Game Changer: హ్యాపీ బర్త్‌డే కియారా.. గేమ్ ఛేంజర్ నుంచి స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్

Best Web Hosting Provider In India 2024

Game Changer: గేమ్ ఛేంజర్ మూవీ నుంచి కియారా అద్వానీ బర్త్ డే సందర్భంగా ఓ స్టన్నింగ్ పోస్టర్ రిలీజ్ అయింది. రామ్ చరణ్ నటిస్తున్న ఈ సినిమా నుంచి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా ఆసక్తికరంగా గమనిస్తున్న అభిమానులను సర్‌ప్రైజ్ చేస్తూ కియారా ఎంతో అందంగా ఉన్న ఈ పోస్టర్ ను తీసుకొచ్చారు. ఇప్పుడు మూవీ రిలీజ్ పై అధికారిక ప్రకటన కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

గేమ్ ఛేంజర్ కియారా

గేమ్ ఛేంజర్ మూవీలో ఫిమేల్ లీడ్ గా నటిస్తున్న బాలీవుడ్ అందాల భామ కియారా అద్వానీ.. బుధవారం (జులై 31) తన 33వ పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా ఆమెకు బర్త్ డే విషెస్ చెప్పింది. ఈ పోస్టర్ లో కియారా ఓ మల్టీ కలర్ లెహంగాలో ఆమె ఎంతో అందంగా కనిపిస్తోంది. మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ జరగండి జరగండి పాటలోని లుక్ ఇది.

ఈ గేమ్ ఛేంజర్ మూవీని తెరకెక్కిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ కియారాకు బర్త్ డే విషెస్ చెబుతూ ఎక్స్ అకౌంట్లో ఓ పోస్ట్ చేసింది. “మా జాబిలమ్మ అలియాస్ కియారా అద్వానీకి గేమ్ ఛేంజర్ టీమ్ హ్యాపీ బర్త్ డే విషెస్ చెబుతోంది. ఆమె వైబ్రంట్ ఎనర్జీ త్వరలోనే మీ గుండెలను మీటుతుంది” అనే క్యాప్షన్ తో ఈ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేసింది.

కియారా కెరీర్

కియారా అద్వానా 1991, జులై 31న జన్మించింది. 2014లో వచ్చిన హిందీ మూవీ ఫగ్లీ ద్వారా యాక్టింగ్ కెరీర్ మొదలుపెట్టింది. ఆ తర్వాత 2016లో వచ్చిన ధోనీ బయోపిక్ ఎమ్మెస్ ధోనీ : ది అన్‌టోల్డ్ స్టోరీ మూవీలో కనిపించింది. 2018లో వచ్చిన నెట్‌ఫ్లిక్స్ ఆంథాలజీ లస్ట్ స్టోరీస్ ద్వారా ఆమెకు మంచి పేరు వచ్చింది. అదే ఏడాది ఆమె తెలుగులోనూ అడుగుపెట్టింది.

ఆ ఏడాది మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను మూవీలో ఫిమేల్ లీడ్ గా నటించింది. ఆ తర్వాత వినయ విధేయ రామ మూవీలోనూ కనిపించిన ఆమె.. మళ్లీ ఇన్నాళ్లకు అదే రామ్ చరణ్ సరసన గేమ్ ఛేంజర్ లోనూ నటిస్తోంది. అటు జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 మూవీలోనూ కియారానే ఫిమేల్ లీడ్ గా ఉంది. ఈ సినిమాలో హృతిక్ రోషన్ లీడ్ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే.

గేమ్ ఛేంజర్ ఎప్పుడు?

రామ్ చరణ్ అభిమానులు మూడేళ్లుగా గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. కానీ మూవీ మాత్రం వాయిదా పడుతూనే ఉంది. ఈ ఏడాది క్రిస్మస్ కు కలుద్దాం అని మూవీ నిర్మాత దిల్ రాజు చెప్పడం ఫ్యాన్స్ ను ఆనందానికి గురి చేసింది. అయితే రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ లీడ్ రోల్లో నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాలేదు.

ఈ గేమ్ ఛేంజర్ దర్శకుడు శంకర్ మధ్యలో ఇండియన్ 2 మూవీ కూడా చేయడంతో ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యమైంది. ఇండియన్ 2 థియేటర్లలో రిలీజై, డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ వేగం పుంజుకుంటుందని, అనుకున్నట్లే క్రిస్మస్ సమయానికి వస్తుందని అభిమానులు ఆశతో ఉన్నారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024