OTT Action Thriller Movie: ఓటీటీలో దుమ్ము రేపుతున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. అరుదైన మైల్‌స్టోన్

Best Web Hosting Provider In India 2024


OTT Action Thriller Movie: ఓటీటీలో బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయీ నటించిన మూవీ దూసుకెళ్తోంది. అతని కెరీర్లో 100వ సినిమా కావడం ఓ మైలురాయి కాగా.. ఇప్పుడు ఓటీటీలోనూ మరో అరుదైన మైలురాయిని అందుకుంది. మే 24న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా రెండు నెలల తర్వాత ఓటీటీలో అడుగుపెట్టగా.. కొన్ని రోజుల్లోనే 200 మిలియన్ల వాచ్ మినట్స్ రికార్డును సొంతం చేసుకుంది.

ఓటీటీలో భయ్యాజీ రికార్డు

విలక్షణ నటుడు మనోజ్ బాజ్‌పాయీ నటించిన మూవీ భయ్యాజీ. ఈ సినిమా జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అపూర్వ్ సింగ్ కర్కి డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఆ ఓటీటీలో 200 మిలియన్ల వాచ్ మినట్స్ మైలురాయి అందుకుంది. ఈ సందర్బంగా జీ5 ఓటీటీ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది. భయ్యాజీ మంట పుట్టిస్తున్నాడంటూ ఈ అప్డేట్ షేర్ చేసింది.

“భయ్యాజీ అయితే మంట పుట్టిస్తున్నాడు. 200 మిలియన్ల వాచ్ మినట్స్. అతడే అసలు ఒరిజినల్. మనోజ్ భయ్యాజీ 100వ సినిమా భయ్యాజీ ఇప్పుడు జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది” అనే క్యాప్షన్ తో ఈ విషయాన్ని వెల్లడించింది. జులై 27వ తేదీని ఈ సినిమా జీ5 ఓటీటీలోకి అడుగుపెట్టింది. మూడు రోజుల్లోనే సినిమా 100 మిలియన్ల స్ట్రీమింగ్ మినట్స్ మార్క్ అందుకున్నట్లు అప్పట్లో ఓటీటీ వెల్లడించింది.

భయ్యాజీపై మనోజ్ ఏమన్నాడంటే?

ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తీసిన సత్య సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులతోపాటు దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు మనోజ్ బాజ్‌పాయీ. ఆ తర్వాత తన కెరీర్లో ఎన్నో మైల్ స్టోన్ మూవీస్ చేశాడు. ఈ మధ్య కాలంలో సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై, జోరమ్ లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో అలరిస్తున్నాడు. ఈ భయ్యాజీ కంటే ముందే ఇదే జీ5 ఓటీటీలో సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై మూవీ కూడా రికార్డులు క్రియేట్ చేసింది.

తాజాగా భయ్యాజీ మూవీపైనా గతంలో మనోజ్ స్పందించాడు. “ఇందులో చాలా వరకు యాక్షన్ సీన్లను నేనే చేయడంతో ఇది చాలా కష్టంగా అనిపించింది. తమిళ ఇండస్ట్రీకి చెందిన ఫెఫ్సీ విజయన్ దీనికి ఫైట్ మాస్టర్ గా ఉన్నాడు. అతడు అన్ని యాక్షన్ సీన్లూ నేనే చేయాలని పట్టుబట్టాడు” అని మనోజ్ చెప్పాడు. సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై మూవీ తీసిన అపూర్వ్ సింగే ఈ భయ్యాజీ కూడా డైరెక్ట్ చేశాడు.

నిజానికి ఈ రెండూ పూర్తిగా రెండు డిఫరెంట్ జానర్ సినిమాలు. సిర్ఫ్ ఏక్ బంధా కాఫీ హై ఓ లీగల్ డ్రామా. ఆశారాం బాపు లైంగిక వేధింపుల కేసు ఆధారంగా తెరకెక్కిన సినిమా అది. ఆ సినిమాకు కూడా ఓటీటీలో మంచి రెస్పాన్స్ వచ్చింది.

Best Web Hosting Provider In India 2024


Source / Credits

Best Web Hosting Provider In India 2024