Kalki 2898 AD OTT Release Date: ఓటీటీలోకి అనుకున్నదాని కంటే ముందుగానే కల్కి 2898 ఏడీ.. స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?

Best Web Hosting Provider In India 2024


Kalki 2898 AD OTT Release Date: ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో వచ్చి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన కల్కి 2898 ఏడీ మూవీ ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. సెప్టెంబర్ లోగానీ ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ ఉండబోదని మొదట్లో భావించారు. థియేటర్ రిలీజ్ తర్వాత పది వారాలకే మూవీని ఓటీటీలోకి తీసుకురావాలన్న ఒప్పందం ఉంది. అయితే తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ఈ నెలలోనే మూవీ రానున్నట్లు సమాచారం.

కల్కి 2898 ఏడీ ఓటీటీ రిలీజ్ డేట్

కల్కి 2898 ఏడీ మూవీ రెండు ఓటీటీల్లోకి రానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రానుండగా.. హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్ లో అడుగుపెట్టనుంది. అయితే ప్రైమ్ వీడియో ఈ సినిమాను ఆగస్ట్ 23 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా వస్తున్న రిపోర్టులు వెల్లడించాయి. నాలుగు భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.

జూన్ 27న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ రన్ దాదాపు పూర్తయిందని చెప్పొచ్చు. ఇప్పటికీ హిందీ మార్కెట్ లోనే కాస్త మంచి వసూళ్లు వస్తున్నాయి. అయినా కూడా హిందీ వెర్షన్ ను కూడా ఆగస్ట్ 23 నుంచే నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మరో మూడు వారాల్లో ఈ బ్లాక్ బస్టర్ మూవీ డిజిటల్ ప్రీమియర్ ఉండబోతోంది.

రూ.100కే కల్కి 2898 ఏడీ టికెట్

కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కాగా.. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రూ.1100 కోట్లకుపైగా వసూలు చేసింది. ఐదు వారాలు దాటిపోవడంతో ఇప్పుడీ మూవీ మేకర్స్ ప్రేక్షకులకు ఓ బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. కల్కి మూవీ టికెట్లను కేవలం రూ.100కే ఇవ్వనున్నట్లు వైజయంతీ మూవీస్ వెల్లడించింది. ఇదే విషయాన్ని చెబుతూ గురువారం (ఆగస్ట్ 1) ఓ ట్వీట్ చేసింది.

“థ్యాంక్యూ అనేది చాలా చిన్న పదం అవుతుంది. అందుకే ఈ వారం మా తరఫున ఓ చిన్న కానుక. ఇండియా వ్యాప్తంగా ఈ మహా బ్లాక్‌బస్టర్ కల్కి 2898 ఏడీ మూవీని రూ.100కే చూడండి. ఆగస్ట్ 2 నుంచి వారం పాటు ఇదే టికెట్ రేట్లు ఉంటాయి” అని మేకర్స్ చెప్పడం విశేషం. ఐదు వారాలు దాటిన తర్వాత కూడా ఈ సినిమాను థియేటర్లలో మరిన్ని రోజుల పాటు ఇలా తగ్గింపు రేట్లతో నడిపించాలని వాళ్లు భావిస్తున్నారు.

రూ.600 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికే పెద్ద మొత్తంలో లాభాలు వచ్చాయి. బాక్సాఫీస్ దగ్గరే కాకుండా.. డిజిటల్ హక్కుల రూపంలోనూ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స్ నుంచి పెద్ద మొత్తమే మేకర్స్ కు దక్కింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమాకు ఓటీటీలోనూ అదే రెస్పాన్స్ వస్తుందని ఈ రెండు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ఆశతో ఉన్నాయి. ప్రభాస్ కెరీర్లో బాహుబలి 2 తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కల్కి 2898 ఏడీ నిలిచింది.

WhatsApp channel

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024