Best Web Hosting Provider In India 2024
Manu Bhaker: పారిస్ ఒలింపిక్స్‌లో హ్యాట్రిక్ మెడల్ సాధించే అవకాశాన్ని మను భాకర్ తృటిలో కోల్పోయింది. 25 మీటర్ల పిస్టల్ విభాగంలో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. శనివారం జరిగిన ఫైనల్ ఈవెంట్‌లో పతకమే లక్ష్యంగా బరిలో దిగింది మను భాకర్. ఆరంభం నుంచే దూకుడుగాా ఆడింది. మూడో రౌండ్ ముగిసే సరికి 18 హిట్స్‌తో టాప్ 2లో నిలిచి మను భాకర్ సిల్వర్ మెడల్ గెలిచేలా కనిపించింది. సౌత్ కొరియన్ షూటర్ యంగ్…మను భాకర్‌కు గట్టి పోటీ ఇచ్చింది. చివరి రౌండ్‌లో తడబడిన మను భాకర్ 28 హిట్స్‌తో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది.
ఫ్యాన్స్ డిసపాయింట్…
యంగ్ గోల్డ్ మెడల్ గెలవగా…ఫ్రాన్స్‌కు చెందిన కామిలీ సిల్వర్, హంగేరీ షూటర్ వెరోనికా బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నారు. ఈ ఒలింపిక్స్‌లో మూడో మెడల్ గెలిచే గోల్డెన్ ఛాన్స్ ను మను భాకర్ మిస్సవ్వడంతో క్రీడాభిమానులు డిసపాయింట్ అయ్యారు. ఇప్పటికే ఈ ఒలింపిక్స్‌లో మను భాకర్ రెండు కాంస్య పతకాలు సాధించింది. ఉమెన్స్ ఎయిర్ పిస్టల్ పది మీటర ఈవెంట్‌తో పాటు పదీ మీటర్ల మిక్స్‌డ్ ఎయిర్ పిస్టల్ ఈవెంట్స్‌లో సరోబ్ జీత్ తో కలిసి పతకం దక్కించుకున్నది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ గెలిచిన ఫస్ట్ ఇండియన్ అథ్లెట్‌గా నిలిచింది.
మూడు షూటింగ్‌లోనే
పారిస్ ఒలింపిక్స్‌లో ఇండియా ఇప్పటివరకు మూడు పతకాలు గెలవగా…మూడు షూటింగ్‌లోనే రావడం గమనార్హం. బ్యాడ్మింటన్‌లో పతకాలు సాధిస్తారని అనుకున్న పీవీ సింధుతో పాటు డబుల్ ప్లేయర్స్ చిరాగ్ శెట్టి – సాత్విక్ రాజ్ క్వార్టర్స్‌లోనే ఇంటిముఖం పట్టారు. బాక్సింగ్‌లో నిఖత్ జరీన్, ఆర్చరీతో పాటు మరికొన్ని ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు డిసపాయింట్ చేశారు.
నీరజ్ చోప్రా, లక్ష్యసేన్..
జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా, బ్యాడ్మింటన్‌లో లక్ష్యసేన్ మాత్రమే పతకంపై ఆశలు నిలిపారు. లక్ష్యసేన్ సెమీస్‌లో అడుగుపెట్టాడు. ఒలింపిక్స్ సెమీస్‌లో అడుగుపెట్టిన ఫస్ట్ మెన్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. సెమీస్‌లో గత ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ విక్టర్ అక్జెల్‌సెన్‌తో లక్ష్యసేన్ తలపడనున్నాడు.