Apollo Hospitals : నలుగురు బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు పునర్జన్మ – అపోలో హాస్పిటల్స్ ఖాతాలో మరో మైలురాయి

Best Web Hosting Provider In India 2024

Apollo Hospitals Hyderabad: అపోలో హాస్పిటల్స్ గ్రూప్ మరో మైలురాయిని సొంతం చేసుకుంది. నలుగురు బ్రెయిన్ స్ట్రోక్ రోగులకు విజయవంతంగా మెకానికల్ థ్రోంబెక్టమీ ప్రొసీజర్ నిర్వహించింది. నలుగురిలో ముగ్గరు 74 ఏళ్ళకి పైగా వయసుగల వారు ఉండడం గమనార్హం.

ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ వైకల్యం, మరణాలకు ప్రధాన కారణం సకాలంలో ఈ లక్షణాలను గుర్తించకపోవటం. ఆకస్మిక తిమ్మిరి లేదా బలహీనత, గందరగోళం, మాట్లాడటంలో ఇబ్బంది , తీవ్రమైన తలనొప్పి వంటివి గుర్థించి చికిత్స తీసుకున్నట్లైతే ఈ ప్రమాదం బారి నుంచి కాపాడుకోవచ్చు.

ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్ట్ డాక్టర్ సురేష్ గిరగాని, న్యూరాలజిస్టులు డాక్టర్ సుధీర్, డాక్టర్ రాజేష్ రెడ్డి, డాక్టర్ సందీప్ నాయని, డాక్టర్ యశ్వంత్తో పాటు ఎమర్జెన్సీ ఫిజిషియన్లు, న్యూరో అనస్థీషియన్లు , స్పెషలైజ్డ్ నర్సింగ్ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందం ఈ ఆపరేషన్లలో పాల్గొంది. 24 గంటలు నిర్విరామంగా శ్రమించి నలుగురు రోగులకు విజయవంతగా ప్రొసీజర్ లను నిర్వహించారు.

గతంలో బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స 4.5 గంటలలోపు tPA(Tissue plasminogen activator)ని ఉపయోగించటానికి పరిమితమై ఉండేది. పెద్ద నాళాల మూసివేత ఉన్న రోగులలో కేవలం 30-40% మందిలో మాత్రమే సత్ఫాలితాలు కనిపించేవి . ప్రస్తుతం మెకానికల్ థ్రోంబెక్టమీ అనేది నిర్దిష్ట రోగులలో బ్రెయిన్ స్ట్రోక్ ప్రారంభమైన 24 గంటల వరకు నిర్వహించబడుతుంద. పెద్ద గడ్డలను యాంత్రికంగా తొలగించడంలో ఉత్తమమైనదిగా పేరొందింది. రక్త ప్రసరణ పునరుద్ధరణను కూడా గణనీయంగా మెరుగుపరుస్తుంది.

మెకానికల్ థ్రోంబెక్టమీని… బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్లలో లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ గా పరిగణిస్తారు. దీని ద్వారా మెదడులో గడ్డ కట్టిన రక్తం గడ్డలను తొలగిస్తారు. ఇది 24 గంటలలోపు చేసినట్లయితే రోగి తిరిగి పూర్తిగా కోలుకునే అవకాశాలు చాలా అధికంగా ఉంటాయని డాక్టర్ సురేష్ గిర్గాని తెలిపారు.

మెకానికల్ థ్రోంబెక్టమీ ప్రొసీజర్ లో కాథెటర్ను మెదడులోని నిరోధించబడిన ధమని వరకు ప్రవేశపెడుతారు. స్టెంట్ రిట్రీవర్స్ లేదా ఆస్పిరేషన్ డివైజ్ల వంటి ప్రత్యేక పరికరాలు క్లాట్ను క్యాప్చర్ చేయడానికి మరియు తొలగించడానికి ఉపయోగించబడతాయి. ఈ ప్రక్రియ సాధారణంగా ఇంటర్వెన్షనల్ న్యూరో రేడియాలజిస్ట్ లు మాత్రమే నిర్వహిచగలుగుతారు అని డాక్టర్ సురేష్ గిరగాని వివరించారు.

WhatsApp channel

టాపిక్

HealthHyderabad
Source / Credits

Best Web Hosting Provider In India 2024