Niharika Konidela: ఆయన లేకపోతే ఇక్కడి వరకు వచ్చేది కాదు.. మూడేళ్లుగా అంటూ నిహారిక కొణిదెల కామెంట్స్

Best Web Hosting Provider In India 2024


Niharika Konidela About Committee Kurrollu: టాలీవుడ్‌లో హీరోయిన్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నిర్మాతగా మారింది బ్యూటిఫుల్ నిహారిక కొణిదెల. ఓవైపు సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తూనే మరోవైపు చిన్న సినిమాలు నిర్మిస్తూ సమర్పిస్తోంది. తాజాగా నిహారిక కొణిదెల సమర్పిస్తోన్న మరో తెలుగు మూవీ కమిటీ కుర్రోళ్లు.

ముఖ్య అతిథిగా సిద్ధు

యదు వంశీ దర్శకత్వం వహించిన కమిటీ కుర్రోళ్లు సినిమా ట్రైలర్‌ను జూలై 27న విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ట్రైలర్ లాంచ్ వేడుకకు ముఖ్య అతిథిగా క్రేజీ హీరో సిద్ధు జొన్నలగడ్డ హాజరయ్యారు. కమిటీ కుర్రోళ్లు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెలతోపాటు ఇతర టెక్నిషియన్స్ ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు.

టీం అంతా కలిసి

నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. “షూటింగ్ ఉన్నా కూడా పిలిచిన వెంటనే వచ్చిన సిద్దు గారికి థాంక్స్. మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ గారు లేకపోతే సినిమా ఇక్కడి వరకు వచ్చేది కాదు. టీం అంతా కలిసి కష్టపడి సినిమా చేశాం. మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరూ బెస్ట్ ఇచ్చారు. అందరికీ థాంక్స్” అని తెలిపింది.

పాత్రలకు ప్రాణం పోశారు

“కమిటీ కుర్రోళ్లు అంతా కూడా మూడేళ్లు సినిమా కోసం పని చేస్తూనే ఉన్నారు. అందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారు. ఆగస్ట్ 9న మా చిత్రం రాబోతోంది. అందరూ చూసి సక్సెస్ చేయండి” అని మెగా డాటర్ నిహారిక కొణిదెల చెప్పుకొచ్చింది. దీంతో నిహారిక కొణిదెల కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

మంచి యూత్‌ఫుల్ మూవీ

ఇక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ మాట్లాడుతూ.. “ట్రైలర్ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. సినిమా కూడా అందరికీ నచ్చుతుంది. యదు గారు మంచి సినిమాను తీశారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో మంచి యూత్‌ఫుల్ సినిమాను తీశారు. ఇలాంటి సినిమాకు సిద్దు గారిలాంటి హీరో గెస్టుగా రావడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న మా చిత్రం థియేటర్లలో రిలీజ్ అవుతోంది. చూసి అందరూ సక్సెస్ చేయాలి” అని కోరారు.

సాంగ్స్ నచ్చాయి

“మా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన సిద్దు గారికి థాంక్స్. నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన మా దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన సాంగ్స్ అందరికీ నచ్చాయి. ట్రైలర్ కూడా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. ఇంత మంచి సినిమాకు పని చేయడం ఆనందంగా ఉంది. ఆగస్ట్ 9న రానున్న మా సినిమాను అందరూ చూడండి. కచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను” అని సంగీత దర్శకుడు అనుదీప్ దేవ్ అన్నారు.

మరో లెవెల్‌కు

“మా సినిమా ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు గెస్టుగా వచ్చిన సిద్దు గారికి థాంక్స్. యదు గారు మంచి కథను రాశారు. సినిమాకు పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. నా విజువల్స్‌ను మ్యూజిక్ డైరెక్టర్ మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. మా సినిమా ఆగస్ట్ 9న రిలీజ్ కానుంది. అంతా చూసి ఆనందించండి” అని కెమెరామెన్ రాజు చెప్పారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024