Jagityala Crime: జగిత్యాల కోర్టు సంచలన తీర్పు,మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో 25ఏళ్ల జైలు శిక్ష

Best Web Hosting Provider In India 2024

Jagityala Crime: జగిత్యాల జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన తీర్పునిచ్చారు. ఆరు నెలల్లోనే నిందితునికి కఠినకారగార శిక్ష విధించారు. ఒకటి కాదు రెండు కాదు 25 ఏళ్ళ జైలు శిక్షతో పాటు ఐదు వేల జరిమానా విధించారు. బాధితురాలికి మూడు లక్షల పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

పెగడపల్లి పోలీస్ స్టేషన్ పరిదిలో మైనర్ బాలికపై ఆరు నెలల క్రితం వెంగలాయపేట కు చెందిన కొలిపాక అంజయ్య(66)అత్యాచారానికి పాల్పడ్డాడు. నిందితుడిపై పోక్సో చట్టం కింద పెగడపల్లి పోలీస్ స్టేషన్ లో అప్పటి ఎస్సై సతీష్ కేసు నమోదు చేయగా డిఎస్పీ లు వెంకటస్వామి, రఘుచందర్ కేసును విచారించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు విచారణను వేగవంతం చేసిన పోలీసులు కేసు నమోదు అయన 6 నెలల లోపే ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుకు ఆధారాలు సమర్పించారు.

కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టారు. సాక్షులను విచారించిన జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి నీలిమ నిందితుడికి 25 సంవత్సరాల కఠిన కారగార శిక్ష, 5 వేల రూపాయల జరిమాన విధించారు. బాధిత బాలికలకు 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని తీర్పునిచ్చారు.

సమాజంలో నేరం చేసిన వారు ఎవరూ శిక్ష నుండి తప్పించుకొలేరని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ చెప్పారు. పోలీసులు, ప్రాసిక్యూషన్ వారు వ్యూహంతో న్యాయ విచారణ, న్యాయ నిరూపణ వేగవంతగా జరిపి కచ్చితంగా శిక్షలు పడేలా చేస్తారని సూచించారు. అత్యాచారం కేసులో నిందితునికి శిక్ష పడటంలో కృషి చేసిన పీపీ మల్లికార్జున్, ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ డిఎస్పీ లు వెంకటస్వామి, రఘు చందర్ ఎస్సై సతీష్, CMS ఎస్.ఐ రాజు నాయక్, కోర్ట్ కానిస్టేబుల్ సాగర్, CMS కానిస్టేబుల్స్ కిరణ్ లను ఎస్పీ అభినందించారు.

అత్యాచారం కేసులో నిందితునికి 20 ఏళ్ళ జైలు శిక్ష 5 వేల జరిమానా..

జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ పరిదిలో 4 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకుడు కండ్లె రమేష్ బాబుకు 20 ఏళ్ళ కఠిన కారగార శిక్ష, 5 వేల జరిమాన విధిస్తూ తీర్పు ఇచ్చారు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నీలిమ. బాధిత బాలికలకు 3 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించారు.

కిరణా షాప్ కు వెళ్ళిన మైనర్ బాలికను ఇంట్లోకి తీసుకువెళ్లి అత్యాచారానికి పాల్పడిన రమేష్ బాబుపై నేరం రుజువు కావడంతో శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితునికి త్వరగా శిక్ష పడడంలో కోర్టుకు సాక్షాధారాలు అందించడంలో ప్రముఖ పాత్రపోషించిన పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ అభినందించారు.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ కు కరీంనగర్ ఏసిబి కోర్టు ఐదేళ్ళ జైలు శిక్షా, 12 వేల జరిమానా విధించింది‌. పదేళ్ళ క్రితం ఆదిలాబాద్ జిల్లా వాంకిడి పోలీస్ స్టేషన్ పరిధిలో 2013 లో నిందితునిగా ఉన్న ఉప్పల కృష్ణను జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించేందుకు అప్పటి ఇన్ స్పెక్టర్ చింతల లచ్చన్న రూ.10 వేలు డిమాండ్ చేశారు. నిందితుని తల్లి ఉప్పుల శశికళ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.

అప్పటి కరీంనగర్ రేంజ్ ఏసీబీ డీఎస్పీగా పనిచేస్తున్న సుదర్శన్ గౌడ్ ఆధ్వర్యంలో ఏసిబి అధికారులు సిఐ లచ్చన్న ను ట్రాప్ చేశారు. ఆ కేసుకు సంబంధించిన ఛార్జిషీట్ ను ఇన్ స్పెక్టర్ రమణ మూర్తి కోర్టులో దాఖలు చేయగా ప్రస్తుతం ప్రత్యక్ష్య సాక్షుల నుండి సేకరించిన వాంగ్మూలాలు, ఏసీబీ అధికారులు కోర్టు ముందు ఉంచిన ఆధారాలను పరిశీలించిన కరీంనగర్ కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు నిచ్చారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)

WhatsApp channel

టాపిక్

Telangana NewsKarimnagarAcb CourtTelugu NewsLatest Telugu NewsBreaking Telugu News
మరిన్ని తెలంగాణ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, హైదరాబాద్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024