IBPS RRB Clerk admit card 2024 : ఐబీపీఎస్​ క్లర్క్​ అడ్మిట్​ కార్డు విడుదల- ఇలా డౌన్​లోడ్​ చేసుకోండి..

Best Web Hosting Provider In India 2024


ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్) ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను ఇన్​స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) విడుదల చేసింది. అభ్యర్థులు ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డులను ఇన్​స్టిట్యూట్ వెబ్సైట్ ibps.in నుంచి డౌన్​లోడ్ చేసుకోవచ్చను.

ఆగస్టులో ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది. పరీక్షకు ఖచ్చితమైన తేదీ, సమయాన్ని అడ్మిట్ కార్డులపై పొందుపరుస్తారు.

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ కాల్ లెటర్లు/ అడ్మిట్​ కార్డులను ఆగస్టు 18 వరకు డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఆర్ఆర్బీల కోసం కొనసాగుతున్న రిక్రూట్మెంట్ డ్రైవ్​లో పాల్గొనే బ్యాంకుల్లో మొత్తం 5800 గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయనుంది.

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ అడ్మిట్ కార్డు డౌన్​లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ ప్రిలిమ్స్ అడ్మిట్ కార్డు/కాల్ లెటర్ డౌన్​లోడ్ చేసుకోవడం ఎలా?

  1. ibps.in వెబ్సైట్​లోకి వెళ్లండి.
  2. ఆర్ఆర్బీ క్లర్క్ (గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్) ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్​లోడ్ లింక్ ఓపెన్ చేయండి.
  3. మీ రిజిస్ట్రేషన్ నెంబరు/రోల్ నెంబరు, పాస్ వర్డ్/పుట్టిన తేదీ ఇవ్వండి.
  4. వివరాలు సమర్పించి కాల్ లెటర్ డౌన్​లోడ్ చేసుకోవాలి.

అడ్మిట్ కార్డులతో పాటు అభ్యర్థుల కోసం ఇన్ఫర్మేషన్ డాక్యుమెంట్స్​ కూడా విడుదల చేసింది ఐబీపీఎస్​.

ప్రిలిమినరీ పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. పరీక్ష వ్యవధి 45 నిమిషాలు.

ఇందులో రీజనింగ్ (40 ప్రశ్నలు, 40 మార్కులు), న్యూమరికల్ ఎబిలిటీ (40 ప్రశ్నలు, 40 మార్కులు) అనే రెండు విభాగాలుగా విభజించారు. అభ్యర్థులకు మొదటి విభాగంలో ప్రశ్నలకు సమాధానాలు రాయడానికి 25 నిమిషాలు, రెండో విభాగంలో 20 నిమిషాల సమయం ఉంటుంది.

పరీక్ష రోజున అభ్యర్థులు అడ్మిట్ కార్డు ప్రింటెడ్ కాపీతో పాటు ఫోటో (అప్లికేషన్ ఫామ్​లో ఉపయోగించిన విధంగానే) కాల్ లెటర్​పై అతికించి, అదనంగా మరో కాపీని పరీక్షా కేంద్రానికి తీసుకురావాలి. వారు చెల్లుబాటు అయ్యే ఫోటో ఐడి ప్రూఫ్ (ఒరిజినల్ కాపీ) కూడా తీసుకెళ్లాలి. ఆమోదించిన ఫోటో ఐడీల జాబితా సమాచార కరపత్రంలో ఉవ్వడం జరిగింది. దీనిని పైన ఇచ్చిన లింక్ ఉపయోగించి యాక్సెస్ చేయవచ్చు.

మరిన్ని వివరాలకు అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్​ని సందర్శించాలి.

క్యాట్ 2024​ రిజిస్ట్రేషన్ షురూ..

కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) 2024 కోసం ఆన్​లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. క్యాట్ 2024కు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు iimcat.ac.in లో తమ ఫారాలను సమర్పించవచ్చు. క్యాట్​ 2024 రిజిస్ట్రేషన్​ చివరి తేదీ సెప్టెంబర్ 13 (సాయంత్రం 5 గంటలు). డైరెక్ట్ లింక్, అర్హత ప్రమాణాలు, ముఖ్యమైన తేదీలు, పరీక్ష ఫీజు, ఐఐఎం ఎంపిక ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఇక్కడ తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024



Source link