Toofan: పొయోటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో బిచ్చగాడు హీరో కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Vijay Antony Toofan Pre Release Event: హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ “తుఫాన్”. ఈ సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్‌పై కమల్ బోరా, డి. లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మిస్తున్నారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది.

పొయెటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ జానర్‌లో “తుఫాన్” సినిమాను రూపొందిస్తున్నారు దర్శకుడు విజయ్ మిల్టన్. “తుఫాన్” సినిమాను ఆగస్టు 2న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ సందర్భంగా తుఫాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విజయ్ ఆంటోనీతోపాటు పలువురు అతిథులు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

“తుఫాన్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వచ్చిన సత్యరాజ్ గారికి, కరుణాకరన్ గారికి థ్యాంక్స్. సత్యరాజ్ గారు ఈ సినిమాలో ఓ మంచి రోల్ చేశారు. ఆయన మా మూవీలో భాగమవకుంటే ఇది అసంపూర్తి అయ్యేది. డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారు మంచి స్క్రిప్ట్ ఈ మూవీకి రాశారు. నా రైట్ హ్యాండ్ లాంటి పర్సన్ డైలాగ్ రైటర్ భాష్యశ్రీ” అని హీరో విజయ్ ఆంటోనీ చెప్పారు.

“ఇప్పుడున్న పరిస్థితుల్లో ఓ భారీ సినిమా చేయడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. అయినా కంటెంట్ మీద నమ్మకంతో మా ప్రొడ్యూసర్స్ కమల్, ప్రదీప్, ధనుంజయన్ గారు తుఫాన్ సినిమా చేశారు. ఈ మూవీని బాగా ప్రమోట్ చేస్తున్నారు. తెలుగుతో పాటు తమిళంలో రిలీజ్ చేస్తున్నారు. వాళ్లు ఎంత కష్టపడుతున్నారో చూస్తున్నాను. ఈ మూవీలోని క్వాలిటీ, కంటెంట్ మనకు తప్పకుండా సక్సెస్ ఇస్తాయి” అని విజయ్ ఆంటోని అన్నారు.

“మ్యూజిక్ డైరెక్టర్ అచ్చు రాజమణి గారు తన బీజీఎంతో మా మూవీని మరింత ఎఫెక్టివ్‌గా మార్చారు. ఇంటర్వెల్ సీన్, క్లైమాక్స్‌లో మీ మ్యూజిక్ విని సర్‌ప్రైజ్ అయ్యాను. మనం ఫ్యూచర్‌లోనూ కలిసి మూవీస్ చేయాలి. త్వరలో ఈ సినిమా స్నీక్ పీక్ రిలీజ్ చేస్తాం. అది మూవీపై ఇంకా ఆసక్తిని పెంచుతుంది” అని విజయ్ ఆంటోని తెలిపారు.

బాహుబలి తర్వాత తెలుగు సినిమాల రేంజ్ పెరిగింది. నాకు ప్రతి తెలుగు సినిమా ఇష్టమే. హైదరాబాద్‌తో, తెలుగు ఆడియెన్స్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. తుఫాన్ సినిమాతో మీకు మరింత దగ్గరవుతానని ఆశిస్తున్నా” అని బిచ్చగాడుతో దగ్గరైన విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు.

ఇదే కార్యక్రమంలో మాటలు, పాటల రచయిత భాష్యశ్రీ మాట్లాడుతూ.. “తుఫాన్ ఆగస్టు 2న థియేటర్స్‌లోకి వస్తోంది. మంచి స్క్రీన్ ప్లే ఉన్న చిత్రమిది. మీరంతా చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం. మ్యూజిక్ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణ అవుతుంది. అలాగే డబ్బింగ్ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. తుఫాన్ సినిమాకు పనిచేసే అవకాశం ఇచ్చిన విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ విజయ్ మిల్టన్ గారికి థ్యాంక్స్” అని అన్నారు.

“తుఫాన్ సినిమాకు అచ్చు రాజమణి గారు చేసిన మ్యూజిక్ విని హ్యాపీగా ఫీలయ్యాను. ఈ సినిమాలో పాడే అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి థ్యాంక్స్. ఈ సినిమాను ఆగస్టు 2న థియేటర్స్‌లో చూడండి. థియేట్రికల్ ఫీలింగ్ ఇచ్చే సినిమా ఇది” అని సింగర్ సాకేత్ కొమండూరి చెప్పారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024