Best Web Hosting Provider In India 2024
SC Categorisation: ఎస్సీ వర్గీకరణపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పును వెలువరించింద.ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణ అంశంపై కీలక తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది. విద్యా , ఉద్యోగాల కల్పనలో ఎస్సీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణను సమర్థిస్తూ తీర్పునిచ్చారు. 2004లో సుప్రీం కోర్టు ఐదుగురు జడ్జిల తీర్పును కొట్టేస్తూ తీర్పు వెలువడింది.
2000 నుంచి 2004వరకు ఉమ్మడి ఏపీలో వర్గీకరణ అమలు చేశారు. ఎమ్మార్పీఎస్ పోరాటం నేపథ్యంలో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేపట్టింది. నాలుగేళ్ల పాటు ఏపీలో రిజర్వేషన్ల వర్గీకరణ అమలు చేశారు. దీనిపై ఎస్సీల్లో మరో వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. 1994లో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఈదుమూడి నుంచి రిజర్వేషన్లలో వర్గీకరణ కోసం పోరాటం ప్రారంభించారు. సుదీర్ఘ ఉద్యమాల తర్వాత 1997లో వర్గీకరణకు చంద్రబాబు ప్రభుత్వం అమోదం తెలిపారు. ఆ తర్వాత దానిని మాల మహానాడు వ్యతిరేకించింది. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యమించారు.
ఉమ్మడి ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమలును వ్యతిరేకిస్తూ మాలమహానాడు ఏపీ హైకోర్టును ఆశ్రయించడంతో రిజర్వేషన్లలో వర్గీకరణ రద్దు చేశారు. దీనిపై వివాదం సుప్రీం కోర్టును చేరింది. అప్పట్లో ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం తమకు అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేయడానికి వీల్లేదని తీర్పునిచ్చింది.
2004లో ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆ తర్వాత కూడా వివాదం కొనసాగుతోంది. దాదాపు పాతికేళ్లుగా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆధ్వర్యంలో వర్గీకరణపై న్యాయపోరాటం జరుగుతోంది. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సుదీర్ఘ కాలంగా న్యాయపోరాటం సార్వత్రిక ఎన్ని చేస్తోంది. హైదరాబాద్ ఎన్నికల ప్రచార సభలో ఎస్సీ రిజర్వేషన్లకు తాము అనుకూలంగా ఉన్నామని ప్రధాని మోదీ ప్రకటించారు. మళ్లీ అధికారంలోకి వస్తే ఎస్సీ వర్గీకరణపై కీలక నిర్ణయం తీసుకుంటామని మోదీ హామీ ఇచ్చారు.
మరోవైపు పంజాబ్ ప్రభుత్వం కూడా గత ఫిబ్రవరిలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ప్రకటించడంతో పంజాబ్ హైకోర్టు సుప్రీంకోర్టుకు వివాదాన్ని సిఫార్సు చేసింది.దీంతో గత ఫిబ్రవరిలో సుప్రీం కోర్టులో విచారణ జరిపింది. ఈ విచారణలో ఎమ్మార్పీఎస్ కూడా తమ వాదనలు వినిపించింది. మాదిగలు రిజర్వేషన్లు పొందడంలో వెనుకబడి ఉన్నారని సుప్రీం కోర్టులో వాదనలు వినిపించారు. ఫిబ్రవరి 8న వాదనలు పూర్తయ్యాయి. అప్పటి నుంచి తీర్పును రిజర్వ్ చేసి ఉంచారు. తాజాగా సుప్రీం కోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనంలో ఆరుగురు వర్గీకరణకు అనుకూలంగా తీర్పునిచ్చారు.
రాష్ట్రాలు ఎస్సీ రిజర్వేషన్లను వర్గీకరించే నిర్ణయంతో జస్టిస్ బేలా త్రివేది విభేదించారు. మిగిలిన ఆరుగురు గతంలో ఐదుగురు సభ్యుల బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేస్తున్నట్టు ప్రకటించారు. సుప్రీం కోర్టు తాజా తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రభుత్వాలు విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది. ఎస్సీలలో అంతరాలు, జనాభా ప్రాతిపదికన అవకాశాల కల్పనపై విధివిధానాలు ఖరారు చేసే అవకాశం ఉంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మాల మాదిగల్లో.. మాలలే ఎక్కువ అవకాశాలు దక్కించుకుంటున్నారనే ఆరోపణలతో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ఆవిర్భవించింది. 2011 నాటికి ఉమ్మడి ఏపీలో కోటి 34 లక్షల మంది ఎస్సీల్లో 66లక్షల మాదిగలు, 54లక్షలు మాలలు ఉండేవారని ఉద్యోగాల్లో మాత్రం మాదిగలకు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనేది ఎమ్మార్పీఎస్ వాదనగా ఉండేది. వర్గీకరణ అమల్లో ఉన్న ఐదేళ్లలో మాదిగలకు అదనంగా 22వేల ఉద్యోగాలు దక్కాయని మందకృష్ణ పలు వేదికలపై ప్రకటించారు.
ఏబిసిడిలుగా వర్గీకరణ…
1997లో జరిగిన ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలను ఏ,బి,సి,డిలుగా వర్గీకరించారు. క్యాటగిరీ ఏ-లో రెల్లితో పాటు 12 ఉపకులాలకు 1శాతం, బి క్యాటగిరీలో మాదిగలతో పాటు 18 కులాలకు 7శాతం, సి క్యాటగిరీలో మాలలతో పాటు 25 ఉపకులాలకు 6శాతం, డి క్యాటగిరీలో ఆది ఆంధ్రులతో పాటు మరో నాలుగు కులాలకు 1శాతం రిజర్వేషన్ కల్పించారు.
టాపిక్