Best Web Hosting Provider In India 2024
TG Engineering Counselling : తెలంగాణ ఈఏపీసెట్ 2024 ఇంజినీరింగ్ కోర్సుల్లో రెండో విడత కౌన్సెలింగ్ పూర్తైంది. ఈ మేరకు విద్యార్థులకు సీట్ల కేటాయింపు చేసింది ఉన్నత విద్యామండలి. రెండో విడత ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ సీట్ల కేటాయింపు వివరాలను ఈఏపీసెట్ వెబ్ సైట్ https://tgeapcet.nic.in/default.aspx లో విద్యార్థులకు అందుబాటులో ఉంచారు. రెండో విడతకు ఎంపికైన విద్యార్థులు ట్యూషన్ ఫీజు చెల్లింపు, సెల్ఫ్ రిపోర్టింగ్ కు ఆగస్టు 1, 2వ తేదీ వరకు గడువు ఇచ్చినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తంగా 86,509 సీట్లు ఉన్నాయి. రెండు విడతల కౌన్సెలింగ్ లో 81,490 సీట్లు భర్తీ అయ్యాయని అధికారులు తెలిపారు. ఇంకా 5019 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. మిగిలిన సీట్లకు చివరి విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ సీట్లు పొందిన విద్యార్థులు చివరి విడత కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాతే ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది. అలాగే తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ ను ప్రకటించింది.
తుది విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
- రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, హెల్ప్ లైన్ సెంటర్ స్లాట్ బుక్కింగ్, మొదటి రెండో విడత కౌన్సెలింగ్ కు హాజరు కాని విద్యార్థుల సర్టిఫికేట్ల వెరిఫికేషన్ – ఆగస్టు 8, 2024
- తుది విడత కౌన్సెలింగ్ సర్టిఫికేట్ల వెరిఫికేషన్(ఇప్పటికే స్టాట్ బుక్ చేసుకున్నవారు) -ఆగస్టు 9, 2024
- వెబ్ ఆప్షన్లు ఎంపిక -ఆగస్టు 9, 10 తేదీల్లో
- వెబ్ ఆప్షన్ల ఫ్రీజింగ్ – ఆగస్టు 10 , 2024
- తాత్కాలికంగా సీట్లు కేటాయింపు – ఆగస్టు 13, 2024
- ట్యూషన్ ఫీజు చెల్లింపు, వెబ్ సైట్ ద్వారా స్వయంగా రిపోర్టింగ్ – ఆగస్టు 13 నుంచి 15 వరకు
- కాలేజీల్లో రిపోర్టింగ్(కాలేజీ లేదా బ్రాంచ్ మార్పుకునేందుకు) – ఆగస్టు 16 నుంచి 17 వరకు
- కాలేజీల వారీగా విద్యార్థుల వివరాలు ప్రకటన – ఆగస్టు 17
సంబంధిత కథనం
టాపిక్