Best Web Hosting Provider In India 2024
హిందీ సినిమా ఘూడ్చాడీ నేరుగా ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజ్ కాకుండా స్ట్రీమింగ్కు రానుంది. బాలీవుడ్ సీనియర్ స్టార్ సంజయ్ దత్, రవీనా టాండన్, పార్థ్ సమ్తాన్, ఖుశాలీ కుమార్ ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి బినోయ్ కే గాంధీ దర్శకత్వం వహించారు. రిలీజ్ ఆలస్యాల తర్వాత ఎట్టకేలకు ఈ చిత్రం ఓటీటీలోకే అడుగుపెట్టనుంది.
స్ట్రీమింగ్ డేట్ ఇదే
ఘూడ్చాడీ సినిమా ఆగస్టు 9వ తేదీన జియోసినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్కు రానుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంది. అయితే, హిందీలో ఒక్కటే ఈ మూవీ జియోసినిమాలో స్ట్రీమింగ్కు వస్తుందా.. డబ్బింగ్ వెర్షన్లు కూడా అందుబాటులోకి వస్తాయా అనేది చూడాలి.
సెలెబ్రిటీల కోసం ఘూడ్చాడీ సినిమా స్క్రీనింగ్‌ను మూవీ టీమ్ నేడు నిర్వహించింది. ముంబైలో జరిగిన ఈ స్క్రీనింగ్‌కు బాలీవుడ్ సెలెబ్రెటీలు కొందరు హాజరయ్యారు. జియోసినిమా ఓటీటీలో ఆగస్టు 9 నుంచి ఈ చిత్రాన్ని చూడొచ్చు.
ఘూడ్చాడీ సినిమాకు దర్శకుడు బినోయ్ కే గాంధీతో పాటు దీపక్ కపూర్ భరద్వాజ్ కూడా కథను అందించారు. రెండు తరాల జంటల మధ్య ప్రేమ కథతో ఈ మూవీని తెరక్కించారు డైరెక్టర్. ఈ చిత్రానికి తనిష్ బాగ్చీ, సుఖ్బీర్, లిజో జార్జ్ – డీజే చీతాస్ మ్యూజిక్ అందించారు.
థియేటర్లకు అనుకొని..
ఘూడ్చాడీ సినిమాను ముందుగా థియేటర్లలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకున్నారు. రెండేళ్ల క్రితమే ఈ మూవీ షూటింగ్ మొదలైంది. 2022 నవంబర్లోనే చిత్రీకరణ పూర్తయింది. అయితే, థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ ప్రయత్నించినా ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూ వచ్చింది. దీంతో నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. జియోసినిమా ఓటీటీకి ఈ చిత్రాన్ని విక్రయించారు.
స్టోరీలైన్.. ట్విస్ట్‌తో..
ఘూడ్చాడీ ట్రైలర్ ఇప్పటికే వచ్చేయడంతో స్టోరీ దాదాపు తెలిసిపోయింది. చిరాగ్ (పార్థ్ సమ్తాన్), బేబికా (ఖుశాలీ కుమార్) ప్రేమ చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుంది. చిరాగ్, బేబికా ప్రేమలో పడిన తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. పెద్దలకు చెప్పాలని అనుకుంటారు. చిరాగ్ తండ్రి (సంజయ్ దత్), బేబిక తల్లి (రవీనా) టాండన్ ఒకప్పుడు గాఢంగా ప్రేమించుకున్నారనే విషయం బయటపడుతుంది. ఈ ట్విస్టుతో చిరాగ్, బేబికా పరిస్థితి గందరగోళంలో పడుతుంది. తల్లిదండ్రుల ప్రేమ గురించి తెలుసుకున్న ఆ ఇద్దరూ ఏం చేశారు? ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఈ మూవీలో చూడాలి. రొమాన్స్, కామెడీ, డ్రామాతో ఈ మూవీ ఉండనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.