Best Web Hosting Provider In India 2024
Trisha Web Series: క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇష్టపడే వారికి గుడ్ న్యూస్. తాజాగా ఆ జానర్ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలోకి వచ్చేసింది. త్రిష నటించిన తొలి సిరీస్ ఇదే కావడం విశేషం. నిజానికి ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని చెప్పిన ఈ సిరీస్ ఒక రోజు ముందే ఓటీటీలో ప్రత్యక్షమైంది. ఈ సిరీస్ సోనీలివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది.
త్రిష నటించిన వెబ్ సిరీస్ బృందా
త్రిష నటించిన ఈ వెబ్ సిరీస్ పేరు బృందా. సుమారు మూడేళ్లుగా చిత్రీకరణలో ఉన్న ఈ సిరీస్ మొత్తానికి ఓటీటీలో అడుగుపెట్టింది. చాలా రోజులుగా ఈ సిరీస్ ప్రమోషన్లు నిర్వహిస్తున్న సోనీలివ్ ఓటీటీ.. ఆగస్ట్ 2 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు చెబుతూ వస్తోంది. అయితే ఆశ్చర్యకరంగా ఒక రోజు ముందే అంటే గురువారం (ఆగస్ట్ 1) సాయంత్రం నుంచే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుండటం విశేషం.
త్రిష ఓ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సిరీస్ ఇది. యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ వెబ్ సిరీస్‌కు సూర్య వంగల దర్శకత్వం వహించాడు. చాలా రోజుల క్రితమే బృందా వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయింది. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్స్‌తో త్రిష మార్కట్ డౌన్ కావడంతో పాటు బడ్జెట్, ప్రీ ప్రొడక్షన్ ఇష్యూస్ కారణంగా సిరీస్ రిలీజ్ డిలే అవుతూ వచ్చింది. పొన్నియన్ సెల్వన్, విజయ్ లియో సినిమాలతో త్రిష గ్రాండ్ కమ్‌బ్యాక్ ఇచ్చింది.
8 ఎపిసోడ్లు.. 5 గంటల 30 నిమిషాలు..
ఈ బృందా వెబ్ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్లుగా ఉండటం విశేషం. మొత్తంగా 5 గంటల 30 నిమిషాల నిడివితో ఈ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిజానికి ఓ వెబ్ సిరీస్ కు ఇది చాలా ఎక్కువ సమయమనే చెప్పాలి.
బృంద సిరీస్‍లో త్రిష, ఇంద్రజిత్ సుకుమారన్ ప్రధాన పాత్రలు పోషించగా.. జయ ప్రకాశ్, ఆమని, రవీంద్ర విజయ్, ఆనంద్ సామి, రాకేందు మౌళి కీలకపాత్రలు చేశారు. బృంద టీజర్ ఆసక్తికరంగా ఉంది. మూఢనమ్మకాలు, వరుస హత్యలు, ఇన్వెస్టిగేషన్ అంశాలతో టీజర్ ఉంది. ఎమోషనల్‍గానూ సాగింది. మిస్టరీతో కూడిన కేసును పోలీస్ ఆఫీసర్ బృంద (త్రిష) దర్యాప్తు చేయనున్నారని అర్థమవుతోంది. ఈ కేసుతో వ్యక్తిగతంగానూ ఆమెకు సంబంధం ఉంటుందనేలా టీజర్లో మేకర్స్ హింట్ ఇచ్చారు.
ఓ బాలికను ఓ పెద్ద రాయికి కట్టేసి ముఖానికి పసుపు, కుంకమ రాసి.. ఏదో ద్రవం పోస్తున్న సీన్‍తో బృంద టీజర్ మొదలైంది. “మనలో ఉన్న కోపం, మోసం, ద్వేషం వీటితో కాదు మనం పోరాడాల్సింది. మనలో ఉన్న మంచితో. అది మనలో నుంచి పోకుండా” అనే వాయిస్ ఓవర్‌లో బ్యాక్ గ్రౌండ్‍లో నడుస్తుండగా ఈ టీజర్ షురూ అయింది. ఆ తర్వాత వరుస హత్యలు జరిగినట్టు చూపించారు మేకర్స్. ఆ తర్వాత కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న షాట్స్ ఉన్నాయి. గన్ పేల్చే షాట్‍తో టీజర్ ముగిసింది. ఒక నిమిషం 28 సెకన్ల పాటు ఉన్న ఈ టీజర్ ఇంట్రెస్టింగ్‍గా సాగింది.