New Study: చదివింది బాగా గుర్తుండాలా? అయితే మీ పిల్లలకు రోజుకో గుడ్డును తినిపించమని చెబుతున్న కొత్త అధ్యయనం

Best Web Hosting Provider In India 2024


New Study: వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వ్యాధి త్వరగా వచ్చేస్తుంది. అలాగే పిల్లల్లో చదివింది గుర్తుండకపోవడం, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు వస్తాయి. అలాంటివారు ప్రతిరోజూ ఒక గుడ్డును తినడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజూ గుడ్డు తినే అలవాటు ఉన్నవారికి బ్రెయిన్ డిజార్డర్లు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుందని కొత్త అధ్యయనం నిరూపించింది. ఈ అధ్యయనం తాలూకు వివరాలను జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్లో ప్రచురించారు. గుడ్లు అల్జీమర్స్ వ్యాధి నుంచి, చిత్త వైకల్యం నుంచి రక్షణ కల్పిస్తాయని ఈ అధ్యయనం నిరూపించాయి.

కోడిగుడ్లు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయని అందరికీ తెలిసిందే. ముఖ్యంగా మెదడు ఆరోగ్యాన్ని కాపాడడంలో గుడ్లు ప్రధానమైనవి. ప్రతిరోజూ ఒక గుడ్డు తినే పిల్లలు, వృద్దులు అల్జీమర్స్ వ్యాధిబారినా త్వరగా పడకుండా ఉంటారు. అలాగే వారికి కొన్ని విషయాలు ఎక్కువ కాలం గుర్తుండే అవకాశం ఉంది. ఈ అధ్యయనంలో భాగంగా ఆరున్నర సంవత్సరాల పాటు 1000 మందిని, వారి ఆరోగ్య పరిస్థితులను అంచనా వేశారు. వీరిలో తక్కువ గుడ్లు తినే వారితో పోలిస్తే వారానికి ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినే వారికి అల్జీమర్స్, డిమెన్షియా వచ్చే ప్రమాదం 47 శాతం తక్కువగా ఉందని అధ్యయనంలో తేలింది. ప్రతి వారం ఒకటి కంటే ఎక్కువ గుడ్లు తినేవారు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉన్నట్టు అధ్యయనం చెప్పింది.

గుడ్డులో కీలకమైన పోషకం కోలిన్ ఉంటుంది. ఇది గుడ్డులోని పచ్చ సొనలో ఉంటుంది. ఇది అల్జీమర్స్‌ రాకుండా అడ్డుకుంటుంది. ముఖ్యంగా గుడ్లలో లూటీన్, జియాక్సంతిన్ అధికంగా ఉంటాయి. ఈ రెండూ కూడా మెదడు ఆరోగ్యాన్ని, జ్ఞాపకశక్తిని కాపాడుతూ ఉంటాయి.

జ్ఞాపకశక్తి పెరుగుతుంది

మీ పిల్లలు చదివింది బాగా గుర్తుండాలన్నా, వారి జ్ఞాపకశక్తి పెరగాలన్నా ప్రతిరోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును వారికి తినిపించండి. ఇది వారికి మెదడు సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది.ఇది కండరాల మరమ్మతుకు, పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఒక పెద్ద గుడ్డులో ఆరు గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మన శరీరానికి ఎంతో ఉపయోగపడుతుంది.

గుడ్డు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని ఎంతోమంది భావిస్తారు. నిజానికి గుడ్లలో ఉండే కొలెస్ట్రాల్… మంచి కొలెస్ట్రాల్. ఇది గుండెకు అత్యవసరమైనది. గుడ్లలోని అమైనో ఆమ్లాలు గుండెను రక్షిస్తాయి. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించి గుండెకు రక్షణ కల్పిస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. నీలి కాంతి వల్ల కలిగే నష్టాన్ని నుండి కళ్ళను రక్షిస్తాయి. సంబంధిత కంటి సమస్యలు రాకుండా కాపాడతాయి. కంటి శుక్రాల ప్రమాదాన్ని తగ్గించడంలో కోడిగుడ్లు ముందుంటాయి.

బరువు తగ్గుతారు

గుడ్డు తినడం వల్ల వరువు పెరుగుతామని ఎంతోమంది అనుకుంటారు. నిజానికి ఒక గుడ్డు తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. గుడ్లు తక్కువ క్యాలరీలను, అధిక ప్రోటీన్లను కలిగి ఉంటాయి. ఈ గుడ్డును తింటే త్వరగా పొట్ట నిండిన ఫీలింగ్ వస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినరు. బరువు తగ్గాలనుకునే వారు ప్రతిరోజూ ఒక కోడి గుడ్డును తినడం అలవాటుగా మార్చుకోండి.

WhatsApp channel

Source / Credits

Best Web Hosting Provider In India 2024