Best Web Hosting Provider In India 2024

దక్షిణ మధ్య రైల్వే కీలక అప్డేట్ ఇచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పలు రూట్ల మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది తిరుపతి- కాచిగూడ మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు పేర్కొంది. వికారాబాద్ – మచిలీపట్నం, నర్సాపూర్ – సికింద్రాబాద్, హైదరాబాద్ – సంత్రగాచి మధ్య ఈ రైళ్లు సేవలు అందిచనున్నాయి.
కాచిగూడ- తిరుపతి (07653) దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైలును నడపనుంది. ఆగస్టు 14, 16న రాత్రి 22.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 10.25 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఇక తిరుపతి- కాచిగూడ (07654) మధ్య కూడా స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 15, 17న రాత్రి 07.50 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటిరోజు ఉదయం 09.30 గంటలకు కాచిగూడ చేరుకోనుంది.
ఈ ప్రత్యేక రైళ్లు ఉమానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, యర్రగుంట్ల, కడప, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని అధికారులు ప్రకటించారు.
ఇక వికారాబాద్ – మచిలీపట్నం మధ్య ప్రత్యేక రైలు నడవనుంది. ఆగస్టు 13 , 15 తేదీల్లో మచిలీపట్నం నుంచి రాత్రి 10 గంటలకు రైలు బయల్దేరుతుంది. ఉదయం 09 గంటలకు వికారాబాద్ చేరుకుంటుంది. ఇక వికారాబాద్ – మచిలీపట్నం మధ్య కూడా స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంటుంది. ఆగస్టు 14, 16 తేదీల్లో రాత్రి 07 గంటలకు బయల్జదేరి… మరునాడు ఉదయం 05. 30 గంటలకు వికారాబాద్ కు చేరుకుంటుంది. ఈ ప్రత్యేక రైళ్లు గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్లు, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగపల్లి స్టేషన్లలో ఆగుతుంది.
హైదరాబాద్ – సంత్రగాచి మధ్య ఆగస్టు 14వ తేదీన ప్రత్యేక రైలు ఉంటుంది. ఉదయం 05. 30 హైదరాబాద్ నుంచి బయల్దేరి… మరునాడు మధ్యాహ్నం 12 గంటలకు సంత్రగాచికి చేరుతుంది. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి సంత్రగాచి నుంచి మరో రైలు హైదరాబాద్ బయల్దేరుతుంది. ఇది మధ్యాహ్నం 03. 50 గంటలకు బయల్దేరి… మరునాడు సాయంత్రం 05. 30 గంటలకు హైదరాబాద్ కు చేరుకుంటుంది.
నర్సాపూర్ – నాగర్ సోల్ మధ్య ప్రత్యేక రైలును ప్రకటించారు అధికారులు. ఈ ట్రైన్ ఆగస్టు 13వ తేదీ నర్సాపూర్ నుంచి బయల్జేరి… మరునాడు ఉదయం 10 గంటలకు నాగర్ సోల్ కు చేరుతుంది. ఇక నాగర్ సోల్ నుంచి ఆగస్టు 14వ తేదీన బయల్దేరి… మరునాడ మధ్యాహ్నం 12 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
నర్సాపూర్ – సికింద్రాబాద్ మధ్య మరో సర్వీస్ నడవనుంది. ఆగస్టు 15వ తేదీన రాత్రి 8 గంటలకు నర్సాపూర్ నుంచి స్పెషల్ ట్రైన్ బయల్దేరుతుంది. మరునాడు ఉదయం 8 గంటలకు సికింద్రాబాద్ కు చేరుతుంది. ఇక సికింద్రాబాద్ – నర్సాపూర్ మధ్య కూడా ట్రైన్ ఉంది. ఇది ఆగస్టు 16వ తేదీన సాయంత్రం 05. 50 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయల్దేరి…. మరునాడు ఉదయం 5 గంటలకు నర్సాపూర్ కు చేరుకుంటుంది.
టాపిక్