Chiranjeevi vs Balayya fans: చిరంజీవి, బాలయ్య ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్.. ఆ అభిమానితో చిరు అలా చేయడంపై..

Best Web Hosting Provider In India 2024

Chiranjeevi fans vs Balayya fans: చిరంజీవి ఎయిర్‌పోర్టులో ఓ అభిమానిని తోసేస్తున్న ఓ చిన్న వీడియో ఇప్పుడు ఇద్దరు హీరోల అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. చిరంజీవి మంచోడు కాబట్టి అలా నెట్టి వదిలేసాడని అతని అభిమానులు దీనిని సమర్థిస్తుంటే.. అదే బాలయ్య చేసి ఉంటే ఎంతలా ఏడ్చేవారో అని అతని అభిమానులు అంటుండటం గమనార్హం.

చిరంజీవిపై విమర్శలు

ఆ మధ్య ముంబై ఎయిర్ పోర్టులో నాగార్జునతో సెల్ఫీ కోసం ప్రయత్నించిన అభిమానిని అతని బాడీగార్డ్ ఈడ్చి పారేసిన వీడియో ఎంతటి దుమారం రేపిందో తెలుసు కదా. అది చూసి నాగ్‌పై అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో అతడు క్షమాపణ చెప్పడమే కాదు.. అదే అభిమానితో ఫొటోలు కూడా దిగాడు. ఇప్పుడు చిరంజీవి కూడా అలాంటి విమర్శలే ఎదుర్కొంటున్నాడు.

కొంతకాలంగా లండన్, పారిస్ టూర్లలో బిజీగా ఉన్న చిరంజీవి.. ఎయిర్‌పోర్టులో అడుగుపెట్టగానే అక్కడున్న కొందరు సిబ్బంది సెల్ఫీల కోసం ప్రయత్నించారు. అందులో ఇండిగో ఎయిర్ లైన్స్ కు చెందిన వ్యక్తి కూడా ఉన్నాడు. చిరుతో సెల్ఫీ కోసం అతడు పదే పదే ప్రయత్నించడంతో అతడు విసుగ్గా ఆ అభిమాని వెనుక చేయి వేసి నెట్టేశాడు. ఈ వీడియో వైరల్ కావడంతో చిరంజీవిపై విమర్శలు వెల్లువెత్తాయి.

చిరు ఫ్యాన్స్ vs బాలయ్య ఫ్యాన్స్

అయితే ఈ వీడియోపై విమర్శలు గుప్పిస్తున్న వారికి కౌంటర్ వేస్తూ చిరంజీవికి అతని అభిమానులు కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. హరీష్ మేనన్ అనే వ్యక్తి ఈ వీడియోను పోస్ట్ చేస్తూ ఓ ట్వీట్ చేశాడు. “ముందు నడుస్తున్న ఫిమేల్ ఎయిర్‌లైన్స్ స్టాఫ్ ఫోటో అడిగిన వ్యక్తిని అడ్డు తప్పుకోమని సైగ చేసింది. లాంగ్ ఫ్లైట్ జర్నీ చేసి, కుటుంబంతో వెళ్తున్న వ్యక్తికి రెండు సార్లు అడ్డంగా నిలబడి విసిగించటం అసలు కరక్టేనా? సివిక్ సెన్స్ అనేది ఒకటి ఏడ్చి చచ్చింది కదా. చిరంజీవిగారు మంచోడు కాబట్టి సింపుల్ డ్యాన్స్ మూమెంట్‌లా జస్ట్ అలా నెట్టి వదిలేశాడు!” అని ఆ వ్యక్తి రాశాడు.

ఈ ట్వీటే చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. దీనిపై కామెంట్ చేసిన కొందరు అదే బాలయ్య అయితే ఏడ్చి చచ్చేవారు కదా అని, మనవాడు చేస్తే సంసారం.. ఎదుటివాడు చేస్తే వ్యభిచారం అని కామెంట్స్ చేయడం గమనార్హం. మరికొందరైతే మీ అభిమాన హీరో కాబట్టి ఏం చేసినా సరిపోతుందా అని ప్రశ్నించారు. ఇక ఇంకొందరు చిరుకి మద్దతుగా.. వాళ్లకూ ప్రైవసీ ఉంటుంది కదా.. అతడు చేసిన దాంట్లో తప్పేమీ లేదని కామెంట్లు చేశారు.

మొత్తానికి ఓ చిన్న వీడియో ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోల అభిమానుల మధ్య ఇలా యుద్ధానికి కారణమైంది. ప్రస్తుతం విశ్వంభర మూవీలో నటిస్తున్న మెగాస్టార్.. ఈ మధ్యే భార్య సురేఖ, కొడుకు రామ్ చరణ్, అతని భార్య ఉపాసనలతో కలిసి మొదట లండన్ టూర్, తర్వాత పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లి వచ్చిన విషయం తెలిసిందే.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024