Raayan Collections: రూ.100కోట్ల మైల్‍స్టోన్ దాటేసిన రాయన్ సినిమా.. కోలీవుడ్‍లో ఓ రికార్డ్

Best Web Hosting Provider In India 2024

తమిళ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో ప్రధాన పోషించిన రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘రాయన్’ కలెక్షన్లలో దూసుకెళుతోంది. బాక్సాఫీస్ వద్ద జోరు కొనసాగిస్తోంది. యాక్టర్ల పర్ఫార్మెన్స్‌తో పాటు ధనుష్ ఈ మూవీని తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను మెప్పిస్తోంది. దీంతో రాయన్ కలెక్షన్ల దూకుడు కొనసాగుతోంది. జూలై 26వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాగా.. ఆరంభం నుంచి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఐదు రోజుల్లో ఈ మూవీ ముఖ్యమైన మైల్‍స్టోన్ అధిగమించింది.

రూ.100 కోట్లను దాటి..

రాయన్ సినిమా రూ.100 కోట్ల మైలురాయి దాటేసింది. ఐదు రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఈ చిత్రం అధిగమించింది. ఐదు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.105.38 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 31) వెల్లడించింది.

రికార్డు ఇదే

రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించిన తొలి ఏ రేటింగ్ కోలీవుడ్ సినిమా ఇదేనని రాయన్ మూవీ టీమ్ పోస్టర్ వెల్లడించింది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ సర్టిఫికేట్ ఇచ్చింది. హింస ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఏ రేటింగ్ వచ్చినా ఈ మూవీ భారీ వసూళ్లను రాబడుతోంది. ఈ క్రమంలో కోలీవుడ్‍లో రూ.100 కోట్ల మార్క్ దాటిన తొలి ఏ రేటెడ్ చిత్రంగా రాయన్ రికార్డు సాధించింది. వేగంగా రూ.100 కోట్లు సాధించిన మూడో ఏ రేటెడ్ ఇండియన్ చిత్రంగా రాయన్ నిలిచిందని కూడా మూవీ టీమ్ వెల్లడించింది.

ఇండియాలో రాయన్ మూవీకి ఇప్పటి వరకు దాదాపు రూ.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు (రూ.53కోట్ల నెట్) దక్కాయి. మిగిలిన వసూళ్లు ఓవర్సీస్ ద్వారా వచ్చాయి. తమిళనాడులో ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ సత్తాచాటుతోంది. తమిళంతో పాటు తెలుగులోనూ ఈ చిత్రం రిలీజ్ అయింది.

రాయన్ మూవీకి మొదట్లో మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో వసూళ్లు ఎలా ఉంటాయోనని ఆసక్తి నెలకొంది. అయితే, యావరేజ్ టాక్‍ను దాటుకొని ఈ చిత్రం భారీ వసూళ్లను సాధిస్తోంది. వీకెండ్ తర్వాత కూడా సత్తాచాటుతోంది. ఐదు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్‍ను అధిగమించింది. ధనుష్‍కు హీరోగా ఇది 50వ మూవీ అవడం స్పెషాలిటీగా ఉంది. అందులోనూ దర్శకుడిగానూ ఆయన మెప్పించారు.

రాయన్ చిత్రంలో ధనుష్‍తో పాటు సందీప్ కిషన్, కాళి దాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా.. అపర్ణా బాలమురళి, ఎస్‍జే సూర్య, ప్రకాశ్ రాజ్, శరవణన్, సెల్వ రాఘవన్ కీలకపాత్రల్లో కనిపించారు. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఏఆర్ రహమాన్ సంగీతం అందించారు. సన్‍ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు.

మరోవైపు, ధనుష్‍పై తమిళ నిర్మాతల మండలి ఇటీవలే అసంతృప్తి వ్యక్తం చేసింది. చాలా సినిమాలకు అడ్వాన్సులను తీసుకొని.. టైమ్ కేటాయించడం లేదంటూ వెల్లడించింది. ధనుష్‍తో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు ముందుగా.. మండలిని సంప్రదించాలని ఆంక్షలు పెట్టింది. ఈ అంశంపై తమిళ ఇండస్ట్రీలో దుమారం రేగుతోంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024