
Best Web Hosting Provider In India 2024
Keerthy Suresh: 2024లో సినిమాల ఎంపికలో వైవిధ్యంగా అడుగులు వేస్తోంది కీర్తిసురేష్. కమర్షియల్ సినిమాలను తగ్గిస్తూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్‌పై ఎక్కువగా ఫోకస్ పెడుతోంది. భోళా శంకర్ (Bhola Shankar) తర్వాత తెలుగు సినిమాలకు కొంత గ్యాప్ ఇచ్చిన కీర్తిసురేష్ ఇటీవలే ఓ కామెడీ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఉప్పు కప్పురంబు పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సుహాస్ మరో కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీని అనౌన్స్ చేశారు.
ఉప్పు కప్పురంబు సెట్స్‌లో…
శుక్రవారం నుంచి ఉప్పుకప్పురంబు షూటింగ్‌ను కీర్తిసురేష్ మొదలుపెట్టింది. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆఫీషియల్‌గా ప్రకటించింది. ఈకామెడీ మూవీకి అనిల్ ఐవీ శశి దర్శకత్వం వహిస్తోన్నాడు. నిన్నిలా నిన్నిలా మూవీతో డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన అనిల్ శశికి ఇది సెకండ్ మూవీ.
అమెజాన్ ప్రైమ్‌లో…
ఉప్పు కప్పురంబు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ కోసమే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. తెలుగులో రూపొందుతోన్న ఈ మూవీని తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. ఈ ఏడాది చివలో ఉప్పుకప్పురంబు మూవీ రిలీజ్ కానున్నట్లు సమాచారం. ఈ కామెడీ మూవీలో సుహాస్, కీర్తిసురేష్ క్యారెక్టర్స్ డిఫరెంట్‌గా కొనసాగుతాయని చెబుతోన్నారు. త్వరలోనే ఈ అమెజాన్ ఒరిజినల్ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తామని మేకర్స్ పేర్కొన్నారు.
మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాలు…
ప్రస్తుతం కీర్తి సురేష్ తమిళంలో మూడు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేస్తోంది.వీటిలో రఘుతాత మూవీ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. హిందీ భాష కారణంగా ఎదురయ్యే సమస్యలతో ఫన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ మూవీని కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్‌సిరీస్ రైటర్ సుమన్ కుమార్ ఈ మూవీతో దర్శకుడిగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోన్నాడు.రివాల్వర్ రీటా, కన్నీవీడు సినిమాలు యాక్షన్ థ్రిల్లర్ కథాంశాలతో రూపొందుతోన్నాయి. ఈ రెండు సినిమాల షూటింగ్‌లను కీర్తిసురేష్ దాదాపుగా పూర్తిచేసినట్లు సమాచారం.
బాలీవుడ్ ఎంట్రీ…
ఈ ఏడాది కీర్తి సురేష్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. తమిళ బ్లాక్‌బస్టర్ మూవీ తేరీ రీమేక్‌గా తెరకెక్కుతోన్న బేబీ జాన్‌తో హిందీ ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నది. బేబీ జాన్ మూవీలో వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్నాడు. మే 31న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా డిసెంబర్‌కు వాయిదాపడింది. ఈ బాలీవుడ్ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. ఈ సినిమాకు తేరీ ఒరిజినల్ డైరెక్టర్ అట్లీ ఓ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తోన్నాడు. బేబీ జాన్ మూవీతో పాటు హిందీలో ఓ వెబ్‌సిరీస్‌కు కీర్తి సురేష్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
జనక అయితే గనక
మరోవైపు తెలుగులో కమెడియన్‌గా కెరీర్ ప్రారంభించిన సుహాస్ కలర్ ఫొటో మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అంబాజీపేట మ్యారేజీ బ్యాండు, ప్రసన్నవదనం లాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో తెలుగు ఆడియెన్స్‌ను మెప్పించాడు. ప్రస్తుతం తెలుగులో జనక అయితే గనకతో పాటు మరో మూడు సినిమాలు చేస్తోన్నాడు సుహాస్.
టాపిక్