Best Web Hosting Provider In India 2024
Special Trains Extension: ప్రయాణీకుల అదనపు రద్దీ దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైలు సేవలను పొడిగించాలని రైల్వే నిర్ణయించింది. అలాగే మరోవైపు రైల్వే పనుల వల్ల నాలుగు రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. సందీప్ తెలిపారు.
ప్రత్యేక రైళ్ల పొడిగింపు
సూరత్-బ్రహ్మాపూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (09069) రైలు సర్వీసును పొడిగించారు. ఈ రైలును ఆగస్టు 7 నుంచి నవంబర్ 27 వరకు నడుపుతారు. ఈ రైలు ప్రతి బుధవారాల్లో మధ్యాహ్నం 2ః20 గంటలకు సూరత్‌లో బయలుదేరుతుంది. ఇది మరుసటి రోజు రాత్రి 8ః10 గంటలకు దువ్వాడ చేరుకుంటుంది. అక్కడ నుంచి రాత్రి 8ః12 గంటలకు బయలుదేరుతుంది.
రాత్రి 8ః58 గంటలకు పెందుర్తి చేరుకుంటుంది. రాత్రి 9ః00 గంటలకు అక్కడ నుండి బయలుదేరి, విజయనగరం రాత్రి 9ః35 గంటలకు చేరుకుంటుంది. అక్కడ నుండి రాత్రి 9ః50 గంటలకు బయలుదేరి, మూడో రోజు తెల్లవారుజామున 1ః15 గంటలకు బ్రహ్మపూర్ చేరుకుంటుంది. మొత్తం 17 ట్రిప్‌లు ఉంటుంది.
బ్రహ్మపూర్-సూరత్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (09070) రైలు సర్వీసును పొడిగించారు. ఈ రైలు ఆగస్టు 9 నుంచి నవంబర్ 29 వరకు నడుస్తుంది. ఈ రైలు ప్రతి శుక్రవారాల్లో తెల్లవారు జామున 3ః30 గంటలకు బ్రహపూర్‌లో బయలుదేరుతుంది. అదే రోజు ఉదయం 06ః20 గంటలకు విజయనగరం చేరుకుని, అక్కడ నుంచి దుయం 06ః35 గంటలకు బయలుదేరుతుంది. పెందుర్తి ఉదయం 07:10 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 7ః12 గంటలకు బయలుదేరుతుంది. దువ్వాడ ఉదయం 08:20 గంటలకు చేరుకుని, అక్కడ నుంచి ఉదయం 08ః22 గంటలకు బయలుదేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 1ః45 గంటలకు సూరత్ చేరుకుంటుంది.
స్టాపేజ్‌లు: తెలంగాణలో వరంగల్, ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతోంది. ఈ రైళ్లలో ఒక ఫస్ట్ ఏసీ, రెండు-సెకెండ్ ఏసీ, ఆరు-థర్డ్ ఏసీ, 8-స్లీపర్ క్లాస్, 3- జనరల్ సెకండ్ క్లాస్, 1- దివ్యాంగు కమ్ సెకండ్ క్లాస్, 1-లగేజ్ కమ్ బ్రేక్ వ్యాన్ కోచ్‌లు ఉంటాయి.
నాలుగు రైళ్లు రద్దు
యశ్వంత్‌పూర్‌లో బయలుదేరే యశ్వంత్‌పూర్-హౌరా స్పెషల్ ఎక్స్‌ప్రెస్ (02864) రైలు రద్దు చేశారు. ఎర్నాకులం నుండి బయలుదేరే ఎర్నాకులం-టాటా నగర్ ఎక్స్‌ప్రెస్ (18189) రైలును రద్దు చేశారు. హౌరా నుండి బయలుదేరే హౌరా-యశ్వంత్‌పూర్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ ( 02863) రైలు రద్దు చేశారు. చక్రధర్‌పూర్ డివిజన్‌లోని బారాబాంబూ స్టేషన్‌లో హౌరా-సిఎస్‌టి ముంబై మెయిల్ (12810) పట్టాలు తప్పిన కారణంగా అనేక రైలు సర్వీసులు ప్రభావితమయ్యాయి. ప్రజలు ఈ మార్పులను గమనించి తదనుగుణంగా ప్రయాణాలు చేసుకోవాలని వాల్తేర్ డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కే. సందీప్ సూచించారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)
టాపిక్