Veeranjaneyulu Viharayathra OTT: నవ్వించేలా నరేశ్ కొత్త మూవీ టీజర్.. నేరుగా ఓటీటీలోకి రానున్న సినిమా.. డేట్ ఇదే

Best Web Hosting Provider In India 2024

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేశ్ ప్రధాన పాత్రలో వీరాంజనేయులు విహారయాత్ర మూవీ వస్తోంది. ఫ్యామిలీ రోడ్ ట్రిప్ మూవీ జానర్‌లో తెలుగులో వస్తున్న ఫస్ట్ మూవీ ఇదే. అస్తికలు కలిపేందుకు చేసే విహారయాత్ర చుట్టూ ఈ చిత్రం సాగుతుంది. కామెడీ డ్రామాగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు అనురాగ్ పలుట్ల. వీరాంజనేయులు విహారయాత్ర చిత్రం నేరుగా ఓటీటీలోకే రానుంది. ఈ సినిమా టీజర్ నేడు (జూలై 26) వచ్చేసింది.

 

కామెడీతో ఆకట్టుకునేలా..

తన తండ్రి అస్తికలను గోవాలో కలిపేందుకు వీరాంజనేయులు (నరేశ్), అతడి కుటుంబం చేసే విహారయాత్రతో ఈ చిత్రం వస్తోంది. ఈ సినిమాలో అస్తికలకు హస్య బ్రహ్మ బ్రహ్మానందం వాయిస్ ఓవర్ చెప్పడం హైలైట్‍గా ఉంది. తన అస్తికలను పుణ్య నదుల్లో కలపలేదని బాధపడుతుంటే.. ఆ పని చేసేందుకు కొడుకు వీరాంజనేయులు సిద్ధపడతారు. ఇందుకోసం తండ్రి ఎప్పుడో వాడిన పాత కారును తీసుకెళ్లేందుకు నిర్ణయించుకుంటారు. ఆ కారులోనే వెళతారు. ఈ క్రమంలో వారికి సవాళ్లు ఎదురవుతాయి. వీటి చుట్టూ సరదా సన్నివేశాలు ఉంటాయి.

వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ కామెడీతో సరదాగా ఆకట్టుకుంది. స్టోరీలైన్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది. నరేశ్ మరోసారి తన మార్క్ ఎక్స్‌ప్రెషన్లు, టైమింగ్‍తో మెప్పించారు. బ్రహ్మానందం వాయిస్ ఓవర్ చాలా ప్లస్ అయింది. మొత్తంగా ఈ టీజర్‌తో ఈ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

వీరాంజనేయులు విహారయాత్ర చిత్రంలో నరేశ్‍తో పాటు శ్రీలక్ష్మి, రాగ్ మయూర్, ప్రియ వడ్లమణి, ప్రియదర్శిని, తరుణి, రవితేజ మహాదాస్యం కీలకపాత్రలు పోషించారు. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీ ఆకట్టుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తోంది.

వీరాంజనేయులు విహారయాత్ర చిత్రాన్ని బాపినీడు, సుధీర్ సంయుక్తంగా నిర్మించారు. ఆర్‌హెచ్ విక్రమ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి అంకూర్ సీ సినిమాటోగ్రఫీ చేశారు.

 

స్ట్రీమింగ్ డేట్

వీరాంజనేయులు విహారయాత్ర సినిమా ఆగస్టు 14వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ డేట్‍ను ఆ ఓటీటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా వెల్లడించింది. ఈ టీజర్ చూస్తుంటే ఈటీవీ విన్‍కు మరో సక్సెస్ వచ్చేలా కనిపిస్తోంది.

వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ రిలీజ్‍కు ఈటీవీ విన్ నేడు ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‍కు నరేశ్ భార్య పవిత్రా లోకేశ్ అతిథిగా హాజరయ్యారు. అలాగే, మూవీ టీమ్ సభ్యులు పాల్గొన్నారు.

ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ జూలై నెలలోనే శశిమథనం వెబ్ సిరీస్ వచ్చింది. రొమాంటిక్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ సిరీస్ కూడా మంచి వ్యూస్ దక్కించుకుంది. పవన్ సిద్ధు, సోనియా సింగ్ ఈ సిరీస్‍లో మెయిన్ రోల్స్ చేశారు. ఇంట్లో ఉన్న ప్రియుడిని కుటుంబ సభ్యులకు కనిపించకుండా ఆడే దాగుడుమూతల చుట్టూ శశిమథనం సిరీస్ సాగుతుంది. ఈ సిరీస్‍లో కీర్తి, కృతిక, రూపలక్ష్మి, అశోక్ చంద్ర, అవంతి దీపక్, శ్రీలలిత పమిడిపాటి కీరోల్స్ చేశారు. ఈ సిరీస్‍కు వినోద్ గాలి దర్శకత్వం వహించారు. శశిమథనం సక్సెస్ ఈవెంట్‍ను కూడా టీమ్ ఇటీవలే నిర్వహించింది. ఈ సిరీస్‍కు సింజిత్ ఎర్రమల్లి మ్యూజిక్ ఇచ్చారు.

 
WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024