Rashmika Mandanna: విజయ్ దేరవకొండ VD12 ఫస్ట్ లుక్ రిలీజ్- రష్మిక మందన్నా రియాక్షన్ ఇదే!

Best Web Hosting Provider In India 2024

Vijay Deverakonda VD12 First Look Released: అభిమానులు రౌడీ అని అభిమానంతో పిలుచుకొనే విజయ్ దేవరకొండ తన అద్భుతమైన నటనా నైపుణ్యంతో స్టార్‌గా ఎదిగాడు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులకు చేరువయ్యారు. విజయ్ దేవరకొండ సినిమా వస్తుందంటే దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టి ఉంటుంది.

అలాంటి విజయ్, ‘మళ్లీరావా’, ‘జెర్సీ’ చిత్రాలతో ఆకట్టుకున్న దర్శకుడు, జాతీయ అవార్డు విజేత గౌతమ్ తిన్ననూరితో చేతులు కలిపారు. ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రంతో అందరినీ థ్రిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ‘VD12’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోందన్న విషయం తెలిసిందే.

విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి కలయికలో వస్తున్న మొదటి సినిమా కావడంతో ‘VD12‘పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని అద్భుతంగా మలుస్తున్నారు మేకర్స్. థియేటర్లలో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించడమే లక్ష్యంగా, ఎక్కడా రాజీ పడకుండా ఎంతో శ్రద్ధతో, అవిశ్రాంతంగా పని చేస్తోంది చిత్ర బృందం.

ఇటీవల ఈ సినిమా చిత్రీకరణ శ్రీలంకలోని సుందరమైన ప్రదేశాల్లో జరిగింది. ఇప్పటిదాకా 60 శాతం చిత్రీకరణ పూర్తయింది. ఈ క్రమంలో తాజాగా వీడీ 12 మూవీ విడుదల తేదీని ప్రకటించారు నిర్మాతలు. 2025 మార్చి 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో వీడీ 12ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ అనౌన్స్‌మెంట్‌తోపాటు విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్‌ను సైతం రిలీజ్ చేశారు.

వీడీ12లోని విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ చాలా టెర్రిఫిక్‌గా ఇంటెన్సివ్‌గా ఉంది. వర్షంలో తడిసిన రక్తంతో విజయ్ దేవరకొండ అరుస్తూ కనిపించాడు. విజయ్ మాస్ లుక్ ఇందిలో అదిరిపోయింది. వీడీ 12 మూవీ రక్తంతో తడిసిన కథగా తెలుస్తోంది. ఈ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేస్తూ “అతనికోసం విధి ఎదురుచూస్తోంది.. తప్పులు, రక్తపాతం, ప్రశ్నలు, పునర్జన్మ” అని నోట్ రాసుకొచ్చారు మేకర్స్.

ఈ ఫస్ట్ లుక్, ఆ క్యాప్షన్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా ఉన్నాయి. కాగా ఈ పోస్టర్ సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అయింది. ఈ ఫస్ట్ లుక్‌పై నేషనల్ క్రష్ రష్మిక మందన్నా రియాక్ట్ అవుతూ ట్వీట్ కూడా చేసింది. ఈ వీడీ 12 ఫస్ట్ లుక్‌‌ను షేర్ చేసిన రష్మిక మందన్నా “మ్యాడ్‌నెస్” అని రాసుకొస్తూ ఫైర్ ఎమోజీ యాడ్ చేసింది. దీంతో ఈ వీడీ12 ఫస్ట్ లుక్‌పై అందరి అటెన్షన్ పడింది.

ఇదే కాకుండా వీడీ 12 సినిమాకు సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్‌ను ఈ ఆగస్టులోనే ఆవిష్కరించనున్నట్లు మేకర్స్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే, సంచలన స్వరకర్త, రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ప్రముఖ ఛాయగ్రాహకులు గిరీష్ గంగాధరన్, జోమోన్ టి జాన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తుండగా, జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. అలాగే శ్రీకర స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పిస్తోంది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024