Best Web Hosting Provider In India 2024
Nindu Noorella Saavasam Today Episode: నిండు నూరేళ్ల సావాసం నేటి ఎపిసోడ్‌లో (NNS 2nd August Episode)అరుంధతి ఆత్మను బంధించడానికి ఇది సరైన సమయం కాదని, మరో మూడు రోజులు ఆగమని ఘోరాని హెచ్చరిస్తాడు దేవా. సరేనని పూజ ఆపేసి తన ప్రాణాలు అడ్డువేసైనా మూడు రోజులు ఆ అస్థికల్ని కాపాడతానని అంటాడు ఘోరా.
అమ్మలా చూసుకునేది
పిల్లలు స్కూల్‌కి తయారవుతూ ఉంటారు. కానీ అంజు మాత్రం దిగులుగా కూర్చుంటుంది. ఏమైంది అని అడుగుతుంది అమ్ము. అమ్మ వాళ్ల అమ్మానాన్నల్ని కలుసుకోవాలని ఉంది. అమ్మకి అక్కాచెల్లెళ్లు, అన్నాతమ్ములు ఉంటే మనకి పిన్ని, మామయ్య ఉంటారు కదా.. మామయ్య సంగతి ఏమోగానీ, పిన్ని ఉంటే మనల్ని అమ్మలా చూసుకునేది అంటుంది అంజు.
సరే.. మనం ఈరోజు స్కూల్‌కి వెళ్లొచ్చేసరికి డాడీ వాళ్లు అమ్మ వాళ్ల గురించి కనుక్కుంటారు కదా.. మనకి పిన్ని ఉంటుందనే మోటివేషన్‌తోనే ఉందాం అని అమ్ము అందరిలోనూ హుషారు నింపుతుంది.
హాల్లో కూర్చున్న అమర్‌కి కాఫీ ఇస్తుంది భాగీ. థ్యాంక్ చెప్పిన అమర్‌తో భార్యాభర్తల మధ్య థ్యాంక్స్‌లు ఎందుకండీ.. అంటుంది. అవసరమే అంటాడు అమర్.
హాస్పిటల్‌కు వెళ్దాం
అప్పుడే పిల్లలు కిందికి వచ్చి డాడీ.. ఈరోజు మనం తాతయ్యని చూడటానికి వెళ్తున్నామా? అని అడుగుతారు. లేదంటాడు అమర్. అప్పుడే అమర్‌కి ఫోన్ చేసి రామ్మూర్తికి మెలకువ వచ్చిందని వెంటనే మిమ్మల్ని చూడాలంటున్నాడని చెబుతుంది మంగళ. సరేనంటాడు అమర్. వెంటనే అమ్మానాన్నల్ని కూడా రెడీ అవమను.. అందరం కలిసి హాస్పిటల్‌కి వెళ్దామంటాడు. సరే అంటుంది భాగీ.
ఫోన్ రాకముందే తాతయ్యని కలవడానికి వెళ్దామని ఎలా అడిగావంటాడు అమర్. నేను అడిగింది ఈ తాతయ్య గురించి కాదు డాడీ.. అమ్మ వాళ్ల అమ్మానాన్నల గురించి.. పర్లేదు డాడీ.. ముందు ఈ తాతయ్యని చూసిన తర్వాతే ఆ తాతయ్య గురించి వెతకండి అని చెబుతారు. పిల్లలు కూడా వెతకడానికి వస్తామంటే వద్దు స్కూల్‌కి వెళ్లండని చెబుతాడు అమర్.
హత్తుకున్న అరుంధతి
పిల్లలు దిగులుగా రావడం చూసి ఏమైందని అడుగుతాడు రాథోడ్. లోపల జరిగింది చెప్పి బాధపడుతుంది అంజు. పిల్లల మాటలు విన్న అరుంధతి ఏడుస్తుంది. ఎక్కడున్నా అమ్మ మనల్ని చూస్తూనే ఉంటుంది కదా.. అమ్మా.. నువ్వేం బాధపడకు. నువ్వెంత మంచిదానివో అమ్మమ్మ తాతయ్యలకు చెబుతాం అంటారు పిల్లలు. అరుంధతి ఏడుస్తూ పిల్లల దగ్గరకు వచ్చి హత్తుకుంటుంది.
ఏదో తేడాగా అనిపించి ఆశ్చర్యపోతారు పిల్లలు. మీరు వచ్చే వరకు నేను ఇంట్లో ఉండను. ఆ ఘోరా నన్ను బంధిస్తాడు. మీరు సాధించడం, ఎదగడం చూడలేను.. ఏం జరిగినా మీరు నలుగురూ కలిసే ఉండండి అని చెబుతుంది అరుంధతి. మా మాటలు విని ఏడవకు, మా కోసమైనా నవ్వుతూ ఉండాలమ్మా అంటారు పిల్లలు. అమ్మూ.. నువ్వే వీళ్లని జాగ్రత్తగా చూసుకోవాలి. మిస్సమ్మ తోడు విడవకండి అని చెబుతుంది అరుంధతి.
పీక పిసికి చంపాలని
రాథోడ్ నువ్వే పిల్లలకి ఎప్పుడూ మిస్సమ్మ తోడుగా ఉండేలా చూడు. ఆ మనోహరి వీళ్ల జోలికి రాకుండా చూడు అంటుంది. మీరు ఆశించే ప్రేమ మీ అమ్మ పుట్టింట్లో అయినా దొరకాలని ఆశిస్తున్నా అంటూ పిల్లల్ని స్కూల్‌కి తీసుకుని వెళ్తాడు రాథోడ్. మనోహరి ఫొటోకి బాణాలు వేస్తూ ఉంటాడు రణ్వీర్. వద్దని వారిస్తాడు లాయర్. ఆ మనోహరిని పీక పిసికి చంపాలనేంత కోపం ఉంది. కానీ, అది నొప్పి తెలియకుండా చావడం కాదు, చేసిన పాపాలకి లెక్క సెటిల్‌చేసి పరిగెత్తించి పరిగెత్తించి చంపాలి అంటాడు రణ్వీర్.
నేను ఆటాడిస్తా
మనోహరిని బయటకు తీసుకురావడం కాదు, తనే ఆ ఇంట్లోకి వెళ్లి తన ముందు నిలబడతా అంటాడు. అది చాలా ప్రమాదమని హెచ్చరిస్తాడు లాయర్. తనకంతా తెలుసని, ఇప్పటివరకు మనోహరి ఆటాడించింది.. ఇకనుంచి తను ఆటాడిస్తా అంటాడు. మనోహరిని నాశనం చేయడానికి రణ్వీర్ ఏం చేయబోతున్నాడు? అరుంధతి తల్లిదండ్రులు ఎవరో అమర్ తెలుసుకుంటాడా? అనే విషయాలు తెలియాలంటే ఈరోజు ఆగస్టు 3న ప్రసారం కానున్న నిండు నూరేళ్ల సావాసం సీరియల్ తర్వాతి ఎపిసోడ్ తప్పకుండా చూడాల్సిందే!