Kombucha: కొరియన్‌లా మెరిసే చర్మం వెనుక ఉన్న రహస్యం ఇదే, ప్రతిరోజు తాగి చూడండి

Best Web Hosting Provider In India 2024

Kombucha: కొంబుచా కొరియన్లు ఇష్టంగా తాగే పానీయం. ప్రతిరోజు ఈ కొంబుచాను తాగడం వారికి అలవాటు. ఇది ఒక సాంప్రదాయ పానీయంగా చెప్పుకోవచ్చు. వారి మెరిసే చర్మం వెనుక, పట్టు లాంటి కురుల వెనుక ఉన్న రహస్యం కొంబుచా టీ అని అంటారు. ఇది పులియబెట్టిన పానీయం. దక్షిణ కొరియాకు చెందినది. కానీ ఈ పానీయం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. కొరియన్లు ఎందుకు ప్రతిరోజూ దీన్ని తాగుతారో అందరూ తెలుసుకోవాలి.

ఆయుష్షు పెంచే టీ

కొంబుచాను సాంప్రదాయకంగా ‘టీ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ’ అని పిలుస్తారు. అంటే ఈ కొంబుచాను తాగడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని చెప్పుకుంటారు. ఇది ఆరోగ్యాన్ని సుసంపన్నం చేసి, పేగులకు రక్షణ కల్పిస్తుందని అంటారు. దక్షిణ కొరియాలో ఈ టీ తాగనిదే ఏ పనీ మొదలుపెట్టరు. ఇది ఇతర తేనీటితో పోలిస్తే ప్రత్యేకంగా ఉంటుంది.

కొంబుచా ప్రత్యేకత ఇదే

కొంబుచా అనేది ఒక తీయని పానీయం. బ్యాక్టీరియా, ఈస్ట్ వంటి వాటిని దీనికి జోడిస్తారు. వాటిని పులియబెట్టి తయారు చేస్తారు. కిణ్వ ప్రక్రియకు ఏడు నుంచి 14 రోజుల వరకు గురిచేస్తారు. ఈ టీ లోని సేంద్రియ ఆమ్లాలు, వాయువులు, బయో యాక్టివ్ పదార్థాలతో సహా కలిసి ఆరోగ్యకరమైన సమ్మేళనాలను సృష్టిస్తాయి. ఫలితంగా ఇది ఒక చిక్కని ప్రోబయోటిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు నిండి ఉన్న పానీయంగా మారుతుంది. ఈ టీలో నలుపు లేదా ఆకుపచ్చ రంగులో ఉండే ఊలాంగ్ టీ ఆకులు ఉంటాయి. అలాగే కొన్ని రకాల పండ్,లు మూలికలు, సుగంధ ద్రవ్యాలను కూడా కలుపుతారు. ఈ కొంబుచా టీని తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి.

జీర్ణశక్తికి

కొంబుచా అనేది అధిక ప్రోబయోటిక్స్ ఉండే పానీయం. ఇది ప్రయోజనకరమైన బ్యాక్టీరియాలను ఉత్పత్తి చేస్తుంది. ఆరోగ్యకరమైన పొట్ట బ్యాక్టీరియాలను పెంచుతుంది. పోషకాల శోషణను పెంచుతాయి. కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణాశయంతర సమస్యలు రాకుండా అడ్డుకుంటాయి. కొరియన్లు ఈ టీ తాగడం వల్ల జీర్ణక్రియను కాపాడుకుంటారు. ఎప్పుడైతే జీర్ణ క్రియ సవ్యంగా ఉంటుందో చర్మం కూడా మెరుస్తూ ఉంటుంది.

మెరిసే చర్మానికి

శరీరం వ్యర్ధరహితంగా ఉంటే చర్మానికి మెరుపు కనిపిస్తుంది. శరీరంలోని టాక్సిన్లను బయటికి పంపే శక్తి కొంబూచాకు ఉంది. కొంబూచాలో గ్లూకోరోనిక్ యాసిడ్ తో సహా అనేక సేంద్రియ ఆమ్లాలు ఉంటాయి. ఇవి కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి. దీనివల్ల శరీరంలోని వ్యర్ధాలు బయటికి పోతాయి. శరీరం నుండి విషాలు తొలగిపోతాయి. ఎప్పుడైతే సహజ నిర్వీకరణ జరుగుతుందో అప్పుడు ఆ మెరుపు మీ చర్మంపై కనపడుతుంది. ఆరోగ్యంగా కనిపిస్తారు. అందం కూడా ఇనుమడిస్తుంది.

రోగనిరోధక శక్తికి

రోగ నిరోధక శక్తికి కొంబూచా టీ సహాయపడుతుంది. దీనిలో విటమిన్ సి, పాలిఫెనాల్స్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇది శరీరంని ఆక్సీకరణ ఒత్తిడి నుండి బయట పడేస్తుంది. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇన్ఫ్లమేషన్ రాకుండా అడ్డుకుంటాయి. అనారోగ్యాలను నిరోధించే సామర్థ్యాన్ని శరీరానికి అందిస్తాయి. కొరియన్లు రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి కొంబూచా టీ ముఖ్యమైనది.

కొరియన్ సంస్కృతిలో చర్మ ఆరోగ్యం ముఖ్యమైనది. వారి గ్లాసీ స్కిన్ ఉండేలా చూసుకుంటారు. కొంబుచాలోని యాంటీ ఆక్సిడెంట్లు… ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి సహాయపడతాయి. దీనివల్ల అకాల వృద్ధాప్యం రాదు. అంటే చర్మంపై ముడతలు, గీతలు వంటివి రావు. కాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుంది. కాబట్టి చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. యవ్వనంగా మెరిసే ఛాయను ఇస్తుంది. అందుకే దక్షిణ కొరియన్లు అంత అందంగా ఉంటారు.

కొంబూచా టీని మనం తయారు చేసుకోవడం కష్టం. దక్షిణ కొరియాలో దీన్ని చక్కగా తయారు చేసుకోగలరు. ఎందుకంటే కిణ్వ ప్రక్రియకు గురి చేయడం, బ్యాక్టీరియా ఈస్ట్ వంటి వాటిని కలిపి ఉంచడం ఇవన్నీ మనం ఇంట్లో చేయలేము. కాబట్టి ఎక్కడైనా కొరియా వారి కొంబూచా టీ లభిస్తే దాన్ని తాగడమే మంచిది.

WhatsApp channel
Source / Credits

Best Web Hosting Provider In India 2024