Best Web Hosting Provider In India 2024
Monsoon Food: వర్షాకాలం వచ్చేసింది. ఈ కాలానికి తగ్గట్టు ఆహార పదార్థాలు తినడం కూడా చాలా ముఖ్యం. ఇప్పుడు ఎండు బాదం పప్పులునే కాదు ఆకుపచ్చ బాదంపప్పు కూడా తినాల్సిన అవసరం ఉంది. వానాకాలంలో ఆకుపచ్చని బాదం పప్పులు తినడం వల్ల ఈ కాలానికి అవసరమైన పోషకాలు శరీరానికి అందుతాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. బాదంపప్పులు పక్వానికి రాకముందే చెట్టు నుండి తెంపుతారు. అవే పచ్చి బాదం పప్పులు. వీటిలో విటమిన్ ఇ, విటమిన్ సి, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఇతర అవసరమైన పోషకాలు ఉంటాయి. ఇవి తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగ్గా జరుగుతుంది.
పచ్చి బాదం పప్పులు ఎందుకు తినాలి?
పచ్చి బాదం పప్పులను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల విటమిన్ ఈ పుష్కలంగా అంటుంది. ఇది ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అని అందరికీ తెలిసిందే. ఇది చర్మ కణాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. రోగనిరోధక శక్తిని పెరుగుతుంది. చర్మ ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి కూడా ఇందులో అధికంగా ఉంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. దీనిలో మోనోసాచురేటెడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి గుండెను కాపాడుతాయి. అలాగే డైటరీ ఫైబర్ ఎక్కువే. ఇది జీర్ణ క్రియలో సహాయపడతాయి. పేగు ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. ఆరోగ్యకరమైన రక్తపోటు, కండరాల పనితీరుకు అవసరమైన మెగ్నీషియం, పొటాషియం వంటివి ఇందులో అధికంగా ఉంటాయి.
వానాకాలంలో పచ్చి బాదం పప్పులు తినడం వల్ల కడుపు ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థను ఇది ప్రోత్సహిస్తుంది. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన ప్రకారం ఇందులోని డైటరీ ఫైబర్.. పొట్టలోని మంచి బ్యాక్టీరియాను కాపాడుతుంది. ఇది మొత్తం జీర్ణ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చర్మానికి రక్షణ
వర్షాకాలంలో తేమతో కూడిన వాతావరణం ఉంటుంది. ఇది ఇన్ఫెక్షన్లను, మొటిమలను చర్మంపై త్వరగా కలిగిస్తుంది. కాబట్టి పచ్చి బాదం పప్పులు తినడం వల్ల యాంటీ ఆక్సిడెంట్లు… ఆక్సీకరణ ఒత్తిడిని తట్టుకునేలా చేస్తాయి. ఇవి చర్మాన్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ ఈ… అతినీలలోహిత కిరణాల నుండి జరిగిన నష్టాన్ని నివారిస్తుంది.
వర్షాకాలంలో వాతావరణం చల్లబడడం వల్ల ఎక్కువమంది వాకింగ్ వంటి వాటికి వెళ్ళరు. ఇంట్లో ఎక్కువ సేపు కూర్చుని ఉండడానికి ఇష్టపడతారు. దీనివల్ల గుండె సంబంధ వ్యాధులు తిరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆకుపచ్చ బాదంపప్పులు తినడం వల్ల ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తప్పించి గుండెజబ్బుల ప్రమాదాన్ని పెరగకుండా అడ్డుకుంటాయి.
ఆకుపచ్చని బాదం తినడం వల్ల శక్తి స్థాయిలు సమంగా ఉంటాయి. మెగ్నీషియం, పొటాషియం కలిసి… ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ ను కాపాడుతూ ఉంటాయి. కండరాల నిర్మాణంలో కూడా కీలకపాత్ర పోషిస్తాయి. కాబట్టి ఎక్కడైనా మీకు పచ్చి బాదం పప్పులు కనిపిస్తే కచ్చితంగా కొని తినండి.