Best Web Hosting Provider In India 2024
Guppedantha Manasu August 1st Episode: డీబీఎస్‌టీ కాలేజీని గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకోవడానికి మినిస్టర్ ఏర్పాట్లు చేస్తాడు. మీ కుటుంబంలో అర్హత ఉన్నవారు కూడా ఎండీ బాధ్యతలు చేపట్టడానికి అయిష్టంగా ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సివస్తుందని మినిస్టర్ బోర్డ్ మీటింగ్‌లో ప్రకటిస్తాడు.
శైలేంద్రను ఎండీ చేస్తే మా కాలేజీ మా దగ్గరే ఉంటుందని, మా కుటుంబం పరువు నిలబడుతుందని మినిస్టర్‌తో దేవయాని అంటుంది. శైలేంద్రకు ఎండీ పదవినిఇవ్వమని రిషి, వసుధారలలో ఎవరో ఒకరు వచ్చి చెప్పాలని ఇదివరకే ప్రకటించానని..అందుకు శైలేంద్రకు గడువు కూడా ఇచ్చానని మినిస్టర్ అంటాడు. రిషి, వసుధార ఎవరూ రాలేదు కాబట్టే కాలేజీని హ్యాండోవర్ చేసుకుంటున్నట్లు మినిస్టర్ చెబుతాడు.
మహేంద్ర ఎమోషనల్…
డాక్యుమెంట్లపై అందరి సంతకాలు తీసుకోవడం మొదలుపెడతాడు మినిస్టర్. సంతకం పెడుతూ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. నాన్న రిషి…నీకు ప్రాణమైన కాలేజీని నేను కాపాడలేకపోతున్నానంటూ ఆవేదనకు లోనవుతాడు. చివరకు దేవయాని, శైలేంద్ర మాత్రం డాక్యుమెంట్లపైసంతకం చేయడం మిగిలి ఉంటుంది.
రంగాకు ఫోన్ చేస్తాడు శైలేంద్ర. కానీ ఫోన్ స్విఛాఫ్ అని వస్తుంది. చివరి నిమిషంలో రంగా హ్యాండిచ్చాడని కంగారు పడతాడు. దేవయాని చేత కూడా మినిస్టర్ కాలేజీ హ్యాండోవర్ పేపర్స్‌పై సంతకాలు తీసుకుంటాడు. చివరగా శైలేంద్ర పేపర్స్‌పై సంతకం పెట్టబోతుండగా వసుధార అక్కడికి ఎంట్రీ ఇస్తుంది.
భయపడ్డ శైలేంద్ర…
వసుధార ఎంట్రీని చూసి అందరూ సర్‌ప్రైజ్‌గా ఫీలవుతారు. రంగా ఎంట్రీ ఇస్తాడని అనుకుంటే వసుధార రావడం చూసి శైలేంద్ర షాకవుతాడు. వసుధారను చూసి దయ్యం అంటూ భయంతో వణికిపోతుంటాడు. దేవయాని, ధరణి చాటున దక్కుంటాడు. నువ్వేలా వస్తావని, దయ్యమైపోయావు కదా అని శైలేంద్ర నోరుజారుతాడు.నేను దయ్యమేంటి అని శైలేంద్రను అడుగుతుంది వసుధార. నేను రాననుకున్నారా, రాలేననుకున్నారా అంటూ శైలేంద్రపై సెటర్లు వేస్తుంది వసుధార.
కొడుకుకు దేవయాని వార్నింగ్…
వసుధార బతికే ఉందని,మాట్లాడకుండా నోరుమూసుకోమని దేవయాని కొడుకుకు వార్నింగ్ ఇస్తుంది. వసుధార తిరిగి రావడంతో మహేంద్ర ఆనందంగా ఫీలవుతాడు. నువ్వు తిరిగి వచ్చావంటే రిషి కూడా అంటూ మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. నేను రిషి నీడను…నీడ వచ్చినప్పుడు రూపం వస్తుంది కదా అని వసుధార అంటుంది. అప్పుడే రిషి స్టైల్‌గా కాలేజీలోకి ఎంట్రీ ఇస్తాడు.
వసుధార పవర్‌ఫుల్ డైలాగ్స్…
రిషిని చూసి స్టూడెంట్స్ హ్యాపీగా ఫీలవుతారు. పువ్వులు చల్లుతూ రిషికి ఘనంగా కాలేజీలోకి స్వాగతం పలుకుతారు. తన అడుగుల శబ్ధంతో శత్రువుల గుండెల్లో ప్రకంపనలు సృష్టిస్తూ….తన పిడికిలి పవర్‌తో ఎదుటివాళ్ల ఒంట్లో ఒణుకు పుట్టిస్తూ రిషి వస్తున్నాడంటూ భర్త రీఎంట్రీ గురించి వసుధార పవర్‌ఫుల్ డైలాగ్స్ చెబుతూ బిల్డప్‌లు ఇస్తుంది. వచ్చింది రిషినో, రంగానో అర్థం కాక దేవయాని, శైలేంద్ర కన్ఫ్యూజ్ అవుతారు.
రిషి ఎంట్రీ అదుర్స్…
కొడుకును చూడగానే మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. రిషి కూడా తండ్రిని డాడ్ అని పిలుస్తాడు. ఈ పిలుపు విని ఎన్నాళ్లైంది అంటూ కొడుకును గుండెలకు హత్తుకొని కన్నీళ్లు పెట్టుకుంటాడు మహేంద్ర. ఫణీంద్ర కూడా ఆనందపడతాడు. దేవయాని, శైలేంద్ర కూడా రిషిపై ప్రేమ ఉన్నట్లుగా అందరి ముందు నటిస్తారు. రిషి ఎంట్రీ అదిరిపోయిందని కాలేజీ స్టాఫ్ అంటారు. ఇదంతా వసుధార అరేంజ్ చేసిందని రిషి సమాధానమిస్తాడు.
కళ్లు తిరిగిపడిపోయిన శైలేంద్ర…
రిషి రీఎంట్రీతో ఈ కాలేజీకి ఎండీ ఎవరో తాను చెప్పాల్సిన అవసరం లేదని మినిస్టర్ ప్రకటిస్తాడు. ఇక నుంచి రిషినే అంతా చూసుకుంటాడని, మా అవసరం కూడా లేదని చెప్పి కాలేజీలోని వెళ్లిపోతాడు. చివరి నిమిషంలో ఎండీ సీట్ చేజారిపోవడం చూసి తట్టుకోలేక కళ్లు తిరిగి కిందపడిపోతాడు శైలేంద్ర.
శైలేంద్ర కళ్లు తెరవగానే అతడికి ఎదురుగా రిషి ఉంటాడు. రిషి చూసి భయపడతాడు. తాను రిషి కాదు రంగానని శైలేంద్రతో అబద్ధం ఆడుతాడు రిషి.
వసుధార ఎంట్రీతో తికమక…
తాను కాలేజీలో అడుగుపెట్టగానే వసుధార కనిపించిందని, తనను రిషి అని పొరపడి చాలా హడావిడి చేసిందని శైలేంద్రతో చెబుతాడు రిషి. ఎస్కేప్ కాకుండా తనను బలవంతంగా కాలేజీలోకి తీసుకొచ్చిందని శైలేంద్రను నమ్మిస్తాడు.
వసుధార తెలియనట్లుగా ఎవరు ఆ అమ్మాయి…ఆమె గురించి నాకు ఎందుకు చెప్పలేదని శైలేంద్రపై రివర్స్ ఎటాక్ మొదలుపెడతాడు రిషి. నా దరిద్రం కొద్ది వసుధార ఫొటో నీకు చూపించలేదు. నా ఖర్మ అలా కాలింది కాబట్టే ఆమె కరెక్ట్ టైమ్‌లో కాలేజీలోకి ఎంట్రీ ఇచ్చి మన ప్లాన్ మొత్తం చెడగొట్టిందని శైలేంద్ర చిరారకుపడతాడు.
సీన్ రివర్స్…
నేను మిమ్మల్ని ఎండీగా అనౌన్స్ చేద్దామంటే వసుధార ఎంట్రీతో మొత్తం సీన్ మారిపోయిందని, మినిస్టర్ కూడా ఇక నుంచి కాలేజీని రిషి చూసుకుంటాడని వెళ్లిపోయాడు..మరి ఇప్పుడు ఏం చేయాలని శైలేంద్రను అడుగుతాడు రిషి. తాను చెప్పిన ఫైల్స్‌పై సంతకాలు చేయాలని, వద్దన్న వాటిని పక్కనపెట్టమని రిషికి చెబుతాడు శైలేంద్ర.
కాలేజీ విషయంలో రిషిగా నాటకం ఆడుతాను కానీ…వసుధారకు భర్తగా మాత్రం నటించనని రంగాతో అంటాడు రిషి. ఇస్తానన్న డబ్బుకు రెండింతలు ఇస్తానని శైలేంద్ర ఆఫర్ చేస్తాడు. నేనేం నిన్ను మోసం చేయమని, తప్పు చేయమని అనడం లేదు కేవలం నటించమని చెబుతాన్ననని రిషిని బతిమిలాడుతాడు శైలేంద్ర. కాలేజీలో వసుధార చేసిన ఓవర్‌యాక్షన్ చూస్తుంటే ఆమెతో నటించడం కూడా కష్టమేనని రిషి చెబుతాడు.
వసుధార ఎంట్రీ…
అప్పుడే వసుధార వారి దగ్గరకు వస్తుంది. ఏంటి ఓవర్‌యాక్షన్, కష్టం అని అంటున్నారు ఏమైంది అని రిషి, శైలేంద్రలను అడుగుతుంది. కాలేజీలో నేను కళ్లు తిరిగిపడిపోవడం చూసి కొందరు స్టూడెంట్స్ ఓవర్‌యాక్షన్ అనుకుంటున్నారని శైలేంద్ర మాట మార్చుతాడు. నువ్వు రిషిని తిరిగి తీసుకురావడం ఆనందంగా ఉందని టాపిక్ డైవర్ట్ చేస్తాడు. శైలేంద్ర కళ్లు తిరిగిపడిపోవడంపై మహేంద్ర కూడా పంచ్‌లు వేస్తాడు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.