Best Web Hosting Provider In India 2024
AP TET 2024 Updates: ఏపీ టెట్ దరఖాస్తుల గడువు ఇవాళ్టి(ఆగస్టు 03)తో పూర్తి కానుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్ లైన్ ఫీజు చెల్లింపుతో పాటు అప్లికేషన్ చేసుకోవచ్చు. గడువు పెంచే ఆలోచన లేదని ఇప్పటికే ఏపీ విద్యాశాఖ స్పష్టం చేసింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. అక్టోబరు 3వ తేదీ నుంచి టెట్ పరీక్షలు మొదలవుతాయి. అర్హత కలిగిన అభ్యర్థులు https://aptet.apcfss.in/# వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చు.
ఇక ఏపీ టెట్ కు సంబంధించిన ఆన్ లైన్ మాక్ టెస్టులు సెప్టెంబర్ 19వ తేదీ నుంచి అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వీటిని ఉచితంగా రాసుకోవచ్చు. ఇక సెప్టెంబర్ 22 నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అక్టోబరు 3వ తేదీన పరీక్షలు ప్రారంభమై…. 20వ తేదీతో ముగుస్తాయి. నవంబరు 2వ తేదీన తుది ఫలితాలు విడుదలవుతాయి.
ఏపీ టెట్ అప్లికేషన్ ప్రాసెస్….!
Step 1 : టెట్ రాసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Step 2 : హోం పేజీలో కనిపించే Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : పేమెంట్ పూర్తి చేసిన సమయంలో జనరేట్ అయిన Candidate IDతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
Step 4 : లాగిన్ పై నొక్కితే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
Step 5 : మీ పూర్తి వివరాలను ఎంటర్ చేయాలి. ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
Step 6 : చివరిగా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి.
ఫీజు ఇలా చెల్లించండి…
Step 1 : టెట్ అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
Step 2 : హోం పేజీలో కనిపించే Payment అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : ఇక్కడ Candidate Name, పుట్టిన తేదీ వివరాలతో పాటు మొబైల్ నెంబర్ ను ఎంట్రీ చేయాలి.
Step 4 : వీటితో పాటు అభ్యర్థి రాసే పేపర్ ను ఎంచుకోవాలి.
Step 5 : ఆధార్ నెంబర్ ను నమోదు చేయాలి.
Step 6 : నిర్ణయించిన ఫీజును చెల్లించిన తర్వాత సబ్మిట్ చేయాలి.
Step 7 : ఫీజు చెల్లింపు ప్రక్రియ తర్వాత పేమెంట్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఈ నెంబర్ ద్వారా దరఖాస్తు ప్రక్రియను చేసుకోవచ్చు.
ఏపీ టెట్ ముఖ్య తేదీలు
ఏపీ టెట్ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ -ఆగస్టు 3, 2024.
ఆన్‌లైన్ అప్లికేషన్లు చివరి తేదీ – ఆగస్టు 3, 2024.
ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు – సెప్టెంబర్ 19 నుంచి
టెట్ హాల్ టికెట్లు – సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం
అక్టోబరు 20వ తేదీతో పరీక్షలు పూర్తి.
ఫైనల్ కీ విడుదల – అక్టోబర్ 27.
టెట్ ఫలితాలు విడుదల – నవంబర్ 2, 2024.
అధికారిక వెబ్ సైట్ – https://aptet.apcfss.in/
టాపిక్