Best Web Hosting Provider In India 2024
1999లో పాకిస్థాన్‍కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు.. ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన ఘటన ఆధారంగా వెబ్ సిరీస్ వస్తోంది. ‘ఐసీ 814: ది కాందహార్ హైజాక్’ పేరుతో ఈ సిరీస్ తెరకెక్కుతోంది. ఈ సిరీస్‍లో విజయ్ వర్మ, నజీరుద్దీన్ షా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ టీజర్‌ను నేడు (జూలై 3) నెట్‍ఫ్లిక్స్ తీసుకొచ్చింది. అలాగే స్ట్రీమింగ్ డేట్‍ను వెల్లడించింది. ఈ టీజర్ ఎలా ఉందంటే..
టీజర్ ఇలా..
నేపాల్ రాజధాని ఖట్మాండు నుంచి న్యూఢిల్లీ విమానాశ్రయానికి బయలుదేరే ఇండియన్ ఎయిర్‌లైన్స్ ‘ఐసీ 814’ విమానంలో వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవడంతో ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్ టీజర్ మొదలైంది. అందరినీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని పైలట్ శరణ్ దేవ్‍గా నటించిన విజయ్ వర్మ సూచిస్తారు. అప్పుడు ప్రయాణికులందరూ రిలాక్స్ అవుతారు. ఆ తర్వాత ముసుగు వేసుకున్న ఐదుగురు పాకిస్థాన్ ఉగ్రవాదులు ప్రయాణికులకు తుపాకులు గురిపెడతారు. ఎయిర్ హోస్టెస్‍పై దాడి చేస్తారు. ఆ తర్వాత విమానం హైజాక్ అయినట్టు అందరికీ అర్థమవుతుంది.
ఈ హైజాక్‍తో దేశమంతా ఉలిక్కిపడినట్టు టీజర్లో ఉంది. భారత ప్రభుత్వంలో ఉన్నతాధికారులు హైజాక్ తర్వాత ఢిల్లీలో చర్యలకు ఉపక్రమిస్తారు. అప్పట్లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న కాందహార్‌కు విమానాన్ని తరలించేలా చర్యలు తీసుకుంటారు. ఇలా గ్రిప్పింగ్‍గా ఈ టీజర్ ఉంది.
ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్‍లో అధికారులుగా నజీరుద్దీన్ షా, పంకజ్ కపూర్, దియా మీర్జా, మనోజ్ పహ్వా కనిపించారు. అరవింద స్వామి కూడా ఓ పాత్ర చేశారు.
ఐసీ 814: ది కాందహార్ హైజాక్ సిరీస్‍కు అనుభవ్ సిన్హా దర్శకత్వం వహించారు. ముల్క్, తప్పడ్, అర్టికల్ 17, భీడ్ లాంటి సినిమాలను తెరకెక్కించిన ఆయన ఈ సిరీస్‍తో ఓటీటీల్లోకి అడుగుపెడుతున్నారు. మ్యాచ్ బాక్స్ షాట్స్, బెనారస్ మీడియా వర్క్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ ఆగస్టు 29వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. టీజర్ హిందీలోనే వచ్చింది. అయితే, ఈ సిరీస్ ఇతర కొన్ని భాషల్లోనూ స్ట్రీమింగ్‍కు వచ్చే అవకాశం ఉంది. ఐదుగురు హైజాకర్లు, 188 జీవితాలు, 7 రోజుల భయానకం అంటూ ఈ టీజర్‌ను పోస్ట్ చేసింది నెట్‍ఫ్లిక్స్. యథార్థ ఘటనలతో ఈ సిరీస్ రూపొందించినట్టు పేర్కొంది.
హైజాక్ వివరాలు
నేపాల్ నుంచి ఢిల్లీకి రావాల్సిన ఐసీ 814 విమానాన్ని 1999 డిసెంబర్ 24వ తేదీన పాకిస్థాన్‍కు చెందిన హర్కత్ ఉల్ ముజాహిద్దీన్‍కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హైజాక్ చేశారు. ఆ తర్వాత వివిధ ప్రాంతాలకు విమానాన్ని తీసుకెళ్లాలని పైలట్లను బెదిరించారు. చివరగా కాందహార్‌కు ఈ విమానాన్ని తీసుకెళ్లారు. ఏడు రోజుల పాటు ప్రయాణికులను అదే విమానంలో బంధించారు. ముగ్గురు టెర్రరిస్టులను విడుదల చేసేందుకు భారత ప్రభుత్వం అంగీకరించటంతో విమానాన్ని చివరికి వదిలేశారు. దీంతో దేశమంతా ఊపిరి పీల్చుకుంది. ఈ ఘటనపై ఇప్పుడు ఐసీ 814: ది కాందహార్ హైజాక్ వెబ్ సిరీస్ వస్తోంది. ఆగస్టు 29 నుంచి నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది.