్చి ఉండేది.
- అలాగే, వసతి దీవెన కింద పిల్లలకు ఒక విడత లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద ఆర్థిక సాయం అంది ఉండేది.
- డ్వాక్రా సంఘాలకు సున్నా వడ్డీ..ఇంకా అక్కచెల్లెమ్మలకు సున్నా వడ్డీ ప్రయోజనాలు అంది ఉండేవి. కానీ ఇప్పుడు అది జరగడం లేదు.
సూపర్ సిక్స్ ఏమైంది?:
- అందులో ప్రకటించిన పథకాలు ఏమయ్యాయి?
- తల్లికి వందనం లేదు? మూడు ఉచిత సిలిండర్లు లేవు.
- 18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మలకు నెలకు రూ.1500 ఏమయ్యాయి? ఆ వివరాలు ఉన్నాయి కదా?
- ఓటర్ల జాబితాలో 18 ఏళ్లు నిండిన వారే ఉంటారు? ఆ జాబితా చాలు కదా?.
పోలవరం ప్రాజెక్టు పనులపై వాస్తవాలు:
- ప్రాజెక్టు పనులు క్రమ పద్ధతిలో చేయలేదు.
- ప్రొటోకాల్ ప్రకారం పనులు చేయకపోవడం వల్ల.. డయాఫ్రమ్ వాల్ పూర్తి చేయకుండా, కాఫర్ డ్యామ్ పనులు మొదలు పెట్టడం.. అవి పూర్తి కాకపోవడం.. మరోవైపు స్పిల్‌వే పనులు చేయకపోవడం వల్ల, వరద నీరు పోవడం కోసం కాఫర్ డ్యామ్‌ల మధ్య గ్యాప్‌లు వదిలారు.
- దీంతో భారీ వరద మధ్యలో నుంచి పోలేక.. డయాఫ్రమ్‌వాల్‌ను ధ్వంసం చేసింది.
- ఇలా తప్పులన్నీ చేసిన చంద్రబాబు, మా ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారు.
- నిజానికి పోలవరం ప్రాజెక్టును కేంద్రం కడతామంది. అది విభజన చట్టంలో కూడా ఉంది.
- కానీ చంద్రబాబు, ఆ ప్రాజెక్టు బాధ్యత తీసుకున్నారు. అంతే కాకుండా, ప్రాజెక్టు పనులను 2013–14 రేట్లకే చేస్తామని అంగీకరించడం వల్ల అప్పటి అంచనా వ్యయం రూ.20,398.61 కోట్లతోనే పూర్తి చేస్తామని అంగీకరించినట్లు అయింది.
- మరోవైపు కాంట్రాక్ట్ పనులను కూడా రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన నవయుగ కంపెనీకి, మరో కాంట్రాక్ట్ యనమల రామకృష్ణుడి వియ్యంకుడికి ఇచ్చాడు.
- కానీ, గత ప్రభుత్వం ప్రొటోకాల్‌కు విరుద్ధంగా ప్రాజెక్టు పనులు చేయడం వల్ల, నిర్మాణ వ్యయం గణనీయంగా పెరిగింది.
- దీంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మా ప్రభుత్వం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. పెరిగిన ప్రాజెక్టు వ్యయానికి అనుగుణంగా నిధులు రాబట్టడం కోసం మూడేళ్లపాటు గట్టి పోరాటం చేయాల్సి వచ్చింది.
- ఎట్టకేలకు ప్రాజెక్టు వ్యయ అంచనా రూ.55,656 కోట్లకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం పొందింది.
మా ప్రభుత్వ హయాంలో..
- ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌కు సంబంధించి కాంక్రీట్ పనులు పూర్తి చేశాం.
- హైడల్ ప్రాజెక్టులకు సంబంధించి, సొరంగం పనులు పూర్తి చేశాం.
- స్పిల్‌వే పనులు కూడా మా ప్రభుత్వంలోనే పూర్తి చేశాం.
- ఇవన్నీ చేశాం కాబట్టే.. నదిలో 26 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా, స్పిల్‌వే మీదుగా నీరు సాఫీగా ముందుకు పోయింది.
ఇసుక విధానం. ప్రభుత్వ ఆదాయం:
- మా ప్రభుత్వ హయాంలో స్పష్టమైన ఇసుక విధానం అమలు చేశాం. పక్కాగా టెండర్లు నిర్వహించాం. ప్రతిదీ పారదర్శకంగా సాగింది.
- మేము టన్ను ఇసుక రూ.375 చొప్పున అమ్మాం. దీని వల్ల ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్ల ఆదాయం వచ్చింది.
- ఆనాడు, ఇసుక రేట్లు పేపర్లతో ప్రకటించి, పూర్తి పారదర్శకంగా సరఫరా చేశాం.
- కానీ ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం ఫ్రీ ఇసుక అని ప్రచారం చేస్తోంది.
- కానీ వాస్తవంగా అప్పటి మా రేటు కంటే ఇప్పుడు, ఎక్కువ ధరకు సరఫరా చేస్తున్నారు.
- ఇది దారుణం కాదా?
- ఇంకా మా ప్రభుత్వం, ఈ వర్షాకాల సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని స్టాక్ యార్డుల్లో దాదాపు 80 లక్షల టన్నుల ఇసుక స్టాక్ చేసి పెడితే.. చంద్రబాబు, ఆయన కుమారుడు వాటి ఎదుట సెల్ఫీలు దిగారు.
- అంతే కాకుండా, ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇష్టానుసారం ఇసుక రీచ్‌ల మీద పడి దోచుకున్నారు.
- అలా దాదాపు 40 లక్షల టన్నుల ఇసుకను మాయం చేశారు. యథేచ్ఛగా అమ్ముకున్నారు.
- ఇప్పుడు వారిపై చంద్రబాబు చర్య తీసుకోగలరా?
- దశాబ్ధాలుగా మైన్స్‌ను దోచుకున్నారు. కానీ పెద్దిరెడ్డిగారు టార్గెట్‌గా నిరంతరం ఆరోపణలు చేస్తున్నారు.
- గనులు, భూగర్భ వనరుల శాఖ ఆదాయం 2018–2019 లో రూ.2200 కోట్లు.
- అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2023–24లో గనులు, భూగర్భ వనరుల శాఖ ఆదాయం రూ.4 వేల కోట్లు.
- మరి ఎక్కడ, ఎవరి హయాంలో అవినీతి జరిగింది?
- అదే విధంగా, ఏపీఎండీసీ ఆదాయం 2018–19లో రూ.400 కోట్లు.
- అదే మా ప్రభుత్వం దిగిపోయే నాటికి, అంటే 2023–24లో ఆ ఆదాయం రూ.3200 కోట్లు.
- మరి ఎవరి హయాంలో అక్రమాలు జరిగాయి? ఎవరి హయాంలో ప్రజలకు మేలు జరిగింది?.
మద్యం విక్రయాలు. ధరలు. వాస్తవాలు:
- 2014–19 మధ్య టీడీపీ హయాంలో మద్యం సిండికేట్ చెలరేగడంతో పర్మిట్ రూమ్‌లు, బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారింది.
- అధికారికంగా మద్యం అమ్మకాల సమయం ఉ.10 గం. నుంచి రాత్రి 11 వరకే అయినా, అనధికారికంగా 24 గంటలూ దందా.
- అప్పుడు 4,380 మద్యం దుకాణాలకు అనుమతి ఇస్తే.. అదే సంఖ్యలో వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు కొనసాగాయి.
- మరోవైపు విచ్చలవిడిగా ఊరూరా.. 43 వేలకు పైగా బెల్ట్‌షాపులు. వాటిలో మద్యం గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ) కంటే 25 శాతం అధిక ధరలకు మద్యం అమ్మారు.
- ఇంకా ఏటా బార్లు పెంచారు. ఆ మేరకు లైసెన్సులు ఇచ్చారు.
- దీంతో బడి, గుడి అనే స్పృహ లేకుండా విచ్చలవిడిగా మద్యం దుకాణాలు ఏర్పాటయ్యాయి. వాటికి అనుగుణంగా పర్మిట్‌రూమ్‌లు పని చేశాయి.
- మరి, ఎవరి హయాంలో మద్యం విక్రయాలు దారుణంగా ఉన్నాయి.
చంద్రబాబు హయాంలోనే కొత్త బ్రాండ్లు:
- వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కొత్తగా, ఏ డిస్టిలరీకి అనుమతి ఇవ్వలేదు. మద్యం బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.
- ప్రెసిడెంట్ మెడల్, హైదరాబాద్ బ్లూ డీలక్స్.. ఈ రెండు బ్రాండ్ల విస్కీకి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు. 2017 నవంబరు 22న అనుమతి ఇచ్చారు.
- గవర్నర్ రిజర్వ్, లెఫైర్ నెపోలియన్, ఓక్టోన్ బారెల్ ఏజ్డ్, సెవెన్త్ హెవెన్ బ్లూ.. పేర్లతో దాదాపు 15 బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా నాడు, ఒకేరోజు చంద్రబాబు ప్రభుత్వమే.. 2018, అక్టోబరు 26న అనుమతి ఇచ్చింది.
- ఇంకా హైవోల్టేజ్, వోల్టేజ్ గోల్డ్, ఎస్‌ఎన్‌జీ 10000, బ్రిటీష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బీర్, బ్రిటీష్ ఎంపైర్ అల్ట్రా బ్రాండ్ల.. బీర్లు సైతం చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకమే. వాటన్నింటికి 2017, జూన్ 7న అనుమతి ఇచ్చారు.
- రాయల్ ప్యాలెస్, న్యూకింగ్, సైన్ అవుట్.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా చంద్రబాబే.. 2018, నవంబరు 9న అనుమతిచ్చారు.
- బిరా 91 పేరుతో మూడు రకాల బీర్ బ్రాండ్లకు కూడా అపధర్మంగా ఉన్న (ఎన్నికలు జరిగి, ఫలితాలు వెలువడక ముందు) చంద్రబాబు ప్రభుత్వం 2019, మే 14న అనుమతి ఇచ్చారు.
- మరో అడుగు ముందుకేసి ఆ మర్నాడే (2019, మే 15న) టీఐ మ్యాన్షన్ హౌస్, టీఐ కొరియర్ నెపోలియన్.. బ్రాండ్ల విస్కీ, బ్రాందీకి కూడా క్లియరెన్స్ ఇచ్చారు.
- రాష్ట్రంలో 20 మద్యం డిస్టిలరీలు ఉంటే. వాటిలో 14 డిస్టిలరీలకు చంద్రబాబు సీఎంగా ఉండగానే అనుమతినిచ్చారు. మిగిలిన 6 డిస్టిలరీలు అంతకు ముందున్న ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి.
- మా ప్రభుత్వ హయాంలో ఒక్క డిస్టిలరీకి కూడా అనుమతి ఇవ్వలేదు.
- అందుకే టీడీపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన డిస్టిలరీలు తయారు చేసిన మద్యం విక్రయాలే.. వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కూడా కొనసాగాయి.
- మరి,వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం కొత్తగా చేసిన అక్రమం ఏముంది?. దీనికి చంద్రబాబు సమాధానం చెప్పగలరా?.
టీడీపీ, వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వాలు.
మద్యం విక్రయాల డేటా:
దశలవారీ మద్య నియంత్రణను వైయజస్సార్‌సీపీ ప్రభుత్వం సమర్థంగా అమలు చేసింది. ఆ దిశలో పలు చర్యలు తీసుకున్నాం.
అవి, ఏయేవి అన్నది చూస్తే..:
- టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా, వాటిని 2,934కు తగ్గించాము.
- ప్రతి వైన్ షాప్‌కు అనుబంధంగా ఉన్న 4,380 పర్మిట్ రూమ్‌లు రద్దు చేశాం. ఊరూరా విచ్చలవిడిగా కొనసాగిన 43 వేల బెల్ట్‌షాప్‌లు రద్దు చేశాం. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వలేదు.
- ప్రైవేటు మద్యం దుకాణ విధానాన్ని రద్దు చేసి, 2019, అక్టోబరు 1 నుంచి, వాటిని ప్రభుత్వ ఆధ్వర్యంలో కొనసాగించాం.
- మద్యం విక్రయ వేళలు కూడా కుదించాం. ఉ. 10 గం. నుంచి రాత్రి 9 గం. వరకే మద్యం విక్రయాలు అనుమతించాం.
- ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి కట్టుబడుతూ, మద్యం వినియోగాన్ని నిరుత్సాహ పర్చేందుకు షాక్ కొట్టేలా ధరలు పెంచాం.
- అక్రమ మద్యాన్ని అరికట్టేందుకు ‘స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో’ (ఎస్‌ఈబీ) ఏర్పాటు చేశాం.
- వీటన్నింటి వల్ల టీడీపీ ప్రభుత్వ హయాంలో కంటే, మా ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు తగ్గాయి. దాదాపు సగానికి పడిపోయాయి.
డిజిటల్ పేమెంట్స్:
ఇంకా మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్ విధానాన్ని ప్రవేశపెట్టింది మా ప్రభుత్వమే. అయినా మాపై పదే పదే దుష్ప్రచారం చేస్తున్నారు.
నాణ్యతలేని మద్యం అంటూ ఆరోపణలు:
- ఇంకా నాణ్యత లేని మద్యం సరఫరాతో, వినియోగదార్ల ఆరోగ్యం దెబ్బతిందంటూ దుష్ప్రచారం చేశారు.
- నాటి మద్యంలో విషపు అవశేషాలు ఉన్నట్లు చెన్నైలోని ఎస్‌జీఎస్ లేబొరేటరీ పేరిట ఓ తప్పుడు నివేదికను టీడీపీ ప్రచారంలోకి
- తెచ్చింది. అయితే అలాంటి నివేదికేదీ తాము ఇవ్వలేదని ఆ సంస్థ స్పష్టం చేసింది. తాము పరీక్షించిన మద్యం నమూనాల్లో అవశేషాలు పరిమితికి లోబడే ఉన్నాయని, అవి ప్రమాదకరం కాని సహజ సిద్ధమైన మొక్కల నుంచి తయారైనవేనని ఆ లేబొరేటరీ ప్రకటించింది. తమ నివేదికను తప్పుగా అన్వయించారని పేర్కొంది.
- అయినప్పటికీ రాష్ట్ర బెవరేజస్ కార్పొరేషన్ మద్యం నమూనాలను హైదరాబాద్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్)కు చెందిన ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) ల్యాబ్‌లో పరీక్షించడం జరిగింది.
- ఆ శాంపిల్స్ (నమూనాలు) అన్నీ నిర్దేశిత ప్రమాణాల ప్రకారమే ఉన్నాయని ఐఐసీటీ కూడా నివేదిక ఇచ్చింది.
- శ్వేతపత్రం పేరుతో అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు చెప్పిన చంద్రబాబు.. నాడు మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా అలాగే దుష్ప్రచారం చేశారు.
- 2019 ఎన్నికల్లో మేము ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నాము. చంద్రబాబు ప్రభుత్వంతో పోలిస్తే.. మా హయాంలో మద్యం విక్రయాలు తగ్గించాము.
ఆ వివరాలు ఇవీ..:
2014–19. టీడీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు..
ఏడాది ఐఎంఎల్ (మద్యం) బీర్లు (కేసుల్లో)
2014–15 2.88 కోట్లు 1.74కోట్లు
2015–16 3.06 కోట్లు 1.75 కోట్లు
2016–17 3.32 కోట్లు 1.78 కోట్లు
2017–18 3.60 కోట్లు 2.27 కోట్లు
2018–19 3.84 కోట్లు 2.77 కోట్లు
2019–24. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విక్రయాలు..
ఏడాది ఐఎంఎల్ (మద్యం) బీర్లు (కేసుల్లో)
2019–20 3.08 కోట్లు 2.12 కోట్లు
2020–21 1.87 కోట్లు 57 లక్షలు
2021–22 2.63 కోట్లు 82 లక్షలు
2022–23 3.35 కోట్లు 1.16 కోట్లు
2023–24 3.32 కోట్లు 1.12 కోట్లు