Best Web Hosting Provider In India 2024
05 Aug 2024 4:11 PM

తాడేపల్లి: ఉగాది పండుగ రోజున వాలంటీర్లకు శుభవార్త అంటూ చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వాలంటీర్ల జీతం రూ.10 వేలు చేస్తామని కపట హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు మార్కు రాజకీయం మొదలుపెట్టారు. వాలంటీర్ వ్యవస్థపై మొదటి నుంచి అక్కసు వెళ్లగక్కిన చంద్రబాబు.. ఎన్నికల ముందు మాత్రం కపట హామీలతో వారిని మభ్యపెట్టి.. గెలిచాక నట్టేట ముంచేశాడు. వాలంటీర్ వ్యవస్థ నిర్వీర్యంపై క్లారిటీ ఇస్తూ.. వాలంటీర్ గ్రూప్లన్నీ డిలీట్ చేయాలని అధికారులకి ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. చంద్రబాబు తేనె పూసిన కత్తికి బలైపోయి రోడ్డున పడిన లక్షలాది మంది వాలంటీర్లు.