Best Web Hosting Provider In India 2024
Most Kisses Heroine: ఇండియన్ సినిమాల్లో ఇప్పుడు కాదు కానీ.. ఒకప్పుడు పాకిస్థాన్ నటీనటులు కూడా ఉండేవారు. అందులో వీణా మాలిక్ అనే ఓ హీరోయిన్ కూడా ఉంది. ఆమె బాలీవుడ్ లో బాగానే పేరు సంపాదించింది. నిమిషంలో అత్యధిక కిస్ లు అందుకున్న నటిగా కూడా ఆమెకు పేరుంది. తన న్యూడ్ ఫొటోను పబ్లిష్ చేశారంటూ అప్పట్లో రచ్చ కూడా చేసింది.
వీణా మాలిక్.. కేరాఫ్ వివాదాలు
వీణా మాలిక్ పాకిస్థాన్ నటే అయినా.. అక్కడా ఇక్కడ కూడా నటన కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలిచేది. 2013లో ఆమె సల్మాన్ ఖాన్ పేరిట ఉన్న ఓ రికార్డును కూడా బ్రేక్ చేసింది. ఆ రికార్డు ఏంటో తెలుసా? ఒక నిమిషంలో అత్యధిక కిస్ లు అందుకున్న రికార్డు అది. వీణా మాలిక్ కేవలం నిమిషంలోనే తన చేతిపై 137 కిస్ లు అందుకొని గిన్నిస్ రికార్డు క్రియేట్ చేసింది.
వీణా మాలిక్ రెండేళ్లలోనే 9 ఇండియన్ సినిమాల్లో నటించింది. 2012 నుంచి 2014 మధ్య ఆమె చాలా యాక్టివ్ గా ఉంది. 2010లో బిగ్ బాస్ 4వ సీజన్ ద్వారా ఇండియన్ ప్రేక్షకులకు దగ్గరైన ఈ పాకిస్థానీ నటి.. తర్వాత సినిమా ద్వారానూ పేరు సంపాదించింది. అయితే ఆమె సినిమాల కంటే ఎక్కువగా బయట వివాదాలతోనే పాపులర్ కావడం విశేషం.
న్యూడ్ ఫొటోతో రచ్చ
ఇండియాలోనే కాదు పాకిస్థాన్ లోనూ ఆమె ఓ న్యూడ్ ఫొటోషూట్ తో రచ్చ చేసింది. 2011లో ఎఫ్‌హెచ్ఎం ఇండియా తన కవర్ పేజీపై వీణా మాలిక్ న్యూడ్ ఫొటో వేసింది. అంతేకాదు ఆమె చేతిపై పాక్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐ అక్షరాలను కూడా ముద్రించింది. ఇది తీవ్ర దుమారం రేపింది. ముఖ్యంగా పాకిస్థాన్ లో వీణా మాలిక్ పై విమర్శల వర్షం కురిసింది.
అయితే తాను టాప్‌లెస్ ఫొటో షూట్ చేశాను తప్ప న్యూడ్ ఫొటోషూట్ చేయలేదని ఆమె వివరణ ఇచ్చింది. అంతేకాదు సదరు మ్యాగజైన్ ను కోర్టుకు లాగింది. అయితే ఆ తర్వాత ఈ వివాదం కోర్టు బయటే సెటిలైంది.
వీణాకు 26 ఏళ్ల జైలు
ఈ వివాదాలే కాదు.. వీణా మాలిక్ కు 26 ఏళ్ల జైలు శిక్ష కూడా పడిన విషయం మీకు తెలుసా? అయితే అది ఇండియాలో కాదు. తన సొంత దేశం పాకిస్థాన్ లో కావడం గమనార్హం. 2013లో వీణా వ్యాపారవేత్త అయిన అసద్ బషీర్ ఖాన్ ను పెళ్లి చేసుకుంది. 2018లో వీళ్లు విడిపోయారు. అయితే అంతకుముందు వీళ్లు 2014లో జియో టీవీలో తమ పెళ్లి వీడియోను ప్లే చేశారు.
ఇది దైవ దూషణ కిందికి వస్తుందంటూ గిల్గిట్ కోర్టు ఒకటి ఈ జంటకు ఏకంగా 26 ఏళ్ల జైలు శిక్ష విధించింది. కానీ ఆ శిక్ష ఇప్పటి వరకూ అమలు కాలేదు. గిల్గిట్ బయట ఈ శిక్ష అమలు చేసే అవకాశం లేకపోవడంతో వీణా మాలిక్ స్వేచ్ఛగా తిరుగుతోంది.