Best Web Hosting Provider In India 2024
02 Aug 2024 1:23 PM
కర్నూలు: టీడీపీ ఎత్తుల్ని చిత్తుచేస్తూ.. వైయస్ఆర్సీపీ ఘన విజయం సాధించింది. కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 5 స్థానాలకు గాను అన్నింటిలో వైయస్ఆర్సీపీ అభ్యర్థులు విజయం సాధించి క్లిన్‌స్వీప్ చేశారు. టీడీపీ ప్రలోభాలు పెడుతూ బెదిరించినా తలొగ్గకుండా నిజాయతీ చాటిన వైయస్ఆర్సీపీ అభ్యర్థులు. ఓటుకి నోటు ఇవ్వబోయిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు మున్సిపల్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల తీర్పు చెంపపెట్టు లాంటిది. గొప్ప విజయం అనంతరం ఎస్వీ కాంప్లెక్స్ వద్ద మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి మేయర్ బీవై రామయ్య, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, పార్టీ కార్పొరేటర్లు, నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.