Tarot OTT: మరో ఓటీటీలోకి వచ్చేసిన సుస్సు పోయించే హారర్ మూవీ.. ఇక్కడ ఫ్రీగా చూసేయండి?

Best Web Hosting Provider In India 2024

Tarot OTT Release: హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ సెపరేట్‌గా ఉంటుంది. భయపడుతూనే ఆ చిత్రాలని వీక్షించాలని అనుకుంటారు. ఇక భయం అనేది మనుషుల్లో ఉండే సాధారణమైన ఎమోషన్. అందుకే ఈ హారర్ జోనర్‌లో వచ్చే సినిమాలకు ఫుల్ క్రేజ్ అండ్ బజ్ ఉంటుంది. సరికొత్త కాన్సెప్ట్‌తో థ్రిల్లింగ్ అండ్ హారిఫిక్ టేకింగ్‌తో మూవీస్ తెరకెక్కిస్తే ఆ బొమ్మ బ్లాక్ బస్టరే.

 

మరో ఓటీటీలోకి

ఈ మధ్య థియేటర్లలో ఆడిన ఆడకున్నా వెంటనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. కొన్నిమాత్రం నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతుంటాయి. అలాగే.. ఇదివరకు ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నప్పటికీ మరికొన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లలో సినిమాలను డిజిటల్ ప్రీమియర్ చేస్తుంటారు. అలా మరో ఓటీటీలోకి వచ్చేసిన హారర్ సినిమానే టారోట్.

11 భాషల్లో స్ట్రీమింగ్

హారర్ అండ్ సూపర్ నాచురల్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన టారోట్‌ సినిమాకు అన్నా హాల్‌బెర్గ్, స్పెన్సర్ కోహెన్ దర్శకత్వం వహించారు. సోనీ పిక్చర్స్ టారోట్ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజ్ చేసింది. మే 3 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో రెంటల్ విధానంలో ఇంగ్లీషు, తెలుగు సహా 11 భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది టారోట్ మూవీ.

బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్

టారోట్ మూవీలో బ్రహ్మోత్సవం చైల్డ్ ఆర్టిస్ట్ అవంతిక వందనపు కీలక పాత్ర పోషించింది. దీంతో ఈ సినిమా ఇండియాలో బజ్ క్రియేట్ చేసుకుంది. అవంతికతోపాటు టారోట్ సినిమాలో మార్వెల్ స్పైడర్ మ్యాన్ సిరీస్ ఫేమ్ యాక్టర్ జాకోబ్ బాటలోన్, లార్సెన్ థాంప్సన్, హారియెట్ స్లేటర్, హంబర్లీ గోంజాలేజ్, అడియన్ బ్రాడ్లీ తదితరులు నటించారు.

 

ఓజా బోర్డ్ తరహాలోనే

టారోట్ అంటే భవిష్యత్ గురించి చెప్పే కార్డ్స్. అచ్చం పేకాట ముక్కల్ల కనిపించే వీటిపై కొన్ని చిత్రాలు ఉంటాయి. వాటి ద్వారా ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవచ్చు. అయితే, ఈ సినిమాలో ఆ టారోట్ కార్డ్స్‌లలో ప్రేతాత్మలు చిత్రాలు ఉంటాయి. ఓజా బోర్డ్ తరహాలోనే టారోట్ కార్డ్స్ ఆడుతారు ఓ స్కూల్‌కు చెందిన పిల్లలు. ఎవరికీ ఏ కార్డ్ వస్తే వారి వెంట్ అందులో ఉన్న ప్రేతాత్మ వెంటపడుతుంటుంది.

భయపెట్టే సీన్స్

దాంతో ఒక్కొక్కరుగా చనిపోతూ ఉంటారు. ఆ పిల్లల గ్యాంగ్‌లో ఒకరి బర్త్ డే సందర్భంగా భయపడుతూనే సరదాగా ఈ గేమ్ ఆడుతారు. సరదాగా ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలనే ఆడే ఈ గేమ్‌తో భవిష్యత్తే లేకుండా అవుతుంది. సుస్సు పోయించేలా ఉండే భయపెట్టే సీన్లతో థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది ఈ సినిమా.

సబ్‌స్క్రిప్షన్ ఉంటే

అలాంటి హారర్ మూవీ టారోట్ ఇప్పుడు మరో ఓటీటీలోకి వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో టారోట్ మూవీ ఇవాళ్టీ (ఆగస్ట్ 3) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్ తరహాలో రూ. 119 చెల్లించి రెంటల్ విధానంలో కాకుండా నెట్‌ఫ్లిక్స్‌లో సబ్‌స్క్రిప్షన్ ఉంటే ఫ్రీగా చూసేయొచ్చు. అయితే నెట్‌ఫ్లిక్స్‌లో మాత్రం టారోట్ మూవీ తెలుగు భాషలో అందుబాటులో లేదు.

 

రెంటల్ ఛార్జెస్ లేకుండా

ఇంగ్లీష్ సబ్ టైటిల్స్‌తో చూడాలనుకునేవారు మాత్రం ఎంచక్కా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఎలాంటి రెంటల్ ఛార్జెస్ లేకుండా ఫ్రీగా టారోట్ మూవీని చూడొచ్చు. అయితే, ఈ సినిమాలో భయపెట్టే సీన్స్ బాగానే ఉన్నాయని రివ్యూలు వచ్చాయి.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024