Devara Second Single Promo: దేవర రెండో పాట ప్రోమో వచ్చేసింది.. ఎన్టీఆర్, జాన్వీ రొమాంటిక్ మెలోడీ రెడీ

Best Web Hosting Provider In India 2024

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమాపై క్రేజ్ ఓ రేంజ్‍లో ఉంది. ఈ చిత్రంలో బాలీవుడ్ యంగ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. భారీ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీని దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉండగా.. అందుకు తగ్గట్టు గ్రాండ్‍స్కేల్‍లో ఈ మూవీ రూపొందుతోంది. దేవర నుంచి రెండో పాట వచ్చేందుకు రెడీ అయింది. ఈ సాంగ్ ప్రోమో నేడు (ఆగస్టు 3) రిలీజైంది.

 

ప్రోమో ఇలా.. మెలోడియస్‍గా..

దేవర సినిమాలో రెండో పాటకు సంబంధించిన ప్రోమో నేడు వచ్చింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కౌగిలించుకున్న పోస్టర్‌తో ఈ వీడియో వచ్చింది. బ్యాక్‍గ్రౌండ్‍లో మెలోడియస్‍గా ఉన్న హమ్మింగ్‍తో ఈ ప్రోమో ఉంది. రేపు (ఆగస్టు 5) ఫుల్ సాంగ్ రానుంది. ఈ చిత్రానికి తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

దేవరలో ఈ రెండో పాటను తెలుగులో శిల్పా రావ్ ఆలపించారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సాంగ్ రానుంది. ఆయా భాషలకు వేర్వేరే లిరిక్స్ రైటర్లు ఉన్నారు. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళంలో ఈ సాంగ్‍ను శిల్పా రావ్ ఆలపించారు. తమిళంలో దీప్తి సురేశ్ పాడారు.

జాన్వీ తొలిసారి..

దేవర నుంచి ఈ రొమాంటిక్ మెలోడీ సాంగ్ రేపు రిలీజ్ కానుంది. ఈ పాటపై చాలా ఆసక్తి నెలకొంది. జాన్వీ కపూర్ తొలిసారి తెలుగు పాటలో కనిపించనున్నారు. ఈ చిత్రంతోనే బాలీవుడ్ బ్యూటీ జాన్వీ టాలీవుడ్‍లో అరంగేట్రం చేస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీ కెమెస్ట్రీ ఎలా ఉంటుందననే క్యూరియాసిటీ కూడా ఉంది.

దేవర నుంచి వచ్చిన తొలి పాట ‘ఫియర్ సాంగ్’ చాలా పాపులర్ అయింది. ఈ సాంగ్ మార్మోగుతూనే ఉంది. ఈ పాటకు ట్రెండీగా ఉంటూనే మాస్ బీట్ ఇచ్చారు సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ రెండో సాంగ్‍కు మెలోడియస్ ట్యూన్ ఇచ్చారు. దీంతో ఈ పాట ఎలా ఉంటుందోననే ఆసక్తి ఉంది.

 

దేవర సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. సెప్టెంబర్ 27వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈనెలలోనే షూటింగ్ కంప్లీట్ చేయాలని దర్శకుడు కొరటాల శివ టార్గెట్ పెట్టుకున్నారు.

దేవర మూవీలో ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ పోషిస్తున్నారని తెలుస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‍గా తంగం పాత్ర చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్లు సైఫ్ అలీ ఖాన్, బాబీ డియోల్ విలన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, శృతి మారథే, నరైన్, మురళీ శర్మ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

దేవర సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ, నందమూరి కల్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ బ్యానర్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సుమారు రూ.200కోట్ల బడ్జెట్ అని అంచనాలు ఉన్నాయి.

WhatsApp channel
 

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024