Best Web Hosting Provider In India 2024

ఆఫీస్‌లో బందీ అయితే…
గురు ప్రసాద్ (కెవిన్) చెన్నైలోని ఓ ఐటీ కంపెనీకి టీమ్ లీడర్‌గా ట్రాన్స్‌ఫర్ మీద వస్తాడు. అదే కంపెనీలో హెచ్ఆర్‌గా హరిణి (అమృతా అయ్యర్) పనిచేస్తుంటుంది. గతంలో గురు, హరిణి మధ్య ఓ చిన్న గొడవ అవుతుంది. ఒకరిపై మరొకరు కోపంతో రగిలిపోతూ రివేంజ్ తీర్చుకోవడానికి ఎదురుచూస్తుంటారు. ఓ రోజు మేనేజర్ అప్పగించిన ఓ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ నైట్ వరకు ఆఫీస్‌లోనే ఉండిపోతాడు గురు.
కొన్ని అదృశ్య శక్తుల కారణంగా ఆఫీస్ బిల్డింగ్‌లో అతడు బందీగా మారిపోతాడు. గురుతో పాటు హరిణి కూడా ఆఫీస్‌లోనే చిక్కుకుపోతుంది. బిల్డింగ్ నుంచి బయటపడేందుకు వారు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి. లిఫ్ట్‌లో ఎక్కగానే ఇద్దరికి విచిత్ర అనుభవాలు ఎదురవుతాయి. హరిణిని చంపడానికి గురు ప్రయత్నిస్తాడు? గురు, హరిణి ఆఫీస్‌లో బందీగా మారడానికి కారణం ఏమిటి?
వారిని వెంటాడిన అదృశ్య శక్తులేవి? అదే ఆఫీస్‌లో గురు, హరిణి కంటే ముందు పనిచేసిన తార, సుందర్ ఎలా చనిపోయారు? వారికి జరిగిన అన్యాయం గురించి గురు తెలుసుకున్న నిజాలేమిటి? ఆఫీస్ బిల్డింగ్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో గురు చనిపోయాడా? లేదా? అన్నదే(Lift Movie Review) ఈ మూవీ కథ.
రొటీన్ హారర్ సినిమాలకు భిన్నంగా…
సాధారణంగా హారర్ సినిమాలు చాలా వరకు పాతకాలం నాటి బిల్డింగ్‌ల బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుంటాయి. ఊరికి దూరంగా ఉన్న ఆ బిల్డింగ్‌లలోకి హీరోహీరోయిన్లు అడుగుపెట్టడం, వారిని దయ్యాలు భయపెట్టడం ఎన్నో కష్టాల పడి ఆ మిస్టరీని నాయకానాయికలు ఛేదించినట్లుగా హారర్ సినిమాల్లో చూపిస్తుంటారు. లిఫ్ట్ మూవీ మాత్రం వాటికి పూర్తి భిన్నంగా సాగుతుంది.
సాఫ్ట్‌వేర్ ఆఫీస్‌లో దయ్యాలు…
సాఫ్ట్‌వేర్ కంపెనీలో దయ్యాలు ఉండటం అనే కొత్త కాన్సెప్ట్‌తో దర్శకుడు వినీత్ వరప్రసాద్ లిఫ్ట్ (Lift Movie Review)మూవీని తెరకెక్కించాడు. ఈ సినిమా కథ చాలా వరకు హీరో, హీరోయిన్ ఇద్దరి పాత్రల నేపథ్యంలోనే సాగుతుంది. బిల్డింగ్‌లో ఉన్న ఆత్మల కారణంగా హీరోహీరోయిన్లకు ఆఫీస్ బిల్డింగ్‌లో ఎదురయ్యే భయానక అనుభవాలను దర్శకుడు థ్రిల్లింగ్‌గా రాసుకున్నాడు.
ముఖ్యంగా లిఫ్ట్ సీన్స్ భయపెడతాయి. మెట్ల ద్వారా బిల్డింగ్ నుంచి బయటపడేందుకు ట్రై చేస్తూ ప్రతిసారి ఒకే ఫ్లోర్‌కు రావడం, తాము ఆగ్ని ప్రమాదంలో చిక్కుకుంటామని న్యూస్‌లో ఇద్దరికి ముందే తెలిసే సీన్స్ ఉత్కంఠను పంచుతాయి. దయ్యాన్ని చూపించకుండా రెగ్యులర్ హారర్ సినిమాల్లో కనిపించే జిమ్మిక్కులు, మ్యాజికలను ఫాలో కాకుండా కొత్తగా దయ్యాల సీన్స్ రాసుకోవడం బాగుంది.
చివరలో సాఫ్ట్‌వేర్ సంస్థల్లో ఒత్తిడిని తట్టుకోలేక ఉద్యోగులు ఎలా సూసైడ్ చేసుకుంటున్నారు? మేనేజర్ల కారణంగా తప్పులు చేయకున్న ఉద్యోగాలు కోల్పోయి వారుపడే ఆవేదనను సందేశాత్మకంగా చూపించారు.
రిపీటెడ్ సీన్స్…
సినిమా(Lift Movie Review) నిడివి తక్కువే అయినా కొన్ని సీన్స్ రిపీటెడ్‌లా అనిపిస్తాయి. చూపించిన సన్నివేశాల చుట్టే మళ్లీ మళ్లీ కథను తిప్పుతున్న ఫీలింగ్ కలుగుతుంది.
స్క్రీన్‌పై ఇద్దరే…
రెండుగంటల సినిమాలో కెవిన్, అమృతా అయ్యర్ ఇద్దరు మాత్రమే దాదాపు గంటన్నర పాటు స్క్రీన్‌పై కనిపిస్తారు. ఈ సింపుల్ స్టోరీని తమ యాక్టింగ్‌తో ఇద్దరు నిలబెట్టారు. రకరకాల వేరియేషన్స్ చూపిస్తూ గురు పాత్రలో కెవిన్ అదరగొట్టాడు. అమృతా అయ్యర్ భయం అనే ఎమోషన్‌ను చివరి వరకు క్యారీ చేస్తూ పాత్రలో ఒదిగిపోయింది. గెస్ట్ రోల్స్‌లో గాయత్రి రెడ్డి, కిరణ్ కొండ కనిపించారు.
Lift Movie Review – హారర్ లవర్స్‌ను మెప్పిస్తుంది….
లిఫ్ట్ ఆరంభం నుంచి ముగింపు వరకు థ్రిల్‌ను పంచే డిఫరెంట్ హారర్ మూవీ. కొత్త బ్యాక్‌డ్రాప్‌తో కెవిన్, అమృతా అయ్యర్ యాక్టింగ్ తో హారర్ మూవీ లవర్స్‌ను ఈ మూవీ మెప్పిస్తుంది.