Baby names: మీకు శ్రీకృష్ణుడంటే ఇష్టమా? మీ పిల్లలకు అతడి అందమైన ఈ పేర్లను పెట్టండి

Best Web Hosting Provider In India 2024

ఇంట్లో బిడ్డ పుట్టిన వెంటనే కుటుంబమంతా ఆనంద పడుతుంది. ఆ బిడ్డకు అందమైన పేరు పెట్టడంతో వారి సందడి మొదలవుతుంది. త్వరలోనే కృష్ణ జన్మాష్టమి రాబోతోంది. శ్రీ కృష్ణుడిని విష్ణువు ఎనిమిదవ అవతారంగా ఆరాధిస్తారు. శ్రీకృష్ణుడు తన అందానికి, ఆకర్షణకు, తెలివితేటలకు పేరు తెచ్చుకున్నాడు. మీరు కృష్ణ భక్తుడైతే … మీ జీవితాంతం మీ పిల్లలకు శ్రీకృష్ణుని ఆశీస్సులు కావాలంటే, అతనికి ఈ అందమైన, ప్రత్యేకమైన శ్రీ కృష్ణుడి పేర్లను పెట్టండి. శ్రీకృష్ణుని పేర్లు ప్రత్యేకమైనవి. ఇవి ఆధునికంగా ఉంటాయి. కాబట్టి ఆలస్యం చేయకుండా, శ్రీ కృష్ణుడు పేర్లను మీ పిల్లల కోసం ఎంపిక చేసుకోండి.

ఇషాన్

ఈ పేరు అతని భక్తులలో చాలా ప్రాచుర్యం పొందింది. ఈ పేరుకు దేవుడు అని అర్థం. మీరు కూడా మీ కుమారుడికి కృష్ణుని పేరు పెట్టాలనుకుంటే, మీరు అతనికి ఇషాన్ అని పేరు పెట్టవచ్చు.

కేశవ్

ఈ పేరు మన దేశంలో చాలా ప్రసిద్ధి చెందింది. కేశవ్ అనే పేరుకు ‘పొడవాటి జుట్టు’ అని అర్థం. శ్రీ కృష్ణుడికి జుట్టు పొడవుగానే ఉంటుంది. ఆ జుట్టును చక్కగా ముడి వేసి నెమలి పింఛాన్ని పెట్టి ఉంటుంది.

గిరిధర్

శ్రీకృష్ణుని భక్తులు ఆయనను గిరిధర్ అని కూడా పిలుస్తారు. ఈ పేరుకు గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణుడు అని అర్థం. మీ అబ్బాయికి ఈ అందమైన పేరును పెట్టవచ్చు.

మురళీధర్

శ్రీకృష్ణుని ఈ పేరు దేశం మొత్తం కనిపిస్తుంది. ఈ పేరుకు అర్థం మురళి ధరించే శ్రీకృష్ణుడు. అతని చేతిలో ఉన్న పిల్లన గ్రోవిని మురళి అంటారు.

కన్హ

తమ పిల్లలపై ఉన్న ప్రేమను వ్యక్తపరచడానికి కన్హా అనే పేరును పెడతారు. తల్లి యశోద శ్రీకృష్ణుడిని ఈ పేరుతోనే పిలిచేదని చెప్పుకుంటారు.

నీలేష్

ఈ పేరుకు అర్థం ‘చంద్రుడు’ . అలాగే శ్రీకృష్ణుడిని కూడా సూచిస్తుంది. నీలం రంగులో ఉన్న శ్రీ కృష్ణుడి నీలేష్ అని పిలుచుకుంటారు.

నిత్యానంద

నిత్యానంద అనే పేరుకు అర్థం ‘ఎల్లప్పుడూ సంతోషంగా’. ఈ పేరును ఇప్పటికే నార్త్ ఇండియాలో ఎంతో మంది పెట్టుకున్నారు.

కేయూర్

శ్రీ కృష్ణుడిని కేయూర్ అని పిలుచుకోవచ్చు. శ్రీకృష్ణుని ఆభరణాలను కేయూర్ అంటారు. ఒక పువ్వు పేరు కూడా కేయూర్.

కహాన్

శ్రీకృష్ణుడిని కహాన్ అనే పేరుతో కూడా పిలుస్తారు. దీని అర్థం తెలివైనతనం. మీ పిల్లల పేరు ‘క’ అక్షరం నుండి పెట్టాల్సి వస్తే, మీరు అతనికి ఈ పేరును ఇవ్వవచ్చు.

కన్నన్

మీరు మీ కుమారుడికి ఆధునిక, ప్రత్యేకమైన పేరు కోసం చూస్తున్నట్లయితే, మీరు కుమారుడికి కన్నన్ అని పేరు పెట్టవచ్చు. కృష్ణుని భక్తులకు కూడా కన్నన్ అని పిలచుకోవచ్చు.

కర్ణిష్

ఈ పేరుకు కరుణ, ప్రేమ కలిగిన దేవువు అని అర్థం. ప్రేమ, దయలో శ్రీ కృష్ణుడు మహాసముద్రమంతటి వాడు. కాబట్టి ఈ పేరును కూడా మీ కుమారుడికి పెట్టవచ్చు.

శోభిత్

మీ అబ్బాయి పేరు ‘శ’ అనే అక్షరం నుంచి పెట్టాల్సి వస్తే, మీరు అతనికి శోభిత్ అని పేరు పెట్టవచ్చు. శోభిత్ అనే పేరుకు అందమైన అని అర్థం. అందమైన శ్రీ కృష్ణుడిని ఈ పేరు సూచిస్తుంది.

WhatsApp channel

టాపిక్

Source / Credits

Best Web Hosting Provider In India 2024