Best Web Hosting Provider In India 2024
Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ నేటి ఎపిసోడ్‌లో నా ఇష్టం గురించి ఎప్పుడు పట్టించుకోలేదని ధాన్యలక్ష్మీతో కల్యాణ్ అంటాడు. తప్పు చేశానని ఒప్పుకుంటున్నాను కదరా. దాన్ని సరిదిద్దుకునేందుకే నా ప్రయత్నం. నా మాట వినరా కొన్నిరోజులు బెంగళూరుకు వెళ్లు అని ధాన్యలక్ష్మీ అంటుంది.
పెళ్లికి వెళ్లను
అమ్మా నువ్ ఎందుకు బెంగళూరు వెళ్లమంటున్నావో నాకు తెలుసు. నువ్ భయపడినట్లు ఏం జరగదు. అప్పు తన తల్లిదండ్రులు చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటుంది. నేను కల్యాణ మండపానికి వెళ్లను అని వెళ్లిపోతాడు కల్యాణ్. అప్పటివరకు చాటుగా ఉండి మాటలు విన్న రుద్రాణి వీడు బెంగళూరు వెళ్లను అన్న కల్యాణ మండపానికి వెళ్లను అని చెప్పాడు. అది చాలు అని అనుకుంటుంది. మరోవైపు అప్పు పెళ్లి ఏర్పాట్లు హడావిడిగా జరుగుతుంటాయి.
అన్ని పనుల గురించి కనకం హడావిడి చేస్తుంది. అంతా సవ్యంగా జరుగుతుంది. ప్రశాంతంగా ఉండు అని కావ్య అంటుంది. అప్పు దగ్గరికి వెళ్తాను అని కనకం వెళ్తుంది. మీ అమ్మ హడావిడి చూస్తుంటే అంబానీ తన కొడుకు పెళ్లి గురించి కూడా ఇంతా చేసి ఉండడు కాదేమో అనిపిస్తుందని కృష్ణమూర్తి అంటాడు. మరోవైపు అప్పును స్వప్న రెడీ చేస్తుంది. ఇంకా రెడీ చేయలేదా అని స్వప్నపై ఫైర్ అవుతుంది కనకం. ఇంకా జడ ఎందుకు వేసుకోలేదని కనకం అంటుంది.
శకుని లేని కురుక్షేత్రం
నాకు ఇష్టం లేదు. పెళ్లి చూపులు అప్పుడు ఇలాగే ఉన్నాకదా. ఎందుకు విసిగిస్తావ్. నేను ఎవరి కోసం మారను అని అప్పు అంటుంది. మీ రుద్రాణి అత్త వస్తుందా అని కనకం అడిగితే.. శకుని లేని కురుక్షేత్రం ఉంటుందా. కచ్చితంగా వస్తుంది అని స్వప్న అంటుంది. కనకం వెళ్లిపోతుంది. తర్వాత కల్యాణ్ తిలకం బ్యాగ్‌లో ఉందని, తీసుకొస్తాను అని స్వప్న కూడా వెళ్లిపోతుంది. అప్పు పెళ్లికి వెళ్లేందుకు దుగ్గిరాల ఇంట్లో అంతా రెడీ అవుతుంటారు.
పెళ్లి జరగదు అనే సంతోషంతోనే కదా వెళ్తున్నాం అని ధాన్యలక్ష్మీ అంటుంది. ఈ సంతోషం వచ్చేటప్పుడు కూడా ఉండాలి. రాజ్ పెళ్లిలో ఏం జరిగిందో తెలుసు కదా. అక్కడుంది కావ్య. నాకన్న ముదురు అని రుద్రాణి అంటుంది. పెళ్లి చూస్తే తప్పా నాకు మనశ్శాంతిగా ఉండదు అని ధాన్యలక్ష్మీ బయటకు వస్తుంది. బయటకు వచ్చిన వాళ్లతో అయిందా మీ గూడుపుటానీ అని అపర్ణ అంటుంది. అక్కడ పెళ్లిలో ఏమైనా దురుసు మాటలు మాట్లాడితే ఊరుకోను అని రుద్రాణికి ఇందిరాదేవి వార్నింగ్ ఇస్తుంది.
బాధపడుతున్నట్లు లేదు
తర్వాత రాజ్‌తోపాటు కల్యాణ్ కూడా కిందకు దిగడంతో రుద్రాణి, ధాన్యలక్ష్మీ కంగారుపడిపోతారు. కల్యాణ్ నువ్ కూడా వస్తున్నావా అని ధాన్యలక్ష్మీ అంటుంది. లేదు. నువ్ భయపడకు. నేను రావట్లేదు అని కల్యాణ్ అంటాడు. అవునులే కనకం వచ్చి మొహం మీదే రావొద్దని చెప్పాకా ఎలా వస్తాడు అని రుద్రాణి అంటుంది. నువ్ తమ్మున్ని అవమానించినందుకు బాధపడుతున్నట్లు లేదు సంతోషిస్తున్నట్లు ఉందని రాజ్ అంటాడు.
లేదు చాలా బాధపడుతున్నాను అని రుద్రాణి అంటే.. నువ్వెంత బాధపడుతున్నావో నాకు తెలుసు అని ఇందిరాదేవి అంటుంది. అంతా వెళ్లిపోతారు. కానీ రాజ్ ఉండి.. ఇక్కడ అంతా ఆ పెళ్లి జరగాలని అనుకుంటున్నారు. కానీ, నేను మాత్రం జరగొద్దని కోరుకుంటున్నాను. మీరు ఇద్దరూ మోసం చేసుకుంటున్నారు. ఈ పెళ్లి ఆపడం నాకు కష్టమేం కాదు. కానీ, దానికి మీ ఇద్దరి అంగీకారం కావాలి. అప్పు మెడలో తాళి కడితే నేను ఏం చేయలేను అని అంటాడు.
ముమైత్ ఖాన్‌లా ఉంటుంది
అందరి గురించి ఆలోచించడం మానేసి నీ ప్రేమను గెలిపించుకోడానికి అక్కడికి వస్తావో. లేదా అప్పులాగే బంధాలకు ఆగిపోతావో నీ ఇష్టం. కానీ, ఏం జరిగినా నీకు నేను అండగా ఉంటాను. నేను అక్కడే ఎదురుచూస్తుంటాను అని రాజ్ కూడా వెళ్లిపోతాడు. రాజ్ వాళ్లు రావడంతో బంటి వెళ్లి అక్క మీ అత్తవాళ్లందరూ వచ్చారు అని చెబుతాడు. మా అత్త కూడా వచ్చిందా అని స్వప్న అడిగితే.. హా వచ్చింది. ముమైత్ ఖాన్‌లా ఉంటుంది. ఆవిడే కదా అని బంటి అంటాడు.
ఛీ నోర్‌మూయి అని కృష్ణమూర్తి వారిస్తాడు. దుగ్గిరాల వాళ్లను కనకం వాళ్లు ఆహ్వానిస్తారు. మీరు రావడం మండపానికే కళ వచ్చిందని కనకం అంటే.. మండపం ఎక్కడుంది. గొప్పలకు పోకుండా మీ స్థాయికి తగినట్లు చేస్తున్నారు. గుడి షెడ్‌లో చేస్తున్నారా అని రుద్రాణి అంటుంది. దేవుడు సన్నిధానం కంటే గొప్ప స్థలం ఉంటుందా అని ఇందిరాదేవి అంటుంది.
గౌరవం కాపాడాలి
స్థాయి గురించి మా అత్తే మాట్లాడాలి. వాళ్లకు ఉండేందుకు చోటు లేకే తాతయ్య ఇంట్లో ఉంటున్నారు. మాకు కనీసం చిన్న ఇల్లు అయినా ఉంది. మీకు అది కూడా లేదు కదా అని స్వప్న ఇచ్చిపడేస్తుంది. చూశావా అమ్మా ఎలా అంటుందో అని రుద్రాణి అంటుంది. నీకు స్వప్నే కరెక్ట్ మొగుడు. నా ఫుల్ సపోర్ట్ నీకే స్వప్న అని అపర్ణ అంటుంది. స్వప్న అలా అనకూడదు. అత్తింటి వాళ్ల గౌరవం కాపాడాలి అని కృష్ణమూర్తి అంటాడు.
రుద్రాణి గారు మిమ్మల్ని తప్పు బట్టాలని కాదు. పెళ్లి ఏర్పాట్లలో ఆరంబడాలు ఉండొచ్చు కానీ మంత్రాలలో ఉండవు. ఎక్కడ జరిగినా పెళ్లే. కొంతమంది అప్పులు చేసి పెళ్లి జరిపిస్తుంటారు. ఏవైనా లోటుపాట్లు జరిగితే వారిని విమర్శించకూడదు. భోజనాలు బాగాలేకపోయినా బాగున్నాయని చెప్పి వెళ్లాలి. అప్పుడే మన గొప్పతనం. సంస్కారం బయటపడుతుంది అని కావ్య చెబుతుంది. చిన్నదానివైనా బాగా అనుభవం ఉన్నదానిలా బాగా చెప్పావ్ అని ఇందిరాదేవి అంటుంది.
ఏడుస్తున్న అప్పు
ఇన్ని తెలిసినదానివి పెళ్లి చేసుకునే అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకుని పెళ్లి చేయాలని తెలియదా అని రాజ్ అంటాడు. మన పెళ్లి మాత్రం ఇష్టంతో జరిగిందా. పెళ్లి తర్వాత అన్నీ మారిపోతాయ్. ఇప్పుడు నాకు ఏం తక్కువ అయింది. దుగ్గిరాల ఇంటి పెద్ద కోడలిగా ఉన్నాను. అది నాకు చాలు అని కావ్య అంటుంది. అవును పెళ్లి తర్వాత అందరి అభిప్రాయాలు మారిపోతాయి అని అపర్ణ అంటుంది. మరోవైపు కల్యాణ్ ఫొటోలు చూస్తూ డిలీట్ చేస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది స్వప్న.
అది చూసిన స్వప్న నిలదీస్తుంది. కల్యాణ్ నీ ఫ్రెండ్ అయినప్పుడు ఎందుకు ఫొటోలు డిలీట్ చేస్తున్నావ్. ఎందుకు బాధపడుతున్నావ్. ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా. ఇష్టం లేకుండా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావ్. అమ్మనాన్నల కోసమా అని గట్టిగా అడుగుతుంది స్వప్న. అక్క ఇప్పుడు ఇవన్ని ఎందుకు మాట్లాడుతున్నావ్. నాకు పెళ్లి ఇష్టం లేదని నీకు చెప్పానా అని అప్పు అంటుంది. నీ కోపం వెనుక కల్యాణ్ మీద ప్రేమ ఉంది. అది దూరం అవుతుందన్న బాధ ఉందని స్వప్న అంటుంది.
నాకైనా చెప్పి ఉండొచ్చు కదా
రెండు గంటలు కళ్లు మూసుకుంటే అంతా వెళ్లిపోతారు అనుకుంటున్నావేమో. కానీ, జీవితాంతం ఈ బంధాన్ని మోయాలి. ఎవరు ఏం అనుకుంటే మనకేంటే. మన ఆనందమే ముఖ్యం. అదే జీవితం. నీకు కల్యాణ్ ఇష్టముంటే ధైర్యం చేసి పెళ్లి చేసుకో. లేకుంటే నాలాగా పారిపో. అక్కయ్య ఇలా ఐడియా ఇస్తుందేంటీ అనుకోకు. నాకు తెలిసిన నీతి ఇదే. ఇక్కడిదాకా ఎందుకు రానిచ్చావే. నాకైనా చెప్పి ఉండొచ్చు కదా. నువ్ ఇప్పటికీ కల్యాణ్‌ను ప్రేమిస్తున్నట్లు కల్యాణ్‌కు తెలుసా అని స్పప్న అడుగుతుంది. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.
బ్రహ్మముడి తర్వాతి ఎపిసోడ్‌లో స్వప్న కాల్ చేసి కల్యాణ్‌కు జరిగింది చెబుతుంది. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించి అప్పును నన్ను బాధపెట్టుకుని ఇలా ఆగిపోవడం వల్ల మా ఇద్దరికి నష్టమే జరుగుతుంది. ఎలాగోలా ఆ పెళ్లి ఆపేసి నా మనసులో మాట అప్పుకు చెప్పేసి తనను ఒప్పించి తీసుకురావాలి అని కల్యాణ్ అనుకుంటాడు. మరోవైపు నీ పంతం మార్చుకోవా అని కావ్యను రాజ్ అడుగుతాడు. నేను ఈ పెళ్లి ఆపుతాను అని రాజ్ అంటే.. నేను మిమ్మల్ని ఆపుతాను అని కావ్య అంటుంది. చూసుకుందాం అని ఒకరినొకరు ఛాలెంజ్ చేసుకుంటారు.