Best Web Hosting Provider In India 2024
Bigg Boss 8: బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో ప్రారంభం కానుంది. ఈ సారి హోస్ట్ మారనున్నట్లు కొన్నాళ్లుగా వార్తలు వినిపించాయి. నాగార్జున స్థానంలో మరో టాలీవుడ్ స్టార్ హోస్ట్‌గా కనిపించబోతున్నట్లు ప్రచారం జరిగింది. ఈ పుకార్లపై ఓ వీడియో ద్వారా బిగ్‌బాస్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. మరోసారి నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రోమోలో నాగార్జునతో పాటు టాలీవుడ్ కమెడియన్ సత్య కనిపించాడు.
జీనీ గెటప్‌లో నాగ్…
పురాతన వస్తువులతో కూడిన ఓ బిల్డింగ్‌లోకి దొంగగా అల్లు అర్జున్ పుష్ప మేనరిజమ్స్‌తో సత్య ఎంట్రీ ఇచ్చినట్లుగా ఈ ప్రోమోలో స్టార్టింగ్‌లో చూపించారు. అక్కడే ఉన్న అద్భుత దీపం కదలడంతో సత్య భయపడటం, ఆ దీపాన్ని ముట్టగానే పొగ రూపంలో ఎనిమిది నంబర్, ఆ తర్వాత ఆ పొగ నుంచి జీనీ గెటప్‌లో నాగార్జున ఎంట్రీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది. మీరు అని సత్య అడగ్గానే…వరలిచ్చే కింగ్ అని నాగార్జున సమాధానమిస్తాడు. ప్రోమో చివరలో ఏం కావాలన్నా ఇస్తారా అని సత్య…అడగ్గా లిమిట్ లెస్‌గా ఇస్తా అని నాగార్జున సమాధానం ఇచ్చాడు. అడిగే ముందు ఒక్కసారి ఆలోచించుకో…ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే లిమిటే లేదు అని నాగార్జున చెప్పిన డైలాగ్ వీడియో ప్రోమోకు హైలైట్‌గా నిలుస్తోంది.
బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్ వీళ్లేనా…
ఈ సారి బిగ్‌బాస్ 8 కంటెస్టెంట్స్‌గా పలువురు సినిమా, టీవీతో పాటు సోషల్ మీడియా సెలబ్రిటీల పేర్లు వినిపిస్తోన్నాయి. ప్రేమ, పెళ్లి వివాదాలతో కొన్నాళ్లుగా వార్తల్లో నిలుస్తోన్న హీరో రాజ్ తరుణ్ బిగ్‌బాస్ హౌజ్‌లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. రాజ్‌తరుణ్‌కు బిగ్‌బాస్ టీమ్ భారీగానే రెమ్యునరేషన్ ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజ్ తరుణ్‌తో పాటు యాంకర్స్ వింధ్య, నిఖిల్ కూడా బిగ్‌బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్స్‌గా పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.
జబర్ధస్త్ నుంచి…
యూట్యూబర్ బంచిక్ బబ్లూ, నటి దీపికా, టీవీ సీరియల్ యాక్టర్ ఇంద్రనీల్, జబర్ధస్థ్ ఆర్టిస్టులు యాదమ్మరాజు, సద్ధాంతో పాటు కిరాక్ ఆర్‌పీ బిగ్‌బాస్‌లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ వేణుస్వామి, యాంకర్ విష్ణుప్రియ బాయ్‌ఫ్రెండ్ శివ, సీనియర్ యాంకర్ సనాతో పాటు బర్రెలక్క, కుమారి ఆంటీ పేర్లు కూడా ప్రచారం జరుగుతోన్నాయి. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు ఫైనల్ అయినట్లు తెలిసింది.
సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో…
బిగ్‌బాస్ సీజన్ యాభై సెప్టెంబర్ ఫస్ట్ వీక్‌లో ఆఫీషియల్‌గా లాంఛ్ కానున్నట్లు సమాచారం. గత సీజన్స్‌కు భిన్నంగా ఈ సారి కొత్త రూల్స్, టాస్క్‌లతో ఈ రియాలిటీ షోను డిజైన్ చేయబోతున్నట్లు సమాచారం. తెలుగు తెలుగు సీజన్ 8 స్టార్ మాతో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతుంది.
కుబేరతో బిజీ…
మరోవైపు ఈ ఏడాది సంక్రాంతికి నా సామిరంగతో విజయాన్ని అందుకున్న నాగార్జున ప్రస్తుతం కుబేర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ధనుష్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీలో నాగార్జున ఓ ఇంపార్టెంట్ రోల్ చేయబోతున్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తోన్నాడు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది.