Allu Sirish: బ‌డ్డీలో నేను సెకండ్ హీరోనే – తెలుగు టాప్ హీరోలంద‌రి డైలాగ్స్ సినిమాలో ఉంటాయి – అల్లు శిరీష్ కామెంట్స్‌

Best Web Hosting Provider In India 2024


Allu Sirish: బ‌డ్డీ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ త‌ర్వాత తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోన్నాడు అల్లు శిరీష్‌ (Allu Sirish). ఆగ‌స్ట్ 2న (శుక్ర‌వారం ) ఈ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. బ‌డ్డీ మూవీకి శామ్ ఆంటోన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. రిలీజ్ ప్రెస్‌మీట్‌లో బ‌డ్డీ గురించి అల్లు శిరీష్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బ‌డ్డీ సినిమాలో తాను సెకండ్ హీరోన‌ని అల్లు శిరీష్ అన్నాడు. ఈ మూవీకి టెడ్డీ బేర్ ఫ‌స్ట్ హీరో అని తెలిపాడు.

సింగిల్ స్క్రీన్స్‌లో 99 రూపాయ‌లు…

“ఇటీవ‌ల వేసిన ప్రీమియ‌ర్స్‌లో మాస్ ఆడియెన్స్ కూడా మూవీని బాగా ఎంజాయ్ చేశారు. మేము ఇది ఎక్స్ పెక్ట్ చేయలేదు. నేను కూడా వారితో కలిసే సినిమా చూశాను. మేము ఏ ఏ సీన్స్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్ పెక్ట్ చేశామో ఆ సీన్స్ వారికి బాగా నచ్చుతున్నాయి. టికెట్ రేట్స్ ఎక్కువ ఉండటం వల్ల చాలా మంది ఆడియెన్స్ ఫ‌స్ట్ వీక్ సినిమాలు చూడ‌టం లేదు. సెకండ్ వీక్ థియేటర్స్ కు వెళ్తున్నారు. అందుకే “బడ్డీ” సినిమాకు సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్ 125 రూపాయల టికెట్ రేట్స్ పెట్టాం. దాదాపు 200 మంది ఎగ్జిబిటర్స్ తో మాట్లాడిన త‌ర్వాతే మా ప్రొడ్యూస‌ర్లు ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌ని” అల్లు శిరీష్ అన్నాడు.

అంద‌రి హీరోల డైలాగ్స్ ఉంటాయి…

“బ‌డ్డీ సినిమాలో నేను యాక్షన్ సీక్వెన్సులు ఎక్కువగా చేశా. యాక్షన్, కామెడీతో పాటు థ్రిల్లర్ ఎలిమెంట్స్ బాగుంటాయి. థ్రిల్లర్ ఎలిమెంట్స్ కు సరైన లాజిక్ కూడా ఉంటుంది. బ‌డ్డీలో టెడ్డీ బేర్ సినిమాలు బాగా చూస్తుంటంది. తను అందరు హీరోల ఫ్యాన్. అందుకే టాప్ హీరోల ఫేమస్ డైలాగ్స్ బ‌డ్డీలో పెట్టాం” అని అల్లు శిరీష్ పేర్కొన్నాడు.

మెగా ఫ్యామిలీ హీరోల‌తో…

క‌మెడియ‌న్ అలీ మాట్లాడుతూ మెగా ఫ్యామిలీలో దాదాపు అందరు హీరోలతో కలిసి నటించాను. శిరీష్ తాను ఒక పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చానని ఎప్పుడూ బిహేవ్ చేయడు. డైరెక్ట‌ర్‌ శామ్ తెలుగు ప్రేక్షకులకు ఒక మంచి మూవీ తీసుకొస్తున్నారు. బాగున్న సినిమాలను తెలుగు ఆడియెన్స్ తప్పకుండా ఆదరిస్తారు. బ‌డ్డీ ఆ లిస్ట్‌లో చేరుతుంది అని చెప్పాడు. హీరోయిన్‌గా త‌న‌కు ఫ‌స్ట్ మూవీ ఇద‌ని ఫ్రిషా రాజేష్ చెప్పింది.

బ‌డ్డీ మూవీతో రిలీజ్‌కు ముందే ప్రొడ్యూస‌ర్‌తో పాటు టీమ్ మొత్తం హ్యాపీగా ఉన్నార‌ని డైరెక్ట‌ర్ పేర్కొన్నాడు.

గౌర‌వం మూవీతో

గౌర‌వం మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్‌. కొత్త జంట‌, శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు, ఒక్క క్ష‌ణం, ఏబీసీడీ సినిమాల్లో హీరోగా న‌టించాడు. 2022లో వ‌చ్చిన ఊర్వ‌శివో రాక్ష‌సివో త‌ర్వాత సినిమాల‌కు రెండేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. మ‌ల‌యాళంలో మోహ‌న్‌లాల్ హీరోగా న‌టించిన 1971లో అల్లు శిరీష్ ఓ కీల‌క పాత్ర పోషించాడు.ఈ శుక్ర‌వారం బ‌డ్డీతో పాటు మ‌రో ప‌ది సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024