Best Web Hosting Provider In India 2024
Raayan Box Office Collection: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ స్వీయ దర్శకత్వంలో వచ్చిన రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రాయన్. సందీప్ కిషన్, అపర్ణ బాలమురళి, ఎస్జే సూర్య, కాళీదాస్ జయరామ్, ప్రకాష్ రాజ్, సెల్వరాఘవన్ వంటి ప్రముఖులు నటించిన రాయన్ మూవీ జూలై 27న విడుదలై మంచి టాక్ తెచ్చుకుంటోంది.
అన్ని భాషలు కలిపి
పాజిటివ్ టాక్ మూలంగా రాయన్ సినిమాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపిస్తోంది. రాయన్ మూవీకి తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజున రూ. 38 లక్షల షేర్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. అలాగే తెలుగుతోపాటు తమిళం, హిందీ భాషల్లో కలుపుకుని రాయన్ మూవీకి ఇండియాలో రూ. 3.85 కోట్ల నెట్ ఇండియా కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
15.38 శాతం తగ్గిన కలెక్షన్స్
ఈ 3.85 కోట్లల్లో తమిళం నుంచి రూ. 3 కోట్లు, హిందీ నుంచి రూ. 15 లక్షలుగా ఉన్నాయి. అయితే, కలెక్షన్స్‌తో పర్వాలేదనిపించుకున్నప్పటికీ ఆరో రోజున రాయన్ కలెక్షన్స్ తగ్గాయి. ఐదో రోజున వచ్చిన రూ. 4.55 కోట్లతో పోలిస్తే ఆరో రోజున రాయన్ మూవీకి 15.38 శాతం కలెక్షన్స్ పడిపోయాయి. ఇదిలా ఉంటే, ఇండియా వ్యాప్తంగా రాయన్ సినిమాకు రూ. 56.85 కోట్ల నెట్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి.
వంద కోట్లు దాటేసింది
ఈ కలెక్షన్స్‌లలో తమిళ వెర్షన్‌కు రూ. 48.55 కోట్లు, తెలుగు వెర్షన్‌కు రూ. 7.1 కోట్లు, హిందీ బెల్ట్ నుంచి రూ. 1.2 కోట్లు మాత్రమే వసూలు అయ్యాయి. ఇలా రాయన్ చిత్రానికి వరల్డ్ వైడ్‌గా రూ. 93.50 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చినట్లుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. కానీ, గ్రాస్ కలెక్షన్స్ మాత్రం వంద కోట్లు దాటి రాయన్ హండ్రెడ్ క్రోర్ క్లబ్లో చేరిపోయింది.
వారం కాకముందే
తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాలు, కేరళ, హిందీతోపాటు రెస్టాఫ్ ఇండియా, ఓవర్సీస్ ఇలా అన్ని ఏరియాల్లో కలుపుకుని ప్రపంచవ్యాప్తంగా రాయన్ మూవీకి ఆరు రోజుల్లో రూ. 107 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు అయ్యాయి. దీంతో 6 రోజుల్లోనే అంటే వారం కాకముందే 100 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాగా రాయన్ రికార్డ్ క్రియేట్ చేసింది.
ఒక్క రోజులోనే
ఇదిలా ఉంటే వరల్డ్ వైడ్‌గా రూ. 46 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ధనుష్ 50వ మూవీ రాయన్‌కు ఇంకా ఒక కోటి రూపాయలు వస్తేనే ఆ లక్ష్యాన్ని ఛేదించినట్లు అవుతుంది. రాయన్‌కు వచ్చే రెస్పాన్స్‌ను బట్టి ఇంకా ఒక్క రోజులోనే ఆ కోటి దాటేయగలదని తెలుస్తోంది. ఈ కోటి దాటిన తర్వాత రాయన్ మూవీకి వచ్చే కలెక్షన్నీ లాభాలుగా మారనున్నాయి. అలాగే తెలుగులో ఇంకో 56 లక్షలు వస్తే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఫినీష్ అవుతుంది.
టాపిక్