Best Web Hosting Provider In India 2024
Darling OTT: ప్రియదర్శి, నభానటేష్ జంటగా నటించిన డార్లింగ్ మూవీ థియేటర్లలో రిలీజై నెల రోజులు కాకముందే ఓటీటీలోకి వస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఆగస్ట్ 13 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. డార్లింగ్ ఓటీటీ రిలీజ్ డేట్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ శుక్రవారం అనౌన్స్ చేసింది.
మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్…
జూలై 19న డార్లింగ్ మూవీ థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాతో అశ్విన్ రామ్ డైరెక్టర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ అనే సమస్యకు వినోదాన్ని జోడించి దర్శకుడు ఈ మూవీని తెరకెక్కించాడు. తాను అనుకున్న కథను కన్ఫ్యూజన్ లేకుండా చెప్పడంలో దర్శకుడు తడబడటంతో డార్లింగ్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. డార్లింగ్ మూవీలో అనన్య నాగళ్ల గెస్ట్ రోల్‌లో కనిపించింది. బ్రహ్మానందం, రఘుబాబు, మురళీధర్ గౌడ్ కీలక పాత్రల్లో కనిపించారు.
రాఘవ పెళ్లి కష్టాలు…
రాఘవ (ప్రియదర్శి) ఓ ట్రావెల్ కంపెనీలో పనిచేస్తుంటాడు. అందమైన అమ్మాయిని పెళ్లిచేసుకొని భార్యతో కలిసి పారిస్‌కు హనీమూన్ వెళ్లాలన్నది రాఘవ కల. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసిన రాఘవకు పెళ్లవ్వదు. చివరకు చైల్డ్‌వుడ్ ఫ్రెండ్ నందినితో (అనన్య నాగళ్ల) రాఘవ పెళ్లిని పెద్దలు ఫిక్స్ చేస్తారు మరికొద్ది క్షణాల్లో పెళ్లి జరగాల్సిఉండగా రాఘవను కాదని తను ప్రేమించిన అబ్బాయితో నందిని వెళ్లిపోతుంది.
పీటల వరకు వచ్చిన పెళ్లి ఆగిపోవడంతో అవమానం తట్టుకోలేక రాఘవ సూసైడ్ చేసుకోవాలని అనుకుంటాడు. రాఘవ ఆత్మహత్య చేసుకోకుండా ఆనంది (నభానటేష్)అతడిని కాపాడుతుంది. ఆనంది గతం గురించి ఏం తెలియకుండానే పరిచయమైన కొద్ది గంటల్లోనే ఆమెను పెళ్లిచేసుకుంటాడు రాఘవ.
ఫస్ట్ నైట్ రోజే భార్యకు మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ సమస్య ఉందనే నిజం రాఘవకు తెలుస్తుంది. ఆనంది ఒక్కరు కాదని, ఆమెలో ఐదుగురు దాగిఉన్నారని అర్థమవుతుంది. ఆనందికి ఉన్న ఆ ఐదుగురు ఎవరు? భార్యకు ఉన్న మల్టీపుల్ పర్సనాలిటీ డిజార్డర్ కారణంగా రాఘవ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు? ప్రియా (నభానటేష్)కు ఆనందికి ఉన్న సంబంధం ఏంటి? అన్నదే డార్లింగ్ మూవీ కథ.
రెండేళ్ల తర్వాత రీఎంట్రీ…
డార్లింగ్ మూవీతో దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత నభానటేష్ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. ఆనంది పాత్రకు న్యాయం చేసేందుకు నభా నటేష్ చాలా కష్టపడింది. దర్శకుడి రాసుకున్న కథలో క్లారిటీ లేకపోవడంతో ఆమె కష్టం వృథాగా మారింది. డార్లింగ్ మూవీని హనుమాన్ ప్రొడ్యూసర్స్‌నిరంజన్‌రెడ్డి, చైతన్య రెడ్డి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశారు.
డార్లింగ్ తర్వాత తెలుగులో నిఖిల్ స్వయంభూలో హీరోయిన్‌గా నటిస్తోంది నభానటేష్. హిస్టారికల్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ నిఖిల్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా రూపొందుతోంది.
టాపిక్