Breakfast Ideas: మీ పిల్లలకు బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ ఐడియాలు ఇవిగో, ఈ అట్లు టేస్టీగా ఉంటాయి

Best Web Hosting Provider In India 2024

పిల్లల కోసం టేస్టీ బ్రేక్ ఫాస్ట్ ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారా? ఇక్కడ పిల్లలకు నచ్చేలా రకరకాల అట్లు రెసిపీ ఇచ్చాము. ఈ పాన్‌కేక్ ఎంతో రుచిగా ఉంటాయి. ఉదయం పూట పిల్లలు తినే ఆహారం పోషకాలతో నిండిన ఫుడ్ ను పెట్టాల్సిన అవసరం ఉంది. దీన్ని లంచ్ బాక్స్ రెసిపీగా కూడా ఉపయోగించవచ్చు.

రవ్వ వెజిటబుల్ పాన్ కేక్

(చెఫ్ సంజీవ్ కపూర్ రెసిపీ)

రవ్వ అట్లు
రవ్వ అట్లు (Sanjeev Kapoor)

రవ్వ వెజిటబుల్ పాన్ కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

రవ్వ – 3 టేబుల్ స్పూన్లు స

పెరుగు – పావు కప్పు

తురిమిన క్యారెట్ – పావు కప్పు

పచ్చి బఠాణీలు – గుప్పెడు

ఉల్లిపాయ – ఒకటి

క్యాప్సికమ్ – ఒకటి

పచ్చిమిర్చి – రెండు

పంచదార – చిటికెడు

మిరియాలపొడి – చిటికెడు

ఉప్పు – రుచికి సరిపడా

నూనె – తగినంత

తయారీ విధానం:

1. ఒక గిన్నెలో సెమోలినా, పెరుగు, తగినన్ని నీళ్లు పోసి కలపాలి.

2. క్యారెట్, పచ్చిబఠానీలు, ఉల్లిపాయ, క్యాప్సికమ్, పచ్చిమిర్చి తరుగు వేసి కూడా బాగా కలపాలి.

3. ఆ మిశ్రమంలో పంచదార, మిరియాలపొడి, ఉప్పు వేసి కలపాలి. బాగా మిక్స్ చేసి 10-15 నిమిషాలు పక్కన వదిలేయాలి.

4. స్టవ్ మీద పెనం పెట్టి నూనె వేయాలి. అందులో పిండిని అట్టులా వేసుకుని రెండు వైపులా వేయించాలి.

5. దీన్ని గ్రీన్ చట్నీతో తింటే చాలా రుచిగా చేయాలి

…………………………

బనానా పాన్ కేక్

(చెఫ్ టార్లా దలాల్ రెసిపీ)

బనానా పాన్ కేక్
బనానా పాన్ కేక్ (Unsplash)

బనానా పాన్ కేక్ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

అరటిపండు – మూడు

గోధుమ పిండి – అర కప్పు

బటర్ – ఒక స్పూను

నీరు – సరిపడినంత

బనానా పాన్ కేక్ రెసిపీ

1. ఒక గిన్నెలో అరటి పండు వేసి చేత్తోనే గుజ్జులా చేసుకోవాలి.

2. ఆ గుజ్జులో గోధుమ పిండి వేసి బాగా కలపండి.

3. అందుల నీరు వేసి బాగా కలపండి. ఆ మిశ్రమాన్ని మరీ మందంగా కాకుండా జారుడుగా ఉండేలా చూసుకోండి.

4. స్టవ్ మీద పెనం పెట్టి బటర్ వేయాలి. దానిపై పిండిని పోసి అట్టులా వేసుకోవాలి.

5. పాన్ కేక్‌ను మీడియం మంట మీద రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి మారే వరకు వేయించండి.

6. పైన అరటి పండ్లు, చాక్లెట్ సిరప్ వేసి పిల్లలకు సర్వ్ చేయండి

……………………………

రాగి పాన్ కేక్

(చెఫ్ సంజీవ్ కపూర్ రెసిపీ)

రాగి పాన్ కేక్
రాగి పాన్ కేక్ (Pinterest)

రాగి పాన్ కేక్ రెసిపీకి కావల్సిన పదార్థాలు:

రాగిపిండి – అర కప్పు

మైదా – అర స్పూను

బేకింగ్ పౌడర్ – అర స్పూను

ఉప్పు – చిటికెడు

పంచదార – పావు కప్పు

గుడ్లు – రెండు

వెనిల్లా ఎసెన్స్ – రెండు స్పూన్లు

పాలు – ముప్పావు కప్పు

బటర్ – రెండు స్పూన్లు

రాగి పాన్‌కేక్ రెసిపీ

1. ఒక గిన్నెలో రాగి పిండి, మైదా పిండి, బేకింగ్ పౌడర్ వేసి ఉండల్లేకుండా జల్లెడ పట్టండి.

2. అందులో రుచికి సరిపడా ఉప్పు, రెండు గుడ్లు వేసి బాగా కలపాలి.

3. వెనీలా ఎసెన్స్, పాలు, కరిగించిన బటర్ వేసి బాగా కలిసే వరకు కలపాలి.

4. స్టవ్ మీద పెనం పెట్టి బటర్ వేసి ఉడికే వరకు మీడియం మంట మీద ఉడికించాలి.

5. తర్వాత రెండు వైపులా వేయించుకోవాలి.

6. సర్వింగ్ ప్లేట్లో రాగి అట్టును వేసి పైన డస్ట్ ఐసింగ్ షుగర్, స్ట్రాబెర్రీస్, బ్లూబెర్రీస్‌తో గార్నిష్ చేయాలి. మాపుల్ సిరప్ చల్లి సర్వ్ చేయాలి. ఇది పిల్లలకు బాగా నచ్చుతుంది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024