Best Web Hosting Provider In India 2024
Karthika deepam 2 serial today august 2nd episode: దీప నరసింహ పంపించిన నోటీసుల గురించి చాలా టెన్షన్ పడుతుంది. దశరథ వాళ్ళు కూడా ఏంటి ఇలా జరిగిందని బాధపడతారు. ఎలాగైనా తల్లీకూతుళ్లను విడదీయకుండా చూడాలని సుమిత్ర అంటుంది. అప్పుడే కార్తీక్ వస్తే నోటీసులు చూపిస్తుంది.
దీపను వెళ్ళగొట్టాలి
నా కూతురిని నాకు దూరం కాకుండా చూడమని దీప వాళ్ళని అడుగుతుంది. రౌడీకి ఇలాంటివి ఏవి తెలియకూడదు. అసలే దాని గుండె అని చెప్పకుండా ఆగిపోతాడు. ఏమైంది నా బిడ్డకని దీప కంగారుగా అడుగుతుంది. లాయర్ ని కలిసి మాట్లాడి ఏం చేయాలో ఆలోచిద్దామని అంటాడు.
దీప, కార్తీక్ లాయర్ ని కలిసేందుకు వెళతారు. శ్రీధర్ ఆవేశంగా కాంచనను పిలుస్తాడు. దీప దగ్గరకు వెళ్ళాలి పద. జ్యోత్స్న ఫోన్ చేసి ఏడుస్తుంది. దీప ఉండగా నా నిశ్చితార్థం జరగదు. ఎందుకో మీరే అర్థం చేసుకోండి అంటుంది. కార్తీక్ మన కొడుకు అయితే జ్యోత్స్న మనకు కాబోయే కోడలు.
వీళ్లిద్దరినీ ఎలా మ్యానేజ్ చేయాలో తెలియక మనం నలిగిపోవడం ఎందుకు? మనం వెళ్ళి దీపతో మాట్లాడదాం. నువ్వు ఇక్కడ ఉంటే నా కొడుకు జీవితం సరిగా ఉండేలా లేదు ఇక్కడ నుంచి వెళ్లిపొమ్మని చెప్దామని అంటాడు. ఎక్కడికి పంపిస్తామని కాంచన అడుగుతుంది.
కార్తీక్ దీప భర్తనా?
నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర వంట చేయడానికి పంపిస్తానని అవసరమైతే సుమిత్రతో చెప్పిద్దామని అంటాడు. కార్తీక్ కి తెలిస్తే ఒప్పుకోడని కాంచన అంటుంది. కార్తీక్ ఏమైనా దీప భర్తనా అడ్డుపడటానికి అని ఆవేశంగా మాట్లాడతాడు. కాంచన శ్రీధర్ కు నచ్చజెప్పడానికి చూస్తుంది.
మన పెంపకాన్ని మనమే అనుమానిస్తే ఎలా? వాళ్ళ నిశ్చితార్థానికి మంచి ముహూర్తం చూసే వరకు ప్రశాంతంగా ఉండండి. దీప, కార్తీక్ ని ఎమీ అనొద్దని చెప్తుంది. దీప రోడ్డు మీద వెళ్తుంటే ఒకతను పిలిచి ఆపుతాడు. ఊరి వాళ్ళందరూ దీపను అప్పుల గురించి నిలదీస్తారు.
దీప ఇక్కడ ఉందని వీళ్ళకు ఎలా తెలుసని కార్తీక్ అనుమానిస్తాడు. నరసింహ చాటుగా చూస్తూ వీళ్ళను సెట్ చేసింది నేనే అనుకుంటాడు. మీ దగ్గర అప్పు చేసింది నా భర్త కదా అడ్రస్ ఇస్తాను అతన్ని వెళ్ళి అడగమని దీప చెప్తుంది. వాళ్ళు మాత్రం దీపను నోటికొచ్చినట్టు మాట్లాడతారు.
నరసింహ అప్పులు తీర్చిన కార్తీక్
కార్తీక్ వాళ్ళని తిడతాడు. నీకు అంత బాధగా ఉంటే నువ్వు తీర్చమని అంటాడు. దీప, కార్తీక్ ని నరసింహ ఇదంతా వీడియో తీస్తూ ఉంటాడు. మీకు ఎంత ఇవ్వాలో చెప్పమని కార్తీక్ అడుగుతాడు. నరసింహ చేసిన అప్పు మొత్తాన్ని కార్తీక్ కట్టేస్తాడు. వేరే దారి లేక మిమ్మల్ని ఆపలేకపోయాను కానీ మీరు ఎందుకు బాకీ తీర్చడమని దీప అడుగుతుంది.
నీకు ఇంకా ఇది అర్థం కాలేదా? నువ్వు కారులో ఉన్నావని వాళ్ళకు ఎలా తెలుసు. ఇదంతా నరసింహ కావాలనే చేస్తున్నాడు. నాకు తెలిసి వాడు ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడని చుట్టూ చూస్తాడు. వాడు మిమ్మల్ని టార్చర్ పెట్టి ఏదో ఒక విధంగా రౌడీని తీసుకుని వెళ్లాలని ఇలా చేస్తున్నాడని అంటాడు.
నరసింహకు దొరికేసిన ఎవిడెన్స్
దీప నడుస్తూ పడబోతుంటే కార్తీక్ పట్టుకుంటాడు. సరిగా అది నరసింహ వీడియో తీస్తాడు. ఇలా మీరు సాయం చేస్తూ ఉంటే నేను అప్పులు ఎలా తీర్చాలని దీప అంటే కిచెన్ లో డబ్బా ఉంది కదా అందులో వేయండి డబ్బులు అని చెప్తాడు. ఎవిడెన్స్ దొరికిందని నరసింహ తెగ సంబరపడిపోతాడు.
శౌర్య గతంలో నాన్న గురించి వేసిన బొమ్మ తీసుకుని చూస్తుంది. అందులో ఉన్న నాన్న అని రాసిన దాన్ని చింపేస్తుంది. అది చూసి దీప చాలా బాధపడుతుంది. బూచోడు వస్తాడా? నన్ను తీసుకెళ్ళిపోతాడా? అని శౌర్య భయంగా అడుగుతుంది. రాడని దీప ధైర్యం చెప్తుంది.
కోర్టులో ఏం జరుగుతుందోనని దీప టెన్షన్ పడుతుంది. వాడు ఏం చేసిన సరే నిన్ను ఎవరికి ఇవ్వను నాతోనే ఉంటావు అని దీప అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీకదీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగిసింది.