OTT Release: ఓటీటీలోకి సడెన్‌గా వచ్చేసిన తొలి పారాలింపిక్స్ విజేత బయోపిక్- థ్రిల్లింగ్ ట్విస్టులు- స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Chandu Champion OTT Release: ఓటీటీ అనేది ఒక మహాసముద్రం లాంటిది. ఎప్పటికప్పుడు సరికొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ప్రతి వారం విభిన్న కంటెంట్‌తో సినిమాలు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. కొన్ని నేరుగా ఓటీటీల్లో రిలీజ్ అవుతుంటే.. మరికొన్ని థియేట్రికల్ రన్ తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుంటాయి.

అయితే మరికొన్ని సినిమాలు మాత్రం ఎలాంటి చడీ చప్పుడు లేకుండా సడెన్‌గా ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తాయి. అలాంటి సినిమానే చందు ఛాంపియన్. ఇండియాకు పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణ పతకం తీసుకొచ్చిన మురళీకాంత్ పేట్కర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ సినిమానే చందు ఛాంపియన్. కార్తీక్ ఆర్యన్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

బాలీవుడ్ టాప్ డైరెక్టర్లలో ఒకరైన కబీర్ ఖాన్ తెరకెక్కించిన చందు ఛాంపియన్ సినిమా జూన్ 14న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, సినిమాకు, కార్తీక్ ఆర్యన్ నటనకు ఎంతగానో ప్రశంసలు వచ్చిన బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం రాబట్టలేకపోయింది చందు ఛాంపియన్. నిజానికి మురళీకాంత్ పేట్కర్ జీవితంలో ఎదురైన కీలక మలుపులు, థ్రిల్లింగ్ ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమా యావరేజ్‌గా నిలిచింది.

ఫలింతంగా రూ. 70 నుంచి 140 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన చందు ఛాంపియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ. 88.14 నుంచి 96 కోట్ల వరకు మాత్రమే కలెక్షన్స్ రాబట్టగలిగింది. ఇలా ఒక్కోసారి కంటెంట్ ఉన్న సినిమాలు సైతం థియేటర్లలో ఫెయిల్యూర్స్ చూస్తాయని తెలిసిందే. అలాంటి కోవకు చెందిన చందు ఛాంపియన్ మూవీ తాజాగా చడీ చప్పుడు లేకుండా సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసింది.

పెన్ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందిన చందు ఛాంపియన్ మూవీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో శుక్రవారం (జూలై 26) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఎమోషనల్ స్పోర్ట్స్ బయోపిక్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఓటీటీలో హిందీతోపాటు తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులో ఉంది. కానీ, ఇక్కడే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చింది.

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో చందు ఛాంపియన్ సినిమాను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవాళ్లు కూడా ఫ్రీగా చూసే అవకాశం లేదు. రూ. 199 చెల్లించి రెంటల్ విధానంలో మాత్రమే ఈ చిత్రాన్ని చూడాలి. ఇదొక్కటే నిరాశ అని చెప్పుకోవాలి. అయితే, ఈ రెంటల్ విధానం కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది. పే పర్ వ్యూ పద్ధతి తీసేసి ఫ్రీగా చూడాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

ఇదిలా ఉంటే, చందు ఛాంపియన్ సినిమా కలెక్షన్స్ ఎలా ఉన్నా మూవీలో ఎన్నో ఎమోషనల్ సీన్స్, ఇన్‌స్ఫైర్ చేసే సన్నివేశాలు, థ్రిల్లింగ్ ట్విస్టులు ఉన్నాయి. చందు ఛాంపియన్ మూవీలో కార్తీక్ ఆర్యన్‌తోపాటు పాలక్ లల్వానీ, భువన్ అరోరా, విజయ్ రాజ్, రాజ్‌పాల్ యాదవ్, అడోనిస్, సోనియా గోస్వామి, హిమాన్షు జయకర్, సోనాలి కులకర్ణి, అనిరుధ్ దవే నటించారు.

కాగా మురళీకాంత్ పేట్కర్ ఇండియన్ ఆర్మీ సైనికుడి నుంచి రెజ్లర్‌గా, బాక్సర్‌గా, 1965లో యుద్ధ వీరుడిగా, స్విమ్మర్‌గా తన జీవితంలో ఎన్నో రకాలుగా, అనేక దశల్లో రాణించారు. బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి తెచ్చుకున్నారు. పారాలింపింక్స్ 50 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్‌లో మురళీకాంత్ పేట్కర్‌కు స్వర్ణం వరించింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024