New Movie Releases: సినిమా లవర్స్‌కు ఈ వీకెండ్ పండగే.. ఈ వారం థియేటర్లలో రిలీజ్ అవుతున్న డజను సినిమాలు ఇవే

Best Web Hosting Provider In India 2024

New Movie Releases: ఓటీటీలు వచ్చిన తర్వాత థియేటర్లకు వెళ్లే ప్రేక్షకుల సంఖ్య తగ్గుతూ వస్తోంది. అయితే సరైన సినిమా రావాలే గానీ థియేటర్లు కూడా కళకళలాడుతాయని కల్కి 2898 ఏడీ నిరూపించింది.

ఆ సినిమా తర్వాత మూడు వారాల పాటు కాస్త డల్లుగా ఉన్న థియేటర్లు.. ఈ వీకెండ్ మళ్లీ కళకళలాడనున్నాయి. ఏకంగా డజను వరకు కొత్త సినిమాలు రిలీజ్ కాబోతుండటం విశేషం.

సినిమాల జాతర

ఈ గురువారం (ఆగస్ట్ 1), శుక్రవారం (ఆగస్ట్ 2) ఎన్నో తెలుగు, హిందీ సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. అయితే వీటిలో చాలా వరకు అన్నీ చిన్న సినిమాలే ఉన్నాయి. కల్కి 2898 ఏడీ తర్వాత మూడు వారాల పాటు డల్లుగా అనిపించినా.. ఈ వారం సినిమా లవర్స్ కు పండగలా ఉండబోతోంది. ఫ్రెండ్షిప్ డే వీకెండ్ థియేటర్లలో చూడటానికి ఎన్నో సినిమాలు సిద్ధం అవుతున్నాయి.

శివమ్ భజే – ఆగస్ట్ 1

అశ్విన్ బాబు నటించిన శివమ్ భజే మూవీ తెలివిగా ఒక రోజు ముందే అంటే ఆగస్ట్ 1నే రిలీజ్ కాబోతోంది. మైథాలజీకి క్రైమ్ థ్రిల్లర్ జానర్ జోడించి ఈ మూవీ మేకర్స్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

బడ్డీ – ఆగస్ట్ 2

అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్ చాలా ఏళ్లవుతున్నా ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం లేదు. అతడు తాజాగా బడ్డీ అనే మరో సినిమాతో శుక్రవారం (ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. 2021లో ఆర్య నటించిన టెడ్డీ మూవీనే కాస్త మార్చి ఈ బడ్డీ తీసుకొస్తున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో శిరీష్ బిజీగా ఉన్నాడు.

తిరగబడరా సామి – ఆగస్ట్ 2

ఈ మధ్యే గర్ల్‌ఫ్రెండ్ కారణంగా పోలీస్ కేసు ఎదుర్కొన్న నటుడు రాజ్ తరుణ్ నటించిన తిరగబడరా సామి కూడా శుక్రవారం థియేటర్లలో రిలీజ్ అవుతుంది. గత శుక్రవారం (జులై 26) పురుషోత్తముడుతో వచ్చి బోల్తాపడిన అతడు.. ఈసారి మరో సినిమాతో వస్తున్నాడు.

విరాజి – ఆగస్ట్ 2

వరుణ్ సందేశ్ నటించిన విరాజి మూవీ కూడా శుక్రవారమే రిలీజ్ కానుంది. గత నెలలో నింద సినిమా ద్వారా చాలా రోజుల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతడు.. ఇప్పుడీ విరాజితో వస్తున్నాడు.

ఉషా పరిణయం – ఆగస్ట్ 2

డైరెక్టర్ విజయ్ భాస్కర్ తనయుడు శ్రీ కమల్ నటించిన ఉషా పరిణయం మూవీ ఈ వీకెండ్ రిలీజ్ అవుతోంది. గతంలో ఈ ఇద్దరు తండ్రీ కొడుకులు జిలేబీ మూవీ ద్వారా రాగా.. ఇప్పుడు మరోసారి ఇద్దరూ కలిసి ఈ సినిమా చేశారు.

తూఫాన్ – ఆగస్ట్ 2

తమిళ విలక్షణ నటుడు విజయ్ ఆంటోనీ నటించిన తూఫాన్ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఈ సినిమాల జాతరలోనే రాబోతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ విజయ్ తన సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. బిచ్చగాడుతో ఇక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్న అతడు.. ఈ తూఫాన్ తో ఏం చేస్తాడో చూడాలి.

ఇవే కాకుండా తెలుగులో అలనాటి రామచంద్రుడు, యావరేజ్ స్టూడెంట్ నాని, లారీలాంటి సినిమాలు కూడా శుక్రవారం (ఆగస్ట్ 2) ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. హిందీలో చూసుకుంటే జాన్వీ కపూర్ నటించిన ఉలఝ్, అజయ్ దేవగన్ నటించిన ఔరే మే కహా దమ్ థా సినిమాలు కూడా ఈ శుక్రవారమే రిలీజ్ కాబోతున్నాయి.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024