OTT Movies Friday: ఓటీటీలో ఇవాళ ఒక్కరోజే 4 స్ట్రీమింగ్- 2 మాత్రమే స్పెషల్- రాజమౌళి సిరీస్‌తోపాటు ఫాంటసీ మూవీ- ఎక్కడంటే?

Best Web Hosting Provider In India 2024

Today OTT Releases: ప్రతి వారం ఓటీటీలోకి కుప్పలుతెప్పలుగా సినిమాలు వచ్చి పడుతుంటాయని తెలిసిందే. అయితే వీటిలో కూడా అత్యధికంగా శుక్రవారం రోజునే సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతుంటాయి. కానీ, ఈ వారం మాత్రం అధికంగా గురువారం నాడు ఓటీటీలోకి స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

ఇవాళ ఓటీటీలోకి 5

ఈ వారంలో మొత్తంగా 23కుపైగా సినిమాలు విడుదల కాగా.. వాటిలో గురువారం నాడు 12 ఓటీటీలో డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చి సందడి చేశాయి. ఇక ఎప్పుడు అధికంగా ఓటీటీ రిలీజ్ అయ్యే శుక్రవారం నాడు అంటే నేడు (ఆగస్ట్ 2) నాలుగు మాత్రమే విడుదల అయ్యాయి. వాటిలో కూడా కేవలం రెండు మాత్రమే స్పెషల్‌గా ఉన్నాయి. ఈ రెండింటితోపాటు మిగతావి కూడా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయో చూద్దాం.

నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ

మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి (తెలుగు డాక్యుమెంటరీ)- ఆగస్ట్ 2

సేవింగ్ బికినీ బాటమ్ (ఇంగ్లీష్ చిత్రం)- ఆగస్ట్ 2

జో రోగన్ (ఇంగ్లీష్ కామెడీ ఈవెంట్)- ఆగస్ట్ 3

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్-బుక్ మై షో

కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ (తెలుగు డబ్బింగ్ హాలీవుడ్ మూవీ)- డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ- ఆగస్ట్ 2

ది బైక్ రైడర్స్ (ఇంగ్లీష్ చిత్రం)- బుక్ మై షో ఓటీటీ- ఆగస్ట్ 2

జియో సినిమా ఓటీటీ

టరోట్ (ఇంగ్లీష్ మూవీ)- ఆగస్ట్ 3

దస్ జూన్ కీ రాత్ (హిందీ వెబ్ సిరీస్)- ఆగస్ట్ 4

రాజమౌళి డాక్యుమెంటరీ

ఇలా ఇవాళ (ఆగస్ట్ 2) ఓటీటీలోకి వెబ్ సిరీసులు, సినిమాలు కలిపి మొత్తంగా 4 మాత్రమే డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. వీటిలో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోన్న దర్శక దిగ్గజం రాజమౌళికి సంబంధించిన డాక్యుమెంటరీ వెబ్ సిరీస్ మోడ్రన్ మాస్టర్స్: ఎస్ఎస్ రాజమౌళి చాలా స్పెషల్‌గా ఉంది. ఈ డాక్యుమెంటరీ తెలుగు భాషతోపాటు ఇతర భాషల్లో అందుబాటులోకి వచ్చింది.

సైన్స్ ఫిక్షన్ మూవీ

దీంతోపాటు హాలీవుడ్‌లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఫాంటసీ యాక్షన్ మూవీ కింగ్‌డమ్ ఆఫ్ ది ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ కూడా మరింత ఇంట్రెస్టింగ్ సినిమా కానుంది. యాక్షన్ అండ్ సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరక్కిన ఈ సినిమా మే 9న థియేటర్లలో విడుదలై భారీ కలెక్షన్స్ కొల్లగొట్టింది. ప్లానెట్ ఆఫ్ ది ఏప్స్ అనే ట్రయాలజీ నుంచి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 398.5 మిలియన్ డాలర్స్ రాబట్టింది.

సోనీ లివ్ సర్‌ప్రైజ్

ఇదిలా ఉంటే, సౌత్ స్టార్ హీరోయిన్ త్రిష తొలిసారిగా నటించిన వెబ్ సిరీస్ బృందా. క్రైమ్ అండ్ ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ బృందా వెబ్ సిరీస్ ఆగస్ట్ 2న ఓటీటీ స్ట్రీమింగ్ కావాల్సింది. కానీ, ఓటీటీ ఆడియెన్స్‌కు సోనీ లివ్ డిజిటల్ ప్లాట్‌ఫామ్ సర్‌ప్రైజ్ ఇస్తూ ఆగస్ట్ 1నే రాత్రి 9 గంటల సమయంలో బృందా డిజిటల్ ప్రీమియర్ చేశారు.

ఈ బృందా సిరీస్ తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, మరాఠీ, బెంగాళీ భాషల్లో సుమారు 45 నుంచి 50 నిమిషాల నిడివితో 8 ఎపిసోడ్స్‌తో అందుబాటులో ఉంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024