Allu Sirish: అలాంటి వాళ్లను మార్చలేం, ఇలా ప్రూవ్ చేయలేం.. అల్లు శిరీష్ షాకింగ్ కామెంట్స్

Best Web Hosting Provider In India 2024

Allu Sirish About Buddy Movie: అల్లు శిరీష్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “బడ్డీ”. గాయత్రి భరద్వాజ్, ప్రిషా రాజేశ్ సింగ్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాను స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా, అధన జ్ఞానవేల్ రాజా నిర్మించారు. శామ్ ఆంటోన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 2న విడుదలైంది. ఈ సందర్భంగా ఇంటర్వ్యూలో చిత్ర విశేషాలను తెలిపాడు హీరో అల్లు శిరీష్.

– “బడ్డీ” మూవీని లాస్ట్ ఇయర్ మార్చిలో మొదలుపెట్టి జూలైలో సినిమా కంప్లీట్ చేశాం. డిసెంబర్‌లోనే రిలీజ్‌కు తీసుకురావాలని అనుకున్నాం. నా మూవీస్‌కు గ్యాప్ వస్తోంది. ఫాస్ట్‌గా చేసి డిసెంబర్ 31 సక్సెస్ పార్టీ చేసుకోవాలని నేనూ నిర్మాత జ్ఞానవేల్ గారూ అనుకున్నాం.

– అయితే ఈ సినిమాలో 3 వేలకు పైగా సీజీ షాట్స్ ఉన్నాయి. బడ్డీ ఫేస్‌ను యానిమేట్ చేయాలి. వాటిని పర్పెక్ట్‌గా చేయాలంటే డబ్బుతో పాటు ఆర్టిస్టులకు టైమ్ ఇవ్వాలి. దాంతో లేట్ అయ్యింది. సమ్మర్ అనుకున్నది ఆగస్టుకు పోస్ట్ పోన్ అయ్యింది. బొమ్మకు ప్రాణం వస్తే ఎలా ఉంటుందనే కీ పాయింట్ మీదే సినిమా ఉంటుంది కాబట్టి ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌కు తగ్గకుండా సీజీ వచ్చింది.

– డైరెక్టర్ శామ్ ఆంటోనీ ఈ కథతో నా దగ్గరకు వచ్చి టెడ్డీ బేర్ పాయింట్‌తో ఉంటుందని చెప్పారు. టెడ్డీ మూవీ తమిళంలో వచ్చింది. అలాగే ఇంగ్లీష్‌లోనూ ఇలాంటి సినిమా ఉందని చెప్పాను. మీరు కథ వినండి మీకు కొత్తగా అనిపిస్తుంది. స్టోరీ విన్నాక మళ్లీ ఓటీటీలో టెడ్డీ మూవీ చూడండి అన్నారు శామ్ ఆంటోనీ. అలా కథ విన్నాను.

-టెడ్డీ బేర్‌కు ప్రాణం రావడం అనే ఒక్క పాయింట్‌ను మాత్రమే దర్శకుడు టెడ్డీ సినిమా నుంచి తీసుకున్నాడు. మిగతాదంతా కొత్త కథ. హీరోయిన్‌కు విలన్‌కు ఉండే కాన్‌ఫ్లిక్ట్, హీరో క్యారెక్టరైజేషన్, కథకు ఇచ్చిన జస్టిఫికేషన్స్ అన్నీ బాగా స్క్రిప్టింగ్ చేశాడు. బడ్డీ కథ వింటునప్పుడు కొత్తగా అనిపించింది. నేనూ రోజు కథలు వింటా.. ఒక వెరైటీ పాయింట్ ఏ కథలో దొరుకుతుందా అని వెతుకుతుంటా. ఆ కొత్తదనం బడ్డీ కథలో ఫీల్ అయ్యా. నేను ఫస్ట్ టైమ్ పైలట్‌గా కనిపించబోతున్నా. నా క్యారెక్టర్ ఇంటెన్స్‌గా ఉంటుంది.

– బడ్డీ పోస్టర్ రిలీజ్ నుంచి ఇది రీమేక్ కదా అని కామెంట్స్ వచ్చాయి. కాదు స్ట్రైట్ ఫిల్మ్ అని చెప్పడమే మాకు పెద్ద సవాల్‌గా మారింది. ఎంత చెప్పినా ఇది రీమేక్ అనే కామెంట్స్ రాసేవారు. అలాంటి వాళ్లను మనం మార్చలేం, వారికి మొత్తం సినిమా చూపెట్టి ప్రూవ్ చేయలేం కదా. సినిమా రిలీజ్ అయ్యాక వాళ్లకే తెలుస్తుంది. బడ్డీ స్ట్రైట్ ఫిలిం అని. బడ్డీ క్లాస్, మాస్ అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది.

ఇదిలా ఉంటే, అడ్వెంచరస్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన బడ్డీ మూవీకి నేహ జ్ఞానవేల్ రాజా కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. బడ్డీ విడుదలకు ముందు జరిగిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో అల్లు శిరీష్ ఈ విషయాలు చెప్పారు.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024