నేడు పార్టీ ప్రజాప్రతినిధులతో వైయ‌ఎస్‌ జగన్‌ భేటీ 

Best Web Hosting Provider In India 2024

తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులతో అధినేత‌ వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇవాళ‌ సమావేశం నిర్వహించనున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో ప్రజాప్రతినిధులతో భేటీ కానున్నారు.
అరకు, పాడేరు నియోజకవర్గాల్లోని ఆ పార్టీ ప్రజాప్రతినిధులు హాజరుకానున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ పేరు ప్రకటించిన పార్టీ అధినేత.. బొత్స గెలుపుపై ఎంపీటీసిలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలలో వ్యవహరించాల్సిన తీరుపై వైయ‌స్‌ జగన్‌ దిశానిర్దేశం చేయనున్నారు.

Best Web Hosting Provider In India 2024